S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/09/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 8: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి పదవిలో చేరే సమయంలో తన పదవీకాలం ప్రభుత్వంతోపాటుగా ముగుస్తుందనే విషయం తనకు తెలియదని ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అరవింద్ పనగరియా చెప్పారు. అమెరికాలో అధ్యాపకుడిగా టీచింగ్‌ను తిరిగి కొనసాగించడం కోసం పనగరియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి అర్ధంతరంగా రాజీనామా చేయడం తెలిసిందే.

08/09/2017 - 00:42

భీమవరం, ఆగస్టు 8: ‘50 రూపాయలతో పొదుపు ఖాతా తెరిస్తే వెంటనే ఎటిఎం కార్డు జారీ. ఆ కార్డుతో ఏ బ్యాంకు ఎటిఎం నుండైనా నగదు సేవలు పొందవచ్చు. ఈ సేవలపై పరిమితి, రుసుము ఉండదు.’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఈ సేవలు అందిస్తోంది ఎవరో కాదు సాక్షాత్తూ భారత తపాలా శాఖ.

08/08/2017 - 00:01

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఉగ్రవాదం.. వాతావరణ మార్పులు.. అవినీతి.. పేదరికం.. నేడు ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్యేదో తెలుసా?.. అంటే అందరూ ముందుగా కాస్త అటుఇటుగా చెప్పే సమాధానాలివే. కానీ వీటన్నిటికంటే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. నిరుద్యోగం. అవును.. ముమ్మాటికి ఇది నిజం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యధికులు ఆందోళన చెందినది నిరుద్యోగమేనని తేలింది మరి.

08/08/2017 - 00:00

ముంబయి, ఆగస్టు 7: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 51.74 పాయింట్లు పడిపోయి 32,273.67 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 10,057.40 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి.

08/07/2017 - 23:59

న్యూఢిల్లీ, ఆగస్టు 7: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు ఈ ఏడాది దాదాపు 25 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 5 నాటికి 2.82 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. నిరుడు ఇదే సమయంలో దాఖలైన రిటర్న్స్ 2.26 కోట్లుగా ఉన్నాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఐటి రిటర్న్స్ దాఖలుకు ఆఖరు తేదీ ఈ నెల 5తో ముగిసినది తెలిసిందే.

08/07/2017 - 23:59

విజయవాడ, ఆగస్టు 7: చేనేత కార్మికులను పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు చంద్రన్న కానుకగా చౌక ధరల దుకాణాల ద్వారా చేనేత చీర, ధోవతి అందించేందుకు ఏపి ముఖ్యమంత్రి యోచిస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ‘చేనేత సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

08/07/2017 - 23:56

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశవ్యాప్తంగా గత నెల జూలై 1న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రావడంతో స్పోర్ట్స్ యుటిలిటి వాహనాలు (ఎస్‌యువి), మధ్యశ్రేణి, భారీ, లగ్జరీ కార్ల ధరలు తగ్గుముఖం పట్టినది తెలిసిందే. అయితే జిఎస్‌టి సెస్సును ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతుండటంతో వీటన్నిటి ధరలు పెరగనున్నాయి.

08/07/2017 - 23:54

విజయవాడ, ఆగస్టు 7: విద్యార్థుల్లో సృజనను వెలికి తీయడానికి రాష్ట్ర ఇన్నోవేషన్ సొసైటీ విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం గా ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలలు ఇన్నోవేషన్ లేబొరేటరీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని ఏపి ఇన్నోవేషన్ సొసైటీ సిఇఒ ప్రొఫెసర్ వల్లికుమారి వెల్లడించారు.

08/07/2017 - 23:53

దేశీయ ఆటో రంగ సంస్థ ఫోర్స్ మోటార్స్ సోమవారం మార్కెట్‌లోకి ట్రావెలర్ టి2 3350 వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 11.12
లక్షల నుంచి 12.49 లక్షల రూపాయల మధ్య ఉంది. 12 ప్లస్ డి, 13 ప్లస్ డి అనే రెండు ఆప్షన్లలో ఈ వాహనం
లభిస్తుందని ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంస్థ తెలిపింది

08/07/2017 - 23:51

విజయవాడ (పాయకాపురం), ఆగస్టు 7: దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డ ధర ఠారెత్తిస్తుంటే రైతుబజార్లలో ఉల్లి ఊసే లేకుండా పోయింది. కృష్ణా జిల్లాలోని 21 రైతుబజార్లలో సోమవారం ఉల్లిపాయలు కనిపించలేదు. బోర్డుపై రేటు ఉన్నా.. స్టాళ్లలో మాత్రం సరుకు లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఉల్లిపాయల ధరలు కేజీ 22 రూపాయలవగా, ప్రకాశంలో 30-35 రూపాయల మధ్య, నెల్లూరులో రూ. 32, అనంతపురంలో రూ. 30, విశాఖ రూ. 28, విజయనగరం రూ. 27, కడపలో రూ.

Pages