S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/04/2017 - 00:39

హైదరాబాద్, మార్చి 3: పాత పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొన్నారన్న ప్రచారం శుద్ధ అబద్దమని, పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతికి, ఉగ్రవాదానికి కళ్లెం వేసి సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నాంది పలికారని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇది జన ఆవేదన కాదని, కాంగ్రెస్ ఆవేదన మాత్రమేనని మండిపడ్డారు.

03/04/2017 - 00:39

హైదరాబాద్, మార్చి 3: ప్రి ఓన్డ్ వాహనాలు, యంత్ర సామాగ్రికి సంబంధించి దేశంలోనే నమ్మకమైన శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్ (సమీల్).. తమ ప్లాట్‌ఫామ్‌పై 8,000 కోట్ల రూపాయల లావాదేవీలను నిర్వహించింది.

03/04/2017 - 00:38

హైదరాబాద్, మార్చి 3: యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందం.. డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్‌ను నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు శుక్రవారం ప్రకటించింది.

03/04/2017 - 00:38

న్యూఢిల్లీ: బిఎస్‌ఇ షేర్ల విలువ స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన దగ్గర్నుంచి 18 శాతం పడిపోయింది. గత నెల ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ షేర్లు లిస్టింగ్ అయినది తెలిసిందే. ఒక్కో షేర్ విలువ 1,085 రూపాయలుగా లిస్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇది 890.70 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో 194 రూపాయల మేర విలువ దిగజారినట్లైంది.

03/04/2017 - 00:38

ముంబయి, మార్చి 3: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ వారం మొత్తంగా బుధవారం ఒక్కరోజే సూచీలు లాభాలను అందుకోగా, గడచిన ఆరు వారాల్లో తొలిసారిగా ఈ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలాఖర్లో ద్రవ్యసమీక్ష నిర్వహించనుండగా, కీలక వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీశాయి.

03/04/2017 - 00:37

న్యూఢిల్లీ, మార్చి 3: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన బ్యాంక్ డిపాజిట్లపై సంబంధీకులకు ఇచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌లకు, ఈ-మెయిల్స్‌కు స్పందించనివారిపట్ల ఆదాయ పన్ను శాఖ కనె్నర్ర చేస్తోంది. వీరందరికి నోటీసులను జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 133(6) ప్రకారం ఈ నోటీసులను జారీ చేయనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) శుక్రవారం తెలియజేసింది.

03/04/2017 - 00:34

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ‘ఇన్నొవేటివ్ లీడర్‌షిప్’ అవార్డు అందించింది. కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి పిపి చౌదరి ఈ అవార్డును ఆనంద్‌కు శుక్రవారం అందించారు. జైపూర్‌లో రాజస్థాన్ ప్రభుత్వం మూడు రోజుల పాటు ‘ఇ-ఇండియా ఇన్నొవేటివ్ సమ్మిట్’ను నిర్వహిస్తోంది. ఇది శుక్రవారం ప్రారంభమైంది.

03/03/2017 - 01:05

భారత పర్యటనలో ఉన్న పెప్సికో చైర్‌పర్సన్, సిఇఒ ఇంద్రా నూయా గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు వ్యాపార అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కూడా ఇంద్రా నూయా భేటీ అయ్యారు

03/03/2017 - 01:03

న్యూఢిల్లీ, మార్చి 2: అవంతా గ్రూప్‌నకు చెందిన క్రాంప్టన్ గ్రీవ్స్.. తమ పేరును సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్‌గా మార్చినట్లు గురువారం తెలిపింది. గత నెల ఫిబ్రవరి 27 నుంచే కొత్త పేరు అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సంస్థ ప్రస్తుతం పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ బి2బి పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా సేవలందిస్తోంది.

03/03/2017 - 01:02

న్యూఢిల్లీ, మార్చి 2: జపాన్‌కు చెందిన బ్రిలియంట్ సర్వీస్ కో సంస్థను తాము కొనుగోలు చేసినట్లు ఐటి సేవల సంస్థ కాగ్నిజెంట్ గురువారం తెలియజేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేసిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, ఈ కొనుగోలులో భాగంగా 70 మంది నిపుణులతోకూడిన బృందం కాగ్నిజెంట్‌లోకి వస్తోంది. జపాన్ మార్కెట్‌లో వీరికి ఉన్న అనుభవం తమకు తోడ్పడగలదని ఓ ప్రకటనలో కాగ్నిజెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Pages