S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/07/2017 - 23:50

టాటా స్టీల్ నికర లాభం
రూ. 921 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: టాటా స్టీల్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 921.09 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 3,183.07 కోట్ల రూపాయల నష్టంగా ఉంది. ఆదాయం ఈసారి 30,973.3 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 25,970.7 కోట్ల రూపాయలుగా ఉంది.
క్షీణించిన అమర రాజ

08/07/2017 - 00:31

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి గత ఏదాది సాధించిన 138.04 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి దిగుబడి కంటే ఎక్కువగా ఉండవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కె.పట్నాయక్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరగడం, వరుసగా రెండో సంవత్సరం రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.

08/07/2017 - 00:29

విజయనగరం, ఆగస్టు 6: దేశంలో ఎయిర్ కార్గో సేవలు మెరుగుపరచడం ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం ఆయన డెంకాడలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎయిర్ కార్గో సేవలపై గతంలో అంతగా దృష్టిసారించలేదన్నారు.

08/07/2017 - 00:27

న్యూఢిల్లీ, ఆగస్టు 6: టాటా స్టీల్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) లాంటి పలు బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, జూన్ నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వచ్చే వారం స్టాక్ మార్కెట్ల తీరు తెన్నులను నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు.

08/07/2017 - 00:26

న్యూఢిల్లీ, ఆగస్టు 6: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటి సంస్థ కాగ్నిజెంట్ ప్రకటించిన వలంటరీ సెపరేషన్ ప్యాకేజీ (విఎస్‌పి)ని స్వీకరించేందుకు ఆ సంస్థలోని దాదాపు 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అంగీకరించారు. దీంతో తమకు ఏటా దాదాపు 60 మిలియన్ డాలర్ల సొమ్ము ఆదా అవుతుందని కాగ్నిజెంట్ వెల్లడించింది.

08/07/2017 - 00:25

విజయవాడ, ఆగస్టు 6: సోనీ సంస్థ తమ ప్రీమియం హోమ్ ఆడియో లైనప్‌ను మరింత విస్తృతపరుస్తూ హోమ్ థియేటర్ సిస్టమ్ హెచ్‌టి ఆర్‌టి 40ను ఆవిష్కరించబోతోందని సోనీ మార్కెటింగ్ హెడ్ శ్యామ్‌ముఖర్జీ ఇక్కడో ప్రకటనలో తెలిపారు. దేశీయ మార్కెట్‌లో 5.1 ఛానెల్ హోమ్ థియేటర్‌కు పెరుగుతున్న డిమాండ్, పూర్తిస్థాయి సరౌండింగ్ అనుభవాలను కోరుకునేవారి అవసరాలను తీర్చే రీతిలో హెచ్‌టి ఆర్‌టి 40 హోమ్ థియేటర్ ఉంటుందని తెలిపారు.

08/07/2017 - 00:23

హైదరాబాద్, ఆగస్టు 6: ఉద్యోగాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న యువత కోసం డెల్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డెల్ క్యాంపసడర్స్ మూడో సంవత్సరం కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తమ ఆలోచనల అనే్వషణకు యావత్ భారత యువతను సిద్ధం చేసేందుకు ఉద్దేశించి ఈ కార్యక్రమం చేపట్టింది.

08/07/2017 - 00:22

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత సరకుల ధరల్లో అసాధారణ హెచ్చు తగ్గులేమయినా ఉంటే ప్రారంభ దశలోనే అదుపు చేయడం కోసం ప్రభుత్వం దాదాపు పాతికదాకా అత్యవసర సరకుల ధరల కదలికలను ప్రతి రోజూ నిశితంగా గమనిస్తూ వస్తోంది.

08/06/2017 - 00:20

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్.. కన్స్యూమర్ గూడ్స్ రంగంలో ఓ సంచలనం. దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రత్యర్థి సంస్థలకు ఇప్పుడు పతంజలి సవాల్ విసురుతోందంటే అతిశయోక్తి కాదేమో మరి. కేవలం పదేళ్లలో కన్స్యూమర్ గూడ్స్ విభాగంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంతకంతకూ పెరుగుతూపోయింది. వ్యాపార ప్రపంచంలో పతంజలి ఎదుగుదల సరికొత్త రికార్డే. అవును..

08/06/2017 - 00:20

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలెప్‌మెంట్ చట్టం (రెరా) 2016లో కొత్త నిబంధనలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధన వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

Pages