S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/15/2017 - 00:09

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న 87వ అంతర్జాతీయ మోటార్ షో.. సందర్శకులతో కిక్కిరిసిపోతోంది.
ప్రపంచంలోని ప్రముఖ ఆటో రంగ సంస్థలన్నీ త్వరలో మార్కెట్‌లోకి తీసుకొచ్చే తమ కొత్త మోడల్ వాహనాలను ఈ షోలో ప్రదర్శిస్తుండగా, వాహన ప్రియులను అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ. ఈ నెల 9న మొదలైన ఈ షో.. 19 వరకు కొనసాగుతుంది. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు,

03/14/2017 - 00:36

న్యూఢిల్లీ, మార్చి 13: పాత పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్ మార్కెట్‌పై అంచనాలు ఆకాశం వైపు వెళ్తున్నాయ. నగదు కొరత కారణంగా కొనుగో లుదారులు డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపు తున్నారు మరి. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో షాపింగ్ మాల్స్‌కు వెళ్లి అక్కడ గంటల తరబడి ఏరికోరి నచ్చిన వాటిని కొనుక్కునే ఓపికలేని వారంతా కూడా ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్‌పైనే ఆధారపడుతున్నారు.

03/14/2017 - 00:34

హైదరాబాద్, మార్చి 13: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి, పట్టణాభివృద్ధి, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు చేసిందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోది అన్నారు.

03/14/2017 - 00:32

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నరేళ్లలో 2.20 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా 58,341 కోట్ల రూపాయల పెట్టుబడులతో 3,451 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 1,097 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించి 43,075 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బోయింగ్, టాటా సికోర్సికి, హెచ్‌ఎస్‌ఐఎల్ తోషిబా, మైక్రోమాక్స్ వంటి సంస్ధలు ఉన్నాయి.

03/14/2017 - 00:32

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్, అమ్మకం పన్నుపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గత రెండేళ్లతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరం వాణిజ్యం, అమ్మకం పన్నుల ద్వారా 46,500 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ శాఖ ద్వారా 9 వేల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

03/13/2017 - 00:57

న్యూఢిల్లీ, మార్చి 12: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఘన విజయం ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను భారీ లాభాల్లో పరుగులు పెట్టించగలదన్న అంచనా నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సూచీలు సరికొత్త స్థాయలను అందుకున్నా ఆశ్చర్యపోన క్కర్లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

03/13/2017 - 00:56

న్యూఢిల్లీ, మార్చి 12: మోసాల జాబితాలో దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గణాంకాల ప్రకారం నిరుడు ఏప్రిల్-డిసెంబర్ మధ్య 455 ఫ్రాడ్ కేసుల్లో ఐసిఐసిఐ ప్రమేయం ఉన్నట్లు తేలింది.

03/13/2017 - 00:55

న్యూఢిల్లీ, మార్చి 12: ప్రముఖ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్.. దేశీయ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను ప్రకటించింది. అలాగే అంతర్జాతీయ రోమింగ్‌పై సరికొత్త చార్జీల ప్యాకేజీలనూ ఆవిష్కరించింది. విదేశాలకు వెళ్ళేవారికి ఇక బిల్లులకు సంబంధించి ఎలాంటి షాకులూ ఉండబోవంది.

03/13/2017 - 00:55

హైదరాబాద్, మార్చి 12: అగ్రశ్రేణి ఆహారోత్పత్తుల సంస్థ డానన్.. గ్రీక్ యోగర్ట్ ఆవిష్కరణతో తమ డెయిరీ పోర్ట్ఫోలియోను విస్తరించింది. వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన ఆహారం ద్వారా ఆరోగ్యం సమకూర్చా లనే లక్ష్యంతో సమతుల్య జీవనశైలికి అనుగుణంగా అదనపు విలువలు అందించే ఉత్పత్తులనివ్వడానికి కట్టుబడి ఉన్నామని డానన్ ఇండియా ఎండి రోడ్రిగో లిమా తెలిపారు.

03/13/2017 - 00:52

విశాఖపట్నం, మార్చి 12: వ్యాపారస్తుడు, ఉద్యోగి, సామాన్య పౌరుడు ఎవరికైనా డబ్బు అవసరమైతే బ్యాంకుకు వెళ్తాడు. తమ, తమ ఖాతాల్లో దాచుకున్న సొమ్మును ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవాలనుకుంటాడు. అయితే, బ్యాంకుల్లోనే సొమ్ము లేకపోతే వీరంతా ఎక్కడకు వెళ్లాలి? ఎవరితో చెప్పుకోవాలి? గత వారం రోజులుగా బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు పరిశీలిస్తే.. నిజంగానే బ్యాంకుల్లో సొమ్ముల్లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు.

Pages