S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/03/2017 - 01:02

గురువారం న్యూఢిల్లీలో నేషనల్ రైల్ మ్యూజియం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో రోల్-ఆన్ రోల్-ఆఫ్ సర్వీసును ప్రారంభిస్తున్న రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు. ఢిల్లీలో వాహనాల రద్దీ, వాయు కాలుష్య నివారణలో భాగంగా ఈ ట్రక్కుల రవాణా సర్వీసును రైల్వే శాఖ తీసుకొచ్చిందని మంత్రి తెలియజేశారు

03/03/2017 - 01:00

న్యూఢిల్లీ, మార్చి 2: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతీయ ఆటోమొబైల్, ట్రాక్టర్ తయారీ రంగాలపై పెద్దగానే కనిపించిందని దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.

03/03/2017 - 00:58

న్యూఢిల్లీ, మార్చి 2: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారు బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. 2,73,513 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరిలో 2,72,719 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో దేశీయ విక్రయాలు ఈ ఫిబ్రవరిలో 1,59,109 యూనిట్లుగా, పోయినసారి 1,73,760 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు గురువారం బజాజ్ ఆటో తెలియజేసింది.

03/03/2017 - 00:56

న్యూఢిల్లీ, మార్చి 2: ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ పేమెంట్లపై శిబిరాలను నిర్వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం ఆదేశించింది. బుధవారం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా అన్ని బ్యాంకులను ఈ నెల 31లోగా ఖాతాదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినది తెలిసిందే.

03/03/2017 - 00:54

ముంబయి, మార్చి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బుధవారం నాటి లాభాలను కొనసాగించడంలో సూచీలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 144.70 పాయింట్లు కోల్పోయి 28,839.79 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 46.05 పాయింట్లు పడిపోయి 8,899.75 వద్ద నిలిచింది.

03/03/2017 - 00:54

గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసిన
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయ వ్యాపార బృందం. మిస్సోరి ఎగుమతుల మండలి అధిపతి,
భారత సంతతికి చెందిన దీపక్ కాంత్ వ్యాస్ ఈ బృందానికి నాయకత్వం వహించారు

03/03/2017 - 00:51

దొనకొండ, మార్చి 2: ప్రకాశం జిల్లా దొనకొండలో త్వరలో 2,500 ఎకరాల్లో వాహనాల విడిభాగాలు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పెయిన్ దేశానికి చెందిన ఇడియాడ కంపెనీ బృందం డైరెక్టర్లు మందీప్‌టాక్, లూయిస్ తెలిపారు. గురువారం వారు దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, రుద్రసముద్రం, పోచమక్కపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించారు.

03/02/2017 - 07:39

న్యూఢిల్లీ, మార్చి 1: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. అన్ని బ్యాంకులను ఈ నెల 31లోగా ఖాతాదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ‘మొబైల్ ఫోన్లున్న ఖాతాదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించేలా బ్యాంకులు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి.

03/02/2017 - 07:38

తడ/సత్యవేడు, మార్చి 1: సర్దా మ్యాగ్నెట్ గ్రూపునకు చెందిన రుద్ర మ్యాగ్నెట్ లిమిటెడ్.. తమ నూతన పరిశ్రమను నెల్లూరు జిల్లా శివారున ఉన్న శ్రీసిటీలో బుధవారం ప్రారంభించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజకుమార్ సర్ద లాంఛనంగా దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పరిశ్రమలకు అవసరమయ్యే అయస్కాంతంను తయారు చేసే తొలి కంపెనీ తమదేనని అన్నారు.

03/02/2017 - 07:37

ముంబయి, మార్చి 1: జిడిపి గణాంకాలు అందించిన ఉత్సాహంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయి. బుధవారం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 6 నెలల గరిష్ఠాన్ని తాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,900 మార్కును అధిగమించింది.

Pages