S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/02/2017 - 09:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మద్దతుగా 1,800 కోట్ల రూపాయలు అందుతున్నాయ. ఈ 2016-17 ఆర్థిక సంవత్సరం ఎయిర్ ఇండియాకు కేటాయించిన మొత్తం కన్నా ఇది కాస్త ఎక్కువ.

02/02/2017 - 09:21

ముంబయి, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లను బుధవారం కేంద్ర బడ్జెట్ పరుగులు పెట్టించింది. ఆదాయ పన్ను మినహాయింపులు, తగ్గింపులతో మదుపరులలో ఉత్సాహం ఉరకలెత్తింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెచ్చిన ఈ జోష్‌తో సూచీలు భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 485.68 పాయింట్లు పుంజుకుని మూడు నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని తాకుతూ 28,141.64 వద్ద ముగిసింది.

02/01/2017 - 00:26

న్యూఢిల్లీ, జనవరి 31: నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటోందో ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పిందని పారిశ్రామిక, వ్యాపార రంగాలు అభిప్రాయపడ్డాయి. మంగళవారం విడుదలైన ఆర్థిక సర్వే నేపథ్యంలో బుధవారం ప్రకటించే బడ్జెట్ సంస్కరణాత్మకంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.

02/01/2017 - 00:23

న్యూఢిల్లీ, జనవరి 31: బలమైన స్థూల ఆర్థిక మూలాలతో నిలకడైన వృద్ధిరేటు సాధ్యమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతూ పన్ను ఎగవేతల అడ్డుకట్టకు, నల్లధన నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు.

02/01/2017 - 00:23

ప్రభుత్వరంగ చమురు, సహజ వాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి నికర లాభం భారీగా పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఏకంగా మూడిం తలు ఎగిసి 4,352 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ లాభం కేవలం 1,466 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు అమ్మకాలు ఈసారి 9 శాతం వృద్ధితో 20,014 కోట్ల రూపాయలుగా ఉన్నాయ.

02/01/2017 - 00:21

న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయల్ కార్పొరేషన్ (ఐఒసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 29 శాతం పెరిగి 3,994.91 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ లాభం 3,095.75 కోట్ల రూపాయలుగా ఉంది.

02/01/2017 - 00:19

బిగ్ బి బ్లాక్‌బస్టర్’
తాజా ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ బ్లాక్‌బస్టర్ సినిమాగా అభివర్ణించారు. అమితాబ్ హిట్ సినిమాలో కథ, విషాదం, హాస్యం ఇలా ప్రేక్షకులు ఆకర్షితులయ్యే నవరసాలు ఉన్నట్లే.. ఆర్థిక సర్వేలోనూ అన్నీ ఉన్నాయన్నారు. ఆర్థిక సర్వేను రూపొందించడంలో సుబ్రమణియన్ ప్రముఖ పాత్ర వహించారు.

02/01/2017 - 00:18

ముంబయి, జనవరి 31: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2015-16) కంటే తక్కువగా నమోదు కాగలదన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆర్థిక సర్వేలో ఈసారి జిడిపి వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కాగలదన్న అంచనాలున్నాయి.

02/01/2017 - 00:17

న్యూఢిల్లీ, జనవరి 31: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 లక్షల మంది అనుమానిత డిపాజిట్లను కలిగి ఉన్నట్లు గుర్తించింది ఆదాయ పన్ను శాఖ. వీరిలో కొందరి డిపాజిట్ల విలువ 5 లక్షల రూపాయల పైమాటేనని తెలిపింది. ఈ సొమ్ము ఈ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఈ-మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా వివరణ కోరామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.

02/01/2017 - 00:16

రాజమహేంద్రవరం, జనవరి 31: రాష్ట్రంలో అపరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి మూడో పంటగా వేసవిలో అపరాల సాగుపై ప్రత్యేక దృష్టిసారించామని, ఇందుకోసం మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ కె ధనుంజయరెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం రాష్టస్థ్రాయి వేసవి అసరాల సాగుపై కార్యాచరణ ప్రణాళిక సదస్సు నిర్వహించారు.

Pages