S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/10/2017 - 00:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో మొత్తం 80 శాతం వాటాను అమ్మేస్తోంది రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ట్రూ నార్త్ మేనేజర్స్ నేతృత్వంలోని ఓ మదుపరుల కూటమి దాదాపు 1,040 కోట్ల రూపాయలకు ఈ మొత్తం వాటాను కొనుగోలు చేస్తోంది. కాగా, దీనికి సంబంధించి మదుపరుల కూటమితో ఒప్పందాలను చేసుకున్నట్లు రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఆదివారం తెలిపింది.

04/10/2017 - 00:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: క్రీడా-వ్యాపార రంగాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. అయతే ఐపిఎల్‌తో ఇది విడదీయరాని బంధంగా ఏర్పడింది. పరిమిత ఓవర్లలో.. అదికూడా కేవలం 20 ఓవర్లు కలిగిన పొట్టి మ్యాచ్‌లకు యమా క్రేజ్‌ను తీసుకొచ్చిన ఐపిఎల్‌లో పదో సీజన్ మొదలైనది తెలిసిందే. బంతిని బలంగా బాదుతూ బౌండరీలకు చేర్చడమే లక్ష్యంగా ఆడే ఈ ఆటపట్ల వ్యాపార వర్గాలకూ మక్కవ ఎక్కువే.

04/10/2017 - 00:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-్ఫబ్రవరి వ్యవధిలో దేశీయ బంగారం దిగుమతులు దాదాపు 24 శాతం పడిపోయాయి. 23.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 30.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

04/10/2017 - 00:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెటను ఐఐపి, ద్రవ్యోల్బణం గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నడిపిస్తాయని నిపు ణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెలకుగాను పారిశ్రామికో త్పత్తి (ఐఐపి) గణాంకాలు, మార్చి నెలకు గాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు బుధవారం విడుదలవుతున్నాయ.

04/10/2017 - 00:24

ముంబయి, ఏప్రిల్ 9: స్మార్ట్ఫోన్ల తయారీదారు వివో.. తమ నూతన మోడల్ వి5ప్లస్ మొబైళ్ల ఆన్‌లైన్ అమ్మకాల కోసం ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలిపింది. సోమవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వి5ప్లస్ అందుబాటులో ఉంటుందని వివో ఆదివారం తెలిపింది. వి5ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ధర 25,990 రూపాయలు. ఈ భాగస్వామ్యం తమ సంస్థకు కలిసొస్తుందన్న విశ్వాసాన్ని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ ఝంగ్ వ్యక్తం చేశారు.

04/10/2017 - 00:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

04/09/2017 - 01:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఒక్కరోజే వెండి ధర భారీగా పతనమైంది. శనివారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా 800 రూపాయలు పడిపోయింది. దీంతో 42 వేల మార్కుకు దిగువన 41,750 రూపాయల వద్దకు చేరింది. అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య వెండి కొనుగోళ్లపట్ల పరిశ్రమల ఆసక్తి సన్నగిల్లింది. నాణేల తయారీదారులు కూడా వెండి నిల్వలను తగ్గించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ధరలు పెద్ద ఎత్తున క్షీణించాయి.

04/09/2017 - 01:13

విజయవాడ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా లారీ యజమానులు తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. పెంచిన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంలో 27 శాతం తగ్గించేందుకు బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎ చైర్మన్ అంగీకరించటంతో లారీ యజమానుల సంఘం సమ్మెను విరమించుకుంది.

04/09/2017 - 01:11

ముంబయి, ఏప్రిల్ 8: ఎట్టకేలకు గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లా అమ్ముడుపోయంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలకుగాను తాకట్టు పెట్టుకున్న స్థిరచరాస్తుల్లో కింగ్‌ఫిషర్ విల్లా ఒకటన్నది తెలిసిందే. బకాయల వసూళ్లలో భాగంగా ఇతర ఆస్తులతోపాటు దీన్నికూడా మూడుసార్లు బ్యాంకులు వేలం వేశాయ. అయనప్పటికీ స్పందన మాత్రం శూన్యం.

04/09/2017 - 01:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ ఇండిగో.. శుక్రవారం ఒక్కరోజే 900 విమానాలను నడిపింది. ఒక భారతీయ ఎయిర్‌లైన్ సంస్థ ఈ స్థాయిలో విమానాలను కేవలం ఒక్కరోజే నిర్వహించడం ఇదే తొలిసారి. ‘తొలిసారిగా నిన్న ఒక్కరోజే 900 డైలీ విమాన సర్వీసులను నడపడం ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు మా లక్ష్యంగా 1,000 విమానాలే.’ అని ఇండిగో అధ్యక్షుడు ఆదిత్యా ఘోష్ శనివారం ఓ ప్రకటనలో చెప్పారు.

Pages