S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/09/2017 - 00:51

న్యూఢిల్లీ, జూన్ 8: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఇటీవల చేపట్టిన షేర్ల బైబ్యాక్ కార్యక్రమంతో టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ రూ 10,278 కోట్ల రూపాయలను సముపార్జించుకుంది. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన టిసిఎస్ గత నెల 18న రూ 16,000 కోట్ల విలువైన మెగా బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మే 31న అది ముగిసింది.

06/09/2017 - 00:50

న్యూఢిల్లీ, జూన్ 8: దేశంలోని ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో అతిపెద్దదైన హీరో మోటోకార్ప్ భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా తమ ఉత్పత్తుల శ్రేణిని పునర్‌వ్యవస్థీకరించి ప్రీమియం బైకులు, స్కూటర్లపై దృష్టి సారించేందుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వేర్వేరు మోడళ్లు, వేరియంట్లను తొలగించింది.

06/09/2017 - 00:48

హైదరాబాద్, జూన్ 8: హైదరాబాద్‌లోని మెస్సర్స్ బిపిఆర్ ఇన్‌ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్ డైరెక్టర్‌కు ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు. హైదరాబాద్‌లోని మెస్సర్స్ బిపిఆర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ గీతారాణి సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌లో జమ చేసిన రూ. 60 లక్షల రూపాయలకు సంబంధించి వివరణను ఇవ్వడంలో విఫలమైనందున ఆదాయపు పన్నుల శాఖ చట్టంలోని సెక్షన్ 271(టిఎక్స్‌సి) కింద విధించిన రూ.

06/09/2017 - 00:47

హైదరాబాద్, జూన్ 8: హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్ధ తయారు చేసిన సిహెచ్-47 ఎఫ్ హెలికాప్టర్ భాగాలను త్వరలో బోయింగ్‌కు డెలివరీ చేయనుంది. ఈ విషయాన్ని టిఎఎస్‌ఎల్ సంస్ధ వెల్లడించింది. ఈ భాగాలతో బోయంగ్ అసెంబుల్డ్ చేసిన 15 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సరఫరా చేస్తారు.

06/09/2017 - 00:46

హైదరాబాద్, జూన్ 8: కేంద్రంతోపాటు దేశంలోని రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, సంస్కరణలను ఆదర్శంగా తీసుకోవాలని అసోచామ్ కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించి ఈ రెండు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులు వస్తున్నాయని అసోచామ్ అధ్యక్షుడు సందీప్ జాజోడియా అన్నారు.

06/09/2017 - 00:43

హైదరాబాద్, జూన్ 8: రైతు సమమగ్ర సర్వే ముమ్మరంగా సాగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సర్వే పూర్తయిన తరువాత రైతులకు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని, అనంతరం వచ్చే సంవత్సరం మే 15 నుంచి ప్రతి రైతుకు ఎకరానికి నాలుగు వేల రూపాయల ముందస్తు పెట్టుబడిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. సుగంధ ద్రవ్యాల అమ్మకం- కొనుగోలుదారుల సమావేశం గురువారం టూరిజం ప్లాజాలో జరిగింది.

06/08/2017 - 01:16

ముంబయ, జూన్ 7: ఊహించినట్లుగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను నిర్వహించిన రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. మంగళవారం మొదలైన ఈ సమీక్షలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులుగల మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) రెపో, రివర్స్ రెపోలను యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది.

06/08/2017 - 01:14

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ గత అంచనాలను వాతావరణ శాఖ సవరించడం మదుపరులను ఉత్సాహపరిచింది. అంతేగాక చట్టబద్ధ ద్రవ్యనిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అర శాతం తగ్గించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

06/08/2017 - 01:14

న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 2013 నుంచి గమనిస్తే భారీ స్థాయిలో వచ్చాయని, నాడు 34,487 బిలియన్ డాలర్లుగా ఉంటే, నేడు 61,724 బిలియన్ డాలర్లకు పెరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ మూడేళ్ల పాలనపై బుధవారం మోదీ ఇక్కడ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం భారత్ ఓ కాంతిపుంజంగా ఉందన్నారు.

06/08/2017 - 01:13

హైదరాబాద్, జూన్ 7: జిఎమ్‌ఆర్ చేతికి గ్రీస్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు వచ్చింది. ఆ దేశ వౌలిక రంగ దిగ్గజం జిఇకె టెర్నా గ్రూప్ అనుబంధ సంస్థ టెర్నా ఎస్‌ఎతో కలిసి ఈ ప్రాజెక్టును జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ అభివృద్ధిపరచనుంది.

Pages