S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/04/2017 - 07:36

న్యూఢిల్లీ, మే 3: రాష్ట్రాలకు సబ్సిడీపై చక్కెర సరఫరా చేయాలన్న విధానాన్ని పునరుద్ధరించడంసహా బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పిడిఎస్) క్రింద 2.5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఇచ్చే కిలో చక్కెరపై రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన రాయితీని మళ్లీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

05/04/2017 - 07:33

జంగారెడ్డిగూడెం, మే 3: గిట్టుబాటు ధర లభించక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని నవ్యాంధ్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పోలవరం వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

05/04/2017 - 07:32

హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేయడంలో భాగంగా బ్యాంకర్లు ఎస్‌బి అకౌంట్ల ఆధార్ సీడింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఎస్‌బి అకౌంట్ ఉన్న ఖాతాదారులందరికీ రూపేకార్డులు ఇవ్వాలని, బీమ్ యాప్‌ను ప్రజల్లోకి పూర్తిగా తీసుకుపోవాలని ఆదేశించారు.

05/04/2017 - 07:31

హైదరాబాద్, మే 3: మార్కెట్‌లోకి సరికొత్త రూపుతో బ్రెడ్ ఉత్పత్తులను విడుదల చేసింది మోడ్రన్ ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. నూతన బ్రాండ్ పొజిషనింగ్‌తో, ఐడెంటిటీతో, ఆకట్టుకునే ప్యాకేజింగ్‌తో అత్యున్నత శ్రేణి ఉత్పత్తులతో తమ ఫుడ్ పోర్ట్ఫోలియోను పెంచుకుంటోంది. వినియోగదారులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారోత్పత్తులను అందించడానికే తమ తొలి ప్రాధాన్యతని తెలిపిన మోడ్రన్..

05/04/2017 - 07:30

న్యూఢిల్లీ, మే 3: దేశీయ ఆటో రంగ సంస్థ, ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారైన బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల ఏప్రిల్‌లో స్వల్పంగా 1 శాతం పెరిగాయి. ఈ ఏప్రిల్‌లో 3,29,800 యూనిట్లుగా, క్రిందటిసారి ఏప్రిల్‌లో 3,30,109 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 2,93,932 యూనిట్లుగా ఉంటే, పోయినసారి 2,91,898 యూనిట్లుగా ఉన్నాయి.

05/04/2017 - 07:29

ఐసిఐసిఐ బ్యాంక్

05/03/2017 - 00:53

న్యూఢిల్లీ, మే 2: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారతీయ ఐటి రంగ దిగ్గజాల్లో ఒకటైన, దేశీయ మూడో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన విప్రో.. తమ లోగోను మార్చింది. ఓ సరికొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతమున్న బహుళ వర్ణ ప్రొద్దుతిరుగుడు పువ్వు లోగోను 1998లో పరిచయం చేసిన విప్రో.. తాజాగా ఓ కొత్త రూపంలో మరో లోగోను తీసుకొచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ..

05/03/2017 - 00:51

న్యూఢిల్లీ, మే 2: మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ ఆర్థిక సంవత్సరాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఏప్రిల్-మార్చి వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నది తెలిసిందే. అయితే దీని స్థానంలో జనవరి-డిసెంబర్‌ను మంగళవారం ప్రకటించింది మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు. ఈ ఏడాది డిసెంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెడతామని, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేసింది.

05/03/2017 - 00:50

న్యూఢిల్లీ, మే 2: ఆర్థిక సంస్కరణలపై చర్చలు, రాజకీయ రచ్చలు పేదలకు వాటి ప్రయోజనాలను అందకుండా చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దుతో దేశ జిడిపి వృద్ధిరేటు, వ్యవసాయోత్పత్తి పడిపోతుందన్న విమర్శలు చాలాచాలా వ్యక్తమయ్యాయన్న ఆయన అవన్నీ కూడా వట్టి మాటలేనని తేలిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని కొనియాడారు.

05/03/2017 - 00:50

న్యూఢిల్లీ, మే 2: హెచ్-1బి వీసాలపై అమెరికా కఠిన విధానం నేపథ్యంలో భారతీయ ఐటి రంగ రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్.. రాబోయే రెండేళ్లలో 10,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. అంతేగాక అమెరికాలో నాలుగు టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Pages