S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/29/2017 - 00:32

హైదరాబాద్, ఆగస్టు 28: భారత్ నుంచి మరింతగా పర్యాటకులను ఆకర్షించడానికి ఇజ్రాయెల్.. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రోడ్‌షోలు ఈ నెల 21న ముంబయిలో ప్రారంభమైయ్యాయి. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు మీదుగా జరిగి చైన్నైలో ఈ నెల 30న ఈ రోడ్‌షోలు ముగియనున్నాయి.

08/28/2017 - 00:31

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసిపోతుండటం, జిడిపి గణాంకాలు వెలువడుతుండటంతో ఈ వారం స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం జిడిపి గణాంకాలు రానుండగా, శుక్రవారం పిఎమ్‌ఐ తయారీ గణాంకాలు వెలువడుతు న్నాయ.

08/28/2017 - 00:30

న్యూఢిల్లీ, ఆగస్టు 27: మధ్య శ్రేణి, భారీతరహా కార్లు, స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్స్ (ఎస్‌యువి)పై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లోగల సెస్సును పెంచడానికి ఓ ఆర్డినెన్సును జారీచేసే అంశాన్ని కేంద్ర కేబినెట్ ఈ వారం పరిశీలించే అవకాశాలున్నాయి. జిఎస్‌టిలో ఈ సెస్సు ప్రస్తుతం 15 శాతం వద్ద ఉండగా, దాన్ని 25 శాతానికి పెంచాలని భావిస్తున్నారు.

08/28/2017 - 00:29

పర్యాటకులకు అత్యుత్తమ హాలీడే అనుభవాలను అందించాలనే లక్ష్యంతో ట్రిప్ ఫ్యాక్టరీ తమ తొలి స్టోర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ప్రారం భించింది. ఈ సందర్భం గా నిర్వాహకులు మాట్లాడుతూ వివిధ అంతర్జాతీయ ప్రాంతాల కు తాము అందించే ప్యాకేజీలను వివరించారు

08/28/2017 - 00:27

హైదరాబాద్, ఆగస్టు 27: దేశంలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిజ్ ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం 2013లో తెచ్చిన ఈ-బిజ్ పోర్టల్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దేశంలో ఎక్కడైనా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను నెలకొల్పేందుకు దోహదపడే ఈ పోర్టల్‌ను కేంద్రం రూపొందించింది.

08/28/2017 - 00:26

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణకు అవసరమైన కూరగాయలు పండించడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయకి చేరుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఆదివారం తెలంగాణ ఉద్యాన మహోత్సవం-2017ను మంత్రి ప్రారంభించారు.

08/28/2017 - 00:23

హైదరాబాద్, ఆగస్టు 27: పాత పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలకు సునామీలా వచ్చిన ఈ-వాలెట్ల ఉధృతి తగ్గింది. మొదట ఈ-వాలెట్ల హవా కొనసాగినా.. మళ్లీ బ్యాంకుల డిజిటల్ విధానాల ద్వారా నగదు లావాదేవీలు పెరిగాగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) విడుదల చేసిన గణాంకాలను విశే్లషిస్తే ఎనిమిది ఈ-వాలెట్ల లావాదేవీలు 2016 నవంబర్‌లో 42 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరికి 31 శాతానికి పడిపోయాయి.

08/28/2017 - 00:23

న్యూఢిల్లీ, ఆగస్టు 27: భారతీయ స్టాక్ మార్కెట్లకు వివిధ దేశాలకు చెందిన పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ) నెమ్మదిగా దూరమైపోతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ల నుంచి 12,626 కోట్ల రూపాయల (1.96 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు తరలిపోవడమే దీనికి నిదర్శనం.

08/27/2017 - 00:49

బెంగళూరు, ఆగస్టు 26: ఇన్ఫోసిస్‌కు గత వైభవాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ఆ సంస్థ నూతన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో నీలేకని తిరిగి సంస్థకు చేరగా, సారథ్య బాధ్యతలను స్వీకరించినది తెలిసిందే.

08/27/2017 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్).. బాండ్ల ద్వారా 7,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ కోసం భాగస్వాముల అనుమతిని కోరనుంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 23న వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని ఓ ప్రత్యేక తీర్మానాన్ని ఆయిల్ ఇండియా ప్రతిపాదించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కూ సంస్థ శనివారం తెలియజేసింది.

Pages