S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/27/2017 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశీయ నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ ప్రమోటర్లు తమ సంస్థ రెంటల్ విభాగంలోని మొత్తం 40 శాతం వాటాను 11,900 కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇందులోభాగంగానే సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జిఐసికి డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ (డిసిసిడిఎల్)లోని 33.34 శాతం వాటాను 8,900 కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారు.

08/27/2017 - 00:45

దేశీయ మార్కెట్‌లోకి హోండా సంస్థ సరికొత్త జాజ్ మోడల్ కారును తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధరల శ్రేణి 7.36 లక్షల నుంచి 8.82 లక్షల రూపాయల మధ్య ఉంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇవి అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది

08/27/2017 - 00:43

బజాజ్ ఆటో.. మార్కెట్‌కు సిటి 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్‌ను పరిచయం చేసింది.
దీని ధర మహారాష్ట్ర ఎక్స్‌షోరూం ప్రకారం 38,806 రూపాయలు. సిటి 100 అల్లాయ్,
సిటి 100 బి కిక్-స్టార్ట్ మోడళ్లూ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది

08/27/2017 - 00:41

హైదరాబాద్, ఆగస్టు 26: ఇంటర్‌నెట్ వెర్రిలో పడి రకరకాల మానసిక వ్యాధులకు గురవుతున్న యువత.. కొత్తగా నెట్ గేమ్స్ వలలో పడి విలవిలలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలు తీస్తున్న బ్లూవేల్ గేమ్ టాస్క్‌లకు భారత్‌లోనూ కొంతమంది బలయ్యారు. ఇప్పుడు ఆ గేమ్ తెలుగు రాష్ట్రాలకూ పాకుతోందని విద్యావేత్తలు వాపోతున్నారు.

08/27/2017 - 00:39

హైదరాబాద్, ఆగస్టు 26: మహానగరంలో ఆకలితో అలమటించే వారికి పట్టెడన్నం పెట్టేందుకు కేవలం ఐదు రూపాయలకే ‘అన్నపూర్ణ’ భోజనాన్ని అందిస్తున్న జిహెచ్‌ఎంసి.. ఇప్పుడు అతి తక్కువ ధరకే నాణ్యమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ‘ఎనీ టైం వాటర్’ కార్యక్రమం పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కియోస్క్‌ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం ప్రారంభించారు.

08/27/2017 - 00:25

హైదరాబాద్, ఆగస్టు 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిఎస్‌టి అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇకమీదట ప్రతి నెలా వర్తక, వ్యాపార సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

08/25/2017 - 00:46

ముంబయి, ఆగస్టు 24: అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్తబ్దుగా సాగాయి. అయితే దేశీయ మదుపరుల మద్దతుతో వరసగా మూడో రోజు కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకర్ల సదస్సు నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడం కూడా మార్కెట్ల స్తబ్దతకు కారణమైనాయి.

08/25/2017 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్ (టిజిబిఎల్)లో తనకు గల వాటాలో 2.03 శాతం వాటాను ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) బహిరంగ మార్కెట్లో అమ్మేసింది. దీంతో టిజిబిఎల్‌లో ఎల్‌ఐసి వాటా 5.67 శాతానికి తగ్గిపోయింది.

08/25/2017 - 00:44

ముంబయి, ఆగస్టు 24: అప్పుల భారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు తాజాగా మరికొన్ని ముఖ్యమైన ఆస్తులను అమ్మకానికి పెట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల తమ కార్యాలయ భవనాలతో పాటు 27 ఫ్లాట్లు, పలు నివాస, కమర్షియల్ ప్లాట్లు వీటిలో ఉన్నాయి. ఈ వేలాన్ని నిర్వహించే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసికి అప్పగించారు.

08/25/2017 - 00:43

బెంగళూరు, ఆగస్టు 24: ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నందన్ నీలేకనిని నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్ గురువారం అధికారికంగా ప్రకటించింది. నీలేకనిని కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించడాన్ని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని బోర్డు ప్రకటించింది. గురువారం సాయంత్రం మార్కెట్ రెగ్యులేటర్ సెబికి సమర్పించిన ఒక ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయం తెలిపింది.

Pages