S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/24/2016 - 04:06

విజయవాడ, ఆగస్టు 23: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై డెన్మార్క్ ఆసక్తి కనబరుస్తోంది. బ్రిటీష్ హైకమిషన్ సహకారంతో డెన్మార్క్‌లోని బ్రిటీష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మారియానో ఎ డేవిస్ నేతృత్వంలో డెన్మార్క్‌కు చెందిన సంస్థల ప్రతినిధుల బృందం విజయవాడకు వచ్చింది.

08/24/2016 - 04:05

రాజమహేంద్రవరం, ఆగస్టు 23: గతకొద్ది రోజులుగా సాగుతున్న కార్మికులు, ఉద్యోగుల ఆందోళన ప్రభావం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లోని ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు ఉత్పత్తిపై పడింది. కొందరు కార్మిక ప్రతినిధులను యాజమాన్యం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులు ఈనెల 11 నుంచి ఆందోళనబాట పట్టారు.

08/23/2016 - 02:09

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో నిరర్థక ఆస్తులు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అనుసరించాల్సిన మార్గాలను అనే్వషించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే నెల 16వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.

08/23/2016 - 02:07

తడ, ఆగస్టు 22: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీలో సోమవారం రెడ్‌స్టార్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారానికి భూమి పూజ నిర్వహించారు.

08/23/2016 - 02:05

ముంబయి, ఆగస్టు 22: ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకం.. ద్రవ్యోల్బణ ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇనె్వస్టర్లు ఆచితూచి లావాదేవీలు సాగించారు. దీని ప్రభావం పలు రకాల షేర్లపై పడటంతో లావాదేవీలు ముగిసే సమయానికి 91 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 28 వేల మార్కు వద్ద ముగిసింది.

08/23/2016 - 02:02

బీజింగ్, ఆగస్టు 22: నిన్న మొన్నటిదాకా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన చైనా స్థిరాస్తి మార్కెట్‌లో ఇప్పుడు స్తబ్దత నెలకొంటున్న సూచనలు కనిపిస్తుండడంతో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు ప్రదాన చోదకశక్తులుగా ఉండిన ఈ రంగం సంక్షోభ దిశకు మళ్లుతుందేమోనన్న భయాలు విధాన రూపకర్తల్లో తలెత్తుతున్నాయి.

08/23/2016 - 02:01

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: అఖండ గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు ఎట్టకేలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. దీంతో మరో వారం రోజుల్లో గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో వున్న డ్రెడ్జింగ్ ప్రక్రియకు కదలిక రావడంతో నదీ లోతు పెరిగేందుకు మార్గం సుగమం అయింది. దీనితో పాటే కృష్ణా నదిలో కూడా డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు.

08/23/2016 - 02:00

విశాఖపట్నం, ఆగస్టు 22: వచ్చే నెల 14 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పట్టణీకరణ, సదుపాయాల కల్పన తదితర అంశాలపై జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో పలు కీలక నిర్ణయలు తీసుకోనున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విశాఖ పర్యటన సందర్భంగా సమీక్షించనున్నారు.

08/23/2016 - 01:59

విజయవాడ, ఆగస్టు 22: ఏపిలో అమలు చేస్తున్న ఎన్‌టిఆర్ వైద్య సేవ, డిజిటల్ ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్, వ్యవసాయం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాల్లో తోడ్పాటు అందించేందుకు బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై వారందించనున్న సేవలపై చర్చించారు.

08/23/2016 - 02:03

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత్‌లో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన చర్యలపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంకు బృందం త్వరలో మరోసారి డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) అధికారులతో సమావేశం కానుంది.

Pages