S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/25/2017 - 00:41

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత దేశం మరో 2-3 ఏళ్లలో 8 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీతి ఆయోగ్ గురువారం పేర్కొంది. దేశంలోని 125 కోట్ల మంది పౌరులు సుఖ సంతోషాలతో ఉండడానికి అనేక సంస్కరణలు తీసుకు రావలసిన అవసరం ఉందని కూడా తెలిపింది.

08/25/2017 - 00:41

రాజమహేంద్రవరం, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్ వినాయకచవితి శోభతో కళకళలాడుతోంది. చవితిని పురస్కరించుకుని గత మూడు రోజులుగా కడియపులంక మార్కెట్‌లో పూల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ తోటల నుండి దిగుబడులు ఇంకా రాకపోవడంతో కర్ణాటక, తమిళనాడు నుండి పూలను భారీగా దిగుమతి చేసుకుంటున్నారు.

08/25/2017 - 00:39

ప్రీమియం బైకుల తయారీలో పేరెన్నికగన్న బ్రిటన్ ఆటోమొబైల్ సంస్థ ట్రంప్ గురువారం తమ సరికొత్త స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 900 సిసి ఇంజన్‌తో రూపొందించిన ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.8.10 లక్షలుగా నిర్ణయంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

08/25/2017 - 00:36

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) తమ పొదుపు ఖాతాల్లోని 50 లక్షల రూపాయల లోపు డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును 3.5 శాతానికి (50 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. అయితే రూ.50 లక్షలు పైబడిన సేవింగ్స్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 4 శాతంగానే కొనసాగుతుందని ఆ బ్యాంకు ప్రకటించింది.

08/25/2017 - 00:35

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే త్రైమాసికాల్లో మరింతగా కోలుకోవచ్చని, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చని ఫిట్జ్ గ్రూపునకు చెందిన బిఎంఐ రిసెర్చ్ ఒక నివేదికలో అభిప్రాయ పడింది.

08/25/2017 - 00:34

న్యూఢిల్లీ, ఆగస్టు 24: లెదర్ గూడ్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులతో పాటు కొన్ని రకాల జౌళి వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని ఉజ్బెకిస్తాన్‌కు భారత్ విజ్ఞప్తి చేసిందని కేంద్ర వాణిజ్య శాఖ గురువారం వెల్లడించింది.

08/25/2017 - 00:34

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశంలోని కార్మికులకు, ప్రత్యేకించి అసంఘటిత రంగ కార్మికులకు ఎనలేని సేవలను అందజేస్తున్న ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) తమ చందాదారులకు మరింత మెరుగైన సేవలను అందజేయడమే లక్ష్యంగా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కాగిత రహిత (పేపర్‌లెస్) సంస్థగా మారనుంది.

08/24/2017 - 02:12

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ బోర్డులోకి సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన రావాలని సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్.. సంక్షోభంలో కూరుకుపోయినది తెలిసిందే. సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తగా, గత వారం సిఇఒ విశాల్ సిక్కా రాజీనామా కూడా చేశారు.

08/24/2017 - 02:09

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. దీంతో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ ఏర్పడింది.

08/24/2017 - 02:08

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4జి ఫీచర్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ గురువారం నుంచి మొదలవుతున్నాయి. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో 500 రూపాయలు చెల్లించి ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో డెలివరీ సమయంలో మిగతా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం 1,500 రూపాయలను మూడేళ్ల తర్వాత వినియోగదారులకు తిరిగి ఇచ్చేస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించినది తెలిసిందే.

Pages