S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/22/2017 - 00:47

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ గిరిజన సహకార సంస్థ (జిసిసి)కు కొత్త పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు (జీఓ) జారీ అయ్యాయి. చైర్మన్‌గా డి మోహన్‌గాంధీ నాయక్‌ను నియమించారు.

08/22/2017 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలోకి వెల్లువెత్తుతున్న చైనా దిగుమతులకు అడ్డుకట్ట వేసేలా మొబైల్ ఫోన్ స్క్రీన్ రక్షణకు ఉపయోగించే ఆ దేశ టెంపర్డ్ గ్లాస్‌లపై మోదీ సర్కారు ఐదేళ్లపాటు దిగుమతి నిరోధక సుంకాన్ని (యాం టి డంపింగ్ డ్యూటీ) విధించింది.

08/22/2017 - 00:44

ముంబయి, ఆగస్టు 21: రుణ పీడిత ఎస్సార్ గ్రూప్.. సోమవారం రాస్‌నెఫ్ట్‌కు తమ ఎస్సార్ ఆయిల్ అమ్మకాన్ని పూర్తి చేసింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)గా పేర్కొంటున్న ఈ డీల్‌లో భాగంగా 12.9 బిలియన్ డాలర్లకు క్యాప్టివ్ పోర్టు, పవర్, రిటైల్ ఆస్తులను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఓ మదుపరుల కూటమికి ఎస్సార్ గ్రూప్ అమ్మేసింది. కాగా, ఎస్సార్ ఆయిల్ సిఇఒ రాజీనామా చేశారు.

08/22/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 21: కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్ (సిఆర్‌పిఎల్)తో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని మెక్‌డొనాల్డ్స్ రద్దు చేసుకుంది. దేశవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్‌కు 430 ఫాస్ట్ఫుడ్ ఔట్‌లెట్లుండగా, వీటిని రెండు ఫ్రాంచైజీల ద్వారా నిర్వహిస్తోంది. అందులో ఒకటి కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ లిమిటెడ్.

08/22/2017 - 00:44

హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కొత్త ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ ఇన్నోవేటివ్ ఫుడ్స్ లిమిటెడ్ (ఐఎఫ్‌ఎల్) తెలిపింది. సోమవారం ఇక్కడ సంస్థ ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) సౌరభ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో ఫ్రోజెన్ ఫుడ్ విభాగంలో దాదాపు 200 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు.

08/22/2017 - 00:43

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులను కేంద్రం ఇచ్చింది. అలాగే విజయవాడ ఎయిర్‌పోర్టులో రన్‌వే 26 విస్తరణకూ పచ్చజెండా ఊపింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అంచనా వ్యయం 2,260.73 కోట్ల రూపాయలుగా ఉంటే, విజయవాడ విమానాశ్రయం రన్‌వే విస్తరణ వ్యయం 144.93 కోట్ల రూపాయలుగా ఉంది.

08/22/2017 - 00:42

అంతర్జాతీయ స్ఫటికాకృతి శాస్త్ర 24వ మహాసభలు,, సోమవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి) వద్ద ప్రారంభమైయ్యాయ. భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న ఈ సభల్లో ప్రముఖ శాస్తవ్రేత్తలు పాల్గొంటున్నారు. వారం రోజులపాటు సభలు జరగనున్నాయ. రాళ్ల నుంచి ఎముకలు, ఔషధాలు, చక్కెర, మంచు, ఆహారధాన్యాల వరకు ఇలా ఘనపదార్థాలైన అన్నింటిపై అధ్యయనం చేసేదే స్ఫటికాకృతి శాస్త్రం

08/20/2017 - 23:56

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితులు ఈ వారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను అత్యధికంగా ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపైనా మదుపరులు, ముఖ్యంగా విదేశీ మదుపరులు దృష్టి సారించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

08/20/2017 - 23:55

న్యూఢిల్లీ, ఆగస్టు 20: తమకు రాయతీలు పెంచాలని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు నీతి ఆయోగ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణార్థం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే.

08/22/2017 - 02:55

హైదరాబాద్, ఆగస్టు 20: అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో షెల్ఫ్ స్టేబుల్ నాణ్యత కలిగిన అక్వాకల్చర్ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ భారత్‌లో విస్తరణ బాట పట్టింది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తుండగా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా 148.77 కోట్ల రూపాయల నుంచి 152.25 కోట్ల రూపాయల మేర నిధుల సమీకరణ చేయనుంది.

Pages