S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/02/2017 - 07:36

న్యూఢిల్లీ, మార్చి 1: పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి రావడం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకులు పెను భారం మోపాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వసూలు చేస్తామని ప్రకటించాయి.

03/02/2017 - 07:35

హైదరాబాద్, మార్చి 1: ఉత్పత్తి లక్ష్యాల సాధనలో దూసుకుపోతున్న సింగరేణి.. ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలో ఆల్‌టైం రికార్డు సృష్టించింది. సింగరేణి చరిత్రలోనే ఫిబ్రవరిలో అత్యధికంగా 58.7 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, 57 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి మరో కొత్త రికార్డు నెలకొల్పింది.

03/01/2017 - 00:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్తా.. మంగళవారం తమ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాజమాన్యంతో ఏర్పడిన ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కాకపోవడమే ఇందుకు కారణం.

03/01/2017 - 00:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: జపాన్ టెలికామ్ దిగ్గజం ఎన్‌టిటి డొకొమోకు 1.18 బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటా సన్స్ అంగీకరించింది. టాటా గ్రూప్‌లోని టెలికామ్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్, డొకొమో కలిసి జాయింట్ వెంచర్‌లో భాగంగా దేశీయంగా టెలికామ్ సేవలను అందిస్తున్నది తెలిసిందే.

03/01/2017 - 00:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7 శాతంగా ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) మంగళవారం తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది.

03/01/2017 - 00:26

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మంగళవారం
ముంబయలో భారతీయ మార్కెట్‌కు సరికొత్త ఈ-క్లాస్ సెడాన్ కారును పరిచయం చేసింది. దీని ధర 56.15 లక్షల నుంచి 69.47 లక్షల రూపాయలుగా ఉంది

03/01/2017 - 00:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఎనిమిది కీలక రంగాల (ఐఐపి) పనితీరు ఈ ఏడాది జనవరిలో ఐదు నెలల కనిష్టానికి మందగించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్ రంగాల్లో చోటుచేసుకున్న మందగమనంతో 3.4 శాతానికి పరిమితమైంది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలతో కూడిన ఈ ఎనిమిది కీలక రంగాల పనితీరు నిరుడు జనవరిలో 5.7 శాతంగా ఉంది.

03/01/2017 - 00:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రభుత్వరంగ హైడ్రో పవర్ ఉత్పత్తిదారు ఎన్‌హెచ్‌పిసి.. 2,616 కోట్ల రూపాయలతో 81 శాతానికిపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఒక్కో షేర్‌ను 32.25 రూపాయలకు కొంటున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 7న జరిగిన బోర్డు సమావేశంలో షేర్ బైబ్యాక్ ఆఫర్‌కు ఆమోదం లభించినట్లు తెలిపింది.

03/01/2017 - 00:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: సెబీ-సహారా కేసులో ఏప్రిల్ 7కల్లా 5,092.6 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలంటూ సహారా గ్రూప్‌నకు సుప్రీం కోర్టు సూచించింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సుబ్రతా రాయ్ తిరిగి జైలుకు వెళ్లకూడదంటే తాము సూచించిన సొమ్మును నిర్దేశిత గడువులోగా సమర్పించాల్సిందేనని మంగళవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సహారా తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది.

03/01/2017 - 00:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఉచిత కాల్స్, డేటా ఆఫర్లతో దేశీయ టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. దూకుడు కొనసాగుతోంది. ఏప్రిల్ 1 నుంచి డేటా వినియోగంపై చార్జీలుంటాయని ప్రకటించిన జియో.. 99 రూపాయల ప్రైమ్ ప్లాన్ సభ్యత్వంతో నెలనెలా 303 రూపాయలకే ఉచిత కాల్స్, డేటా సౌకర్యాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రస్తుత కస్టమర్లకు కల్పించినది తెలిసిందే.

Pages