S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/01/2017 - 00:34

న్యూఢిల్లీ, జూలై 31: వౌలిక రంగ వృద్ధిరేటు ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 19 నెలల కనిష్టానికి పతనమైంది. కేవలం 0.4 శాతంగా నమోదైంది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి పడిపోయినట్లు సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్‌లతోపాటు ముడి చమురు, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్ రంగాల వృద్ధిరేటు నిరుడు జూన్‌లో 7 శాతంగా నమోదైంది.

08/01/2017 - 00:34

చంద్రగిరి, జూలై 31: దేశంలోనే డెయిరీ రంగానికి హెరిటేజ్ ఫుడ్స్ మార్గదర్శకంగా నిలుస్తున్నదని హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ నారా బ్రహ్మణి అన్నారు. సోమవారం చంద్రగిరి మండలంలోని కాసిపెంట్ల వద్ద గల హెరిటేజ్ ఫుడ్స్ గోకుల ప్లాంట్‌లో హెరిటేజ్ సంస్థ రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

08/01/2017 - 00:32

ముంబయి, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మరో సరికొత్త రికార్డును చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు మదుపరులను ఆకట్టుకుంటుండటంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి.

08/01/2017 - 00:31

న్యూఢిల్లీ, జూలై 31: ఫ్లిప్‌కార్ట్‌తో స్నాప్‌డీల్ విలీన చర్చలకు తెరపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న స్నాప్‌డీల్.. ఆన్‌లైన్ మార్కెట్‌లో తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఫ్లిప్‌కార్‌తో సంస్థ అమ్మకం చర్చలు మొదలు పెట్టినది తెలిసిందే. అయితే 6,000 కోట్ల రూపాయల విలువైన ఈ డీల్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ధర విషయంలో ఏర్పడిన బేధాభిప్రాయాలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

08/01/2017 - 00:30

సోమవారం జైపూర్‌లో జైపూర్-బ్యాంకాక్ విమాన సర్వీసును ప్రకటిస్తున్న ఎయర్‌ఏషియా ప్రతినిధులు. 3,999 రూపాయల ఆఫర్ ధరను ఈ సందర్భంగా ఎయర్‌ఏషియా ప్రకటించింది. సెప్టెంబర్ 29 నుంచి ఈ విమాన సర్వీసులు మొదలవుతాయ. థాయలాండ్, భారత్ మధ్య పెరుగుతున్న పర్యాటక, వ్యాపార సంబంధాలను ఒడిసి పట్టుకోవాలని చూస్తున్న ఎయర్‌ఏషియా.. మరిన్ని ఎక్కువ విమానాలను నడపనుంది

08/01/2017 - 00:27

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల కోసం ఇన్‌సెక్టిసైడ్స్ (ఇండియా) లిమిటెడ్ సంస్థ ఓ సరికొత్త ఎరువును తీసుకొచ్చింది. కాయకల్ప్ పేరిట సోమవారం మార్కెట్‌కు పరిచయం చేసిన
దీనివల్ల కోల్పోయన భూసారాన్ని తిరిగి రైతులు అందుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వరిసాగు అధికంగా జరిగే తెలుగు రాష్ట్రాల్లో భూసారం పెంచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని సంస్థ స్పష్టం చేసింది

07/31/2017 - 00:28

న్యూఢిల్లీ, జూలై 30: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలై నెల రోజులు అవుతున్న క్రమంలో అది ఎలా?

07/31/2017 - 00:24

న్యూఢిల్లీ, జూలై 30: సహారా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని టేకోవర్ చేసుకోవాలంటూ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ను బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ ఆదేశించడాన్ని సహారా గ్రూప్ సవాల్ చేయనుంది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆదివారం సుబ్రతా రాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్ స్పష్టం చేసింది. ఐఆర్‌డిఎఐ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొంది.

07/31/2017 - 00:22

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ రాష్ట్రంలో ఖాయిలా పడిన పరిశ్రమలకు మంచి రోజులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఖాయిలా పడిన 7,200 పరిశ్రమలు ఉన్నాయి. వీటి పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లతో త్వరలో అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేయనున్నాయ.

07/31/2017 - 00:21

న్యూఢిల్లీ, జూలై 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని రాష్ట్రాలన్నీ భాగస్వాములైన ఈ చారిత్రక బిల్లుతో సమాఖ్య ప్రభుత్వ ఔన్నత్యం తెలుస్తోందన్నారు. నెలనెలా నిర్వహించే మన్ కి బాత్ కా ర్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోలో మాట్లా డుతూ జిఎస్‌టి అమలు చక్కగా కావడానికి దేశ ప్రజలం తా కలిసి వచ్చారన్నారు. కాగా, ఒకే దేశం.. ఒకే మార్కెట్..

Pages