S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/23/2017 - 01:17

భీమవరం, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్‌లోని తపాలా కార్యాలయాలు ఇక పూర్తిగా టెక్నాలజీతో కళకళలాడనున్నాయి. టెక్నాలజీ ద్వారా తపాలా కార్యాలయాల్లోని ఖాతాదారులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని 10,323 తపాలా కార్యాలయాల్లోని సేవలు క్షణాల్లోనే అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయాల పై ప్రత్యేక దృష్టిసారించినది తెలిసిందే.

08/23/2017 - 01:15

న్యూఢిల్లీ, ఆగస్టు 22: నానాటికి పెరిగిపోతున్న స్మగ్లింగ్, నకిలీ ఉత్పత్తులు, పైరసీ.. దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలన్న భారత ఆకాంక్షను కూలదోస్తున్నాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ పరిశ్రమకు స్మగ్లింగ్, నకిలీ ఉత్పాదనలు, పైరసీ అతిపెద్ద సవాల్‌గా మారాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

08/23/2017 - 01:13

న్యూఢిల్లీ, ఆగస్టు 22: బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు దేశవ్యాప్త సమ్మెతో మంగళవారం బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీనాలు, మొండి బకాయల సమస్య, ఇతరత్రా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్‌తో పలుచోట్ల ఎటిఎమ్‌లలో నగదు కొరత ఏర్పడింది. అయతే ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడినా.. ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లు పనిచేశాయి.

08/22/2017 - 00:56

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెస్ బెంజ్.. సోమవారం భారతీయ విపణిలోకి ఎఎమ్‌జి జిటి ఆర్,
జిటి రోడ్‌స్టర్ మోడళ్లను తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూం ప్రకారం జిటి ఆర్ ప్రారంభ ధర 2.23 కోట్ల రూపాయలుగా ఉంటే,

08/22/2017 - 00:54

జపాన్ ఆటో రంగ దిగ్గజం యమహా మోటార్.. సోమవారం భారతీయ మార్కెట్‌కు సరికొత్త ఫజర్ 25 మోడల్ బైక్‌ను

08/22/2017 - 00:53

ముంబయి, ఆగస్టు 21: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. కొత్త రకం ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు సోమవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గెంటర్ బుషెక్ తెలిపారు. మరోవైపు టాటా పవర్.. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యాన్ని ఆవిష్కరించింది. ముంబయిలోని విఖ్రోలి వద్ద తొలి ఎలక్ట్రిక్ వాహన రిచార్జ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

08/22/2017 - 00:52

న్యూఢిల్లీ, ఆగస్టు 21: అశేష ప్రజాదరణ కలిగిన మేసేజింగ్ యాప్ వాట్సప్.. నకిలీ వార్తల దుష్ప్రచారానికి అడ్డుకట్టపై దృష్టి పెట్టింది. వాట్సప్ వేదికగా నడుస్తున్న పలు ఇబ్బందికర, అసత్య, అశ్లీల సందేశాలు, చిత్రాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అలన్ కావ్ సోమవారం ఇక్కడ తెలిపారు. ‘వాట్సప్ ద్వారా ఎలాంటి దుష్ప్రచారం జరగకూడదనే మేము కోరుకుంటున్నాం.

08/22/2017 - 00:52

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాదారులకు శుభవార్త. రాబోయే పండగ సీజన్ దృష్ట్యా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను ఎస్‌బిఐ ఎత్తివేసింది మరి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కార్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలుండవని సోమవారం ఓ ప్రకటనలో ఎస్‌బిఐ పేర్కొంది.

08/22/2017 - 00:50

హైదరాబాద్, ఆగస్టు 21: గ్రామీణ తపాలా (డాక్) సేవక్‌లు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడికక్కడ తపాలా సర్వీసులు నిలిచిపోయాయి. కాగా, తపాలా సర్వీసులకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తపాలా శాఖ హైదరాబాద్ సౌత్-ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ పి రాధాకృష్ణ సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

08/22/2017 - 00:48

హైదరాబాద్, ఆగస్టు 21: అఖిల భారత సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకు ఉద్యోగులంతా మంగళవారం బంద్ లో పాల్గొనాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పిలుపునిచ్చింది.

Pages