S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/24/2017 - 02:07

హైదరాబాద్: జిఎస్‌టి (వస్తు సేవల పన్ను) మండలి సమావేశం వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహిస్తారు. జిఎస్‌టి గత నెల జూలై 1వ తేదీన దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చినది తెలిసిందే.

08/24/2017 - 02:07

న్యూఢిల్లీ: ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఏర్పాటులో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల వేగవంతానికి ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థను నెలకొల్పాలని బుధవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా నిధులను సమీకరించుకునేలా ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడానికి, వృద్ధిపథంలో వెళ్తున్న దేశ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.

08/23/2017 - 01:27

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. మంగళవారం దేశీయ మార్కెట్‌లోకి సరికొత్త వెర్నా కారును తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం పెట్రోల్ వేరియంట్ ధర 7.99-12.23 లక్షల రూపాయలుగా ఉండగా, డీజిల్ వేరియంట్ ధర 9.19-12.61 లక్షల రూపాయలుగా ఉంది. మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి సెడాన్ కార్లకు పోటీగా హ్యుందాయ్ న్యూ వెర్షన్ వెర్నాను మార్కెట్‌కు పరిచయం చేసింది

08/23/2017 - 01:25

స్కోడా ఇండియా.. తమ రాపిడ్ మిడ్-సైజ్ సెడాన్‌లో లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను మంగళవారం దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. మాంటే కార్లో ఎడిషన్‌గా వచ్చిన దీని ధర పెట్రోల్ వేరియంట్‌లో 10.75 లక్షల రూపాయలుగా, డీజిల్ వేరియంట్‌లో 13.57 లక్షల రూపాయలుగా ఉంది. మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వాగన్ వెంటో కార్లకు పోటీగా దీన్ని స్కోడా తీసుకొచ్చింది

08/23/2017 - 01:24

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఎస్సార్ ఆయిల్ మైనార్టీ భాగస్వాములకు అదనంగా 880 కోట్ల రూపాయలు రానున్నాయ. ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, దాని భాగస్వాములు 12.9 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నది తెలిసిందే. దీంతో ఒక్కో షేర్‌కు 338.28 రూపాయల చొప్పున ఎస్సార్‌కు వచ్చాయి. అయితే 2015లో సంస్థ డీలిస్టింగ్ సమయంలో భాగస్వాములకు ఒక్కో షేర్‌పై 262.80 రూపాయలనే ఎస్సార్ ఇచ్చింది.

08/23/2017 - 01:24

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఇన్ఫోసిస్ కో-చైర్మన్ రవి వెంకటేశన్.. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జైట్లీతో వెంకటేశన్ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. గత వారం ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా రాజీనామా చేసినది తెలిసిందే.

08/23/2017 - 01:23

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశీయ ప్రైవేట్ రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. దీపావళి కానుకగా ఓ చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో 4జి ఫీచర్ ఫోన్‌కు పోటీగా వస్తున్న ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ఫోన్ ధర కేవలం 2,500 రూపాయలేనని తెలుస్తోంది.

08/23/2017 - 01:21

హైదరాబాద్, ఆగస్టు 22: నల్లగొండ జిల్లాలో నిమ్మ, దొండ, బత్తాయిలకు ప్రత్యేక మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయతే వీటి నిర్మాణం 45 రోజుల్లో పూర్తి కావాలని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెట్ల నిర్మాణంపై మంగళవారం ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.

08/23/2017 - 01:18

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశాభివృద్ధికి సైనికుల్లా కృషి చేయాలని ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్‌ను దిగుమతులపై ఆధారపడకుండా చేయాలని, ఆ దిశగా ఉత్పాదక సామర్థ్యం స్వదేశంలో పెంపొందించాలని వారికి సూచించారు. మంగళవారం ఇక్కడ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

08/23/2017 - 01:17

ముంబయి, ఆగస్టు 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్పంగా లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33 పాయింట్లు పెరిగి 31,291.85 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11.20 పాయింట్లు అందుకుని 9,765.55 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో సెనె్సక్స్ 218.19 పాయింట్లు, నిఫ్టీ 74.10 పాయింట్లు లాభపడ్డాయి.

Pages