S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/26/2017 - 00:27

న్యూఢిల్లీ, జూన్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీని సానుకూలంగా మలుచుకోవడం కోసం దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్-మే నెలల మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లలో 20 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు విదేశీ ఇనె్వస్టర్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే చాలా తక్కువేనని చెప్పారు.

06/26/2017 - 00:25

న్యూఢిల్లీ, జూన్ 25: దేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఎంతో ప్రజాదరణ పొందిన తమ ‘స్కార్పియో’ ఎస్‌యువి ఆటోమ్యాటిక్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది. ముంబయిని కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే స్కార్పియో-ఎటి వేరియంట్‌ను తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది.

06/26/2017 - 00:24

న్యూఢిల్లీ, జూన్ 25: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు సమయం సమీపిస్తుండటంతో దీని ద్వారా ఒనగూడే ప్రయోజనాలను వినియోగదారులకు అందజేసేందుకు ఆటోమొబైల్ సంస్థలు వరుసగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి.

06/25/2017 - 00:43

హైదరాబాద్, జూన్ 24: వచ్చే నెల 1 నుంచి ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుల విధానానికి బదులు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి రానున్నందున డీలర్లు అందరూ జిఎస్‌టి నెట్‌వర్క్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి వస్తోంది. జిఎస్‌టిఎన్ పోర్టల్‌లో ఆదివారం నుంచే డీలర్లు నమోదు చేసుకోవాలి.

06/25/2017 - 00:42

హైదరాబాద్, జూన్ 24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 60 శాతం నిధులను కేంద్రమే భరిస్తోందని, అదే విధంగా రాష్ట్రాలకు పన్నులలో ఇదివరకు 32 శాతం వాటా ఇవ్వగా, దానిని తాము 42 శాతానికి పెంచామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

06/25/2017 - 00:41

బెంగళూరు, జూన్ 24: బోర్డు సభ్యులకు, ప్రమోటర్లకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్ 36వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఎజిఎమ్) శనివారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌పై మీడియాలో వస్తున్నవన్నీ కల్పనలేనని, సంస్థలో భయపడాల్సినటువంటి సమస్యలేమీ లేవంది.

06/25/2017 - 00:41

హైదరాబాద్, జూన్ 24: ప్రభుత్వరంగ జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసి)ని ప్రైవేటీకరించాలనే కుట్రను అడ్డుకోవాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆ సంస్థ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొని, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడుతున్న ఎల్‌ఐసిని ప్రైవేటీకరించాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

06/24/2017 - 00:57

విజయవాడ, జూన్ 23: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు వల్ల 2,920 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఆదాయాన్ని కోల్పోతు న్నామని ఏపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వస్తున్న క్రమంలో ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో జిఎస్‌టి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

06/24/2017 - 00:54

హైదరాబాద్, జూన్ 23: ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకుల ఉద్యోగుల విలీనంపై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. ఎస్‌బిఐలో తమను విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలకు చెందిన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

06/24/2017 - 00:54

న్యూఢిల్లీ, జూన్ 23: భారతీ ఎయిర్‌టెల్.. శుక్రవారం 11 భారతీయ భాషల్లో డిజిటల్ కస్టమర్ కేర్ సేవలను ప్రారంభించింది. హిందీ, పంజాబీ, మరాఠి, గుజరాతి, తమిళ్, కన్నడ, బంగ్లా, ఒడియా, అస్సామీ తదితర భాషల్లో ఈ డిజిటల్ కస్టమర్ కేర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Pages