S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/03/2017 - 00:45

హైదరాబాద్, ఆగస్టు 2: భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ).. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఐఈఓ) ప్రాంతీయ చైర్మన్ శక్తివేల్ తెలిపారు.

08/03/2017 - 00:45

హైదరాబాద్, ఆగస్టు 2: చౌక ధరల టాబ్లెట్ తయారీదారు డేటావిండ్.. తమ హైదరాబాద్ ఉత్పాదక కేంద్రంలో 50 శాతం ఉత్పత్తిని ఆపేసింది. దీంతో ఈ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు పడుతోందని అక్కడి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణ జాయింట్ కమిషనర్ (లేబర్) ఆర్ చంద్ర శేఖరం తమకు ఉద్యోగుల నుంచి చాలా పిటిషన్లు వచ్చాయని పిటిఐకి తెలిపారు.

08/03/2017 - 00:44

ముంబయి, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 98.43 పాయింట్లు పడిపోయి 32,476.74 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.15 పాయింట్లు కోల్పోయి 10,081.50 వద్ద నిలిచింది. 10 నెలల విరామం తర్వాత రెపో రేటును ఆర్‌బిఐ తగ్గించినా.. మదుపరులు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

08/03/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 2: కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించడాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు స్వాగతించారు. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం క్రెడిట్ డిమాండ్‌ను పెంచుతుందని, పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తుందని, వృద్ధిరేటు బలోపేతానికి కృషి చేస్తుందని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ అన్నారు.

08/02/2017 - 00:41

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డు పరుగులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా లాభాల్లో ముగియగా, మరో సరికొత్త స్థాయిలకు సూచీలు చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 60.23 పాయింట్లు పెరిగి 32,575.17 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 37.55 పాయింట్లు అందుకుని 10,114.65 వద్ద నిలిచింది.

08/02/2017 - 00:39

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణలో సూక్ష్మ సేద్యానికి 138 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యాన శాఖ కమిషనర్ సిఫార్సుల మేరకు ఈ నిధులు కేటాయించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకం క్రింద సూక్ష్మ సేద్యానికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది.

08/02/2017 - 00:39

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా విద్యుత్ కనెక్షన్ విషయంలో నిబంధనలను సరళతరం చేస్తూ ప్రణాళికను రూపొందించారు.

08/02/2017 - 00:38

సేఫ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌లో ఓ లాజిస్టిక్స్ పార్క్‌ను ప్రారంభిస్తోంది. ఈ నెల 4న (శుక్రవారం) దీనికి సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించనుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యాపార, పారిశ్రామిక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ పార్క్‌ను సేఫ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అందుబాటులోకి
తెస్తోంది

08/02/2017 - 00:32

న్యూఢిల్లీ, ఆగస్టు 1: పారిశ్రామిక, వ్యాపార సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) నూతన సెక్రటరీ జనరల్‌గా సంజయ్ బారు నియమితులయ్యారు. సెప్టెంబర్ 1న ఈ కొత్త బాధ్యతల్లోకి బారు వస్తారు. ఈ మేరకు ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల పదవీకాలం ముగిసిన దిదార్ సింగ్ స్థానంలో బారు వస్తున్నట్లు పటేల్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.

08/02/2017 - 00:32

మంగళవారం న్యూఢిల్లీలో సరికొత్త బ్లాక్‌బెర్రీ కీవన్ లిమిటెడ్ ఎడిషన్ ‘బ్లాక్’ స్మార్ట్ఫోన్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్న బ్లాక్‌బెర్రీ, ఆప్టీమస్ ఇన్‌ఫ్రాకామ్ ప్రతినిధులు. దీని ధర 39,990 రూపాయలు. అంతర్జాతీయ మోడల్‌లో 3జిబి ర్యామ్ 32జిబి ఆన్‌బోర్డ్ మెమొరీ ఉండగా, ఆప్టీమస్ రూపొందించిన ఈ భారతీయ మోడల్‌లో 4జిబ ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమొరీ ఉన్నాయి.

Pages