S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/27/2017 - 00:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ముంబయి నగరం దేశ ఆర్థిక రాజధానే కాదు.. దేశంలోనే సంపన్న నగరం కూడా. ముంబయిలో 46 వేల మంది మిలియనీర్లతోపాటు 28 బిలియనీర్లు సైతం కాపురమున్నారు మరి. వీరి వద్దనున్న సంపద విలువ 820 బిలియన్ డాలర్లు. న్యూ వరల్డ్ వెల్త్ తాజా నివేదిక ప్రకారం భారత్‌లోని సంపన్న నగరాల్లో ముంబయి మొదటి స్థానంలో నిలిచింది.

02/27/2017 - 00:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును రద్దు చేస్తున్న క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనల ఆమోదం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఓ ప్రామాణిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక రంగాల్లో ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపి) ఆధారంగా ఎఫ్‌డిఐలపై నిర్ణయాలు జరగనున్నాయి.

02/27/2017 - 00:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబ డుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడు లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

02/26/2017 - 01:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: బంగారం ధరలు మళ్లీ 30 వేల రూపాయల స్థాయిని అధిగమించాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 30,175 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం ముగింపుతో పోల్చితే 325 రూపాయలు పెరగగా, నాలుగు నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని అందుకుంది. నిరుడు అక్టోబర్ 18న బంగారం ధర 30,325 రూపాయలుగా ఉంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి ధర చేరింది.

02/26/2017 - 01:00

శనివారం న్యూఢిల్లీలో మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ వివేక్ చంద్ సెహగల్‌కు
ఇవై ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2016 అవార్డును అందిస్తున్న
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
చిత్రంలో కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా ఉన్నారు

02/26/2017 - 00:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు దాని బోర్డు ఆమోదం తెలిపింది. 1,244 కోట్ల రూపాయల విలువైన షేర్లను తిరిగి ఎన్‌సిఎల్ కోనుగోలు చేయనుంది.

02/26/2017 - 00:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసును ప్రారంభించే ఆలోచనేదీ లేదని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) స్పష్టం చేసింది. సంబంధంలేని కొత్త రంగాలకు విస్తరించడంలో అర్థం లేదన్నది తమ అభిప్రాయమని చెప్పింది. ఆర్‌ఐఎల్ అనుబంధ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. త్వరలో ఓ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

02/26/2017 - 00:56

లండన్, ఫిబ్రవరి 25: పాత పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దాదాపు పూర్తయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో తిరిగి కొత్త పెద్ద నోట్లను విజయవంతంగా తీసుకురాగలిగామని, ప్రపంచంలో మరెక్కడా కూడా ఇంత సజావుగా డీమానిటైజేషన్ జరగలేదని చెప్పారు.

02/26/2017 - 00:55

విజయవాడ, ఫిబ్రవరి 25: ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేయాల్సిన 11 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాన్ని మార్చి నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఇక్కడ మధ్యాహ్నం తన నివాసంలో మహిళా స్వయంసహాయక సంఘాల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు.

02/26/2017 - 00:53

తిరుపతి, ఫిబ్రవరి 25: శ్రీవారికి చెందిన 970.080 కిలోల బంగారాన్ని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలో గోల్డ్‌మానిటైజేషన్ పథకం కింద శనివారం డిపాజిట్ చేశారు. టిటిడి ఈఓ డాక్టర్ డి సాంబశివరావు తన చాంబర్‌లో ఎస్‌బిఐ ఎండి రజనీ కుమార్‌కు ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను అందజేశారు. వాస్తవానికి ఈ బంగారాన్ని ఎస్‌బిఐలో 2016 మార్చి మాసంలో టిటిడి డిపాజిట్ చేసింది.

Pages