S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/20/2017 - 00:28

ముంబయి, మార్చి 19: వజ్రాల వ్యాపారంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భారత్‌తో నేరుగా సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు జింబాబ్వే ప్రభుత్వం ప్రకటించింది. ‘మా దేశంలో గనుల నుంచి వెలికితీసిన వజ్రాలను భారత్ ఇప్పటివరకూ మధ్యవర్తుల ద్వారా దిగుమతి చేసుకుంటోంది.

03/20/2017 - 00:26

కాకినాడ, మార్చి 19: రాష్ట్రంలో ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించడానికి మేజర్ పోర్టులతో పాటు మైనర్ పోర్టులను కూడా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రవాణా రంగాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

03/20/2017 - 00:24

హైదరాబాద్, మార్చి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు అభివృద్ధి పథంలో పయనిస్తుండటంతో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పెట్టుబడులు పెట్టదగిన మొత్తంలో 15 శాతం మేరకు నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మార్కెట్లలో పెట్టాలని యోచిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

03/20/2017 - 00:23

న్యూఢిల్లీ, మార్చి 19: మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల మొత్తం దాదాపు రూ .295 కోట్లకు ఎలా చేరుకున్నాయోఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దర్యాప్తు జరపాలని రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఏర్పాటయిన పార్లమెంటు స్థారుూ సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడున్న నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌లైన్స్ బకాయిలు ఇంత భారీగా పెరిగి పోవడానికి ఏఏఐ అనుమతించిందని ఆ కమిటీ అభిప్రాయ పడింది.

03/19/2017 - 00:44

న్యూఢిల్లీ, మార్చి 18: కస్టమర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలు, వాలెట్ల పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంక్ ఖాతా సమాచారం తదితర రహస్య ఆర్థిక డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వెబ్‌సైట్, యాప్ భద్రపరచుకోవని ఫాస్ట్ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ స్పష్టం చేసింది. 22 లక్షలకుపైగా కస్టమర్ల వ్యక్తిగత ఆర్థిక వివరాలను మెక్‌డొనాల్డ్స్ బహీర్గతపరిచిందన్న ఆరోపణలపై పైవిధంగా స్పందించింది.

03/19/2017 - 00:43

న్యూఢిల్లీ, మార్చి 18: తమ అమెరికా ఆధారిత అనుబంధ సంస్థలో మొత్తం వాటాను విఇ కమర్షియల్ వెహికిల్స్ ఉపసంహరించుకుంది. స్పెయిన్‌కు చెందిన సెగులా టెక్నాలజియస్ ఎస్పనాకు ఈ వాటాను 1.85 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. ఐషర్ మోటార్స్, వోల్వో గ్రూప్ జాయింట్ వెంచరే ఈ విఇ కమర్షియల్ వెహికిల్స్. 50:50 నిష్పత్తితో ఈ వాణిజ్య వాహన జాయింట్ వెంచర్‌ను ఐషర్, వోల్వో కలిసి ఏర్పాటు చేశాయి.

03/19/2017 - 00:42

హైదరాబాద్, మార్చి 18: హైదరాబాద్‌కు చెందిన మై హోమ్‌గ్రూప్‌తో రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆర్‌ఎమ్‌జెడ్ కార్ప్.. ఓ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నగరంలో వాణిజ్య కార్యాలయ అవసరాలను తీర్చేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది. 100 కోట్ల డాలర్ల పెట్టుబడితో కోటి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్ ప్రాజెక్టును ఇరు సంస్థలు చేపడుతున్నాయి. ఈ మేరకు విడుదలైన ఓ సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది.

03/19/2017 - 00:42

హైదరాబాద్, మార్చి 18: ప్రింటింగ్ రంగాన్ని ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించి విద్యుత్ రాయితీ కల్పించాలని అఖిల భారత మాస్టర్ ప్రింటర్ల సమాఖ్య (ఎఐఎఫ్‌ఎంపి) డిమాండ్ చేసింది. 235వ అఖిల భారత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి.

03/19/2017 - 00:41

నిజామాబాద్, మార్చి 18: ప్రైవేట్‌రంగ సంస్థలు తమకు ఎంతమాత్రం పోటీ కావని, వాటి వల్ల తమ సంస్థకు చేకూరే నష్టం ఏదీ లేదని ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ అన్నారు. తమ సంస్థ సొంతంగా అధునాతన టెక్నాలజీని కలిగి ఉండడంతో వినియోగదారులకు సంతృప్తికరంగా, విస్తృతస్థాయిలో సేవలు అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.

03/19/2017 - 00:40

గోదావరిఖని, మార్చి 18: విద్యుదుత్పత్తిలో ఎన్టీపీసీ ఎప్పుడూ రారాజుగానే నిలుస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలు ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఉత్పత్తిలో అనేక రికార్డులను తమ ఖాతాలో జమ చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లో ఎన్టీపీసీ ప్రతీసారి అగ్ర భాగాన నిలుస్తోంది. తాజాగా ఈ నెల 16 నాటికి 263.95 బిలియన్ యూనిట్లతో విద్యుదుత్పత్తిని సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

Pages