S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/27/2017 - 00:57

న్యూఢిల్లీ, జనవరి 26: పట్టణ ప్రాంతాలకు విమాన కనెక్టివీని కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం కింద 190 రూట్ల కోసం 11 బిడ్డర్లనుంచి 43 ప్రాథమిక ప్రతిపాదనలు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఎఫ్)కు అందడంతో దేశంలో ఇప్పటివరకు విమాన సర్వీసులు లేని 43 విమానాశ్రయాలకు వచ్చే నెలనుంచి దశలవారీగా విమాన సర్వీసులు మొదలు కానున్నాయి.

01/27/2017 - 00:56

న్యూఢిల్లీ, జనవరి 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ కరెంటు ఖాతా లోటు ఇంతకుముందు అంచనా వేసిన జిడిపిలో 0.4 శాతం నుంచి 1.4 శాతానికి పెరగవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం ‘నోమురా’ పేర్కొంది.

01/27/2017 - 00:55

హైదరాబాద్, జనవరి 26: వచ్చే వేసవిలో తెలంగాణలో 11000 మెగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడినా తట్టుకునే శక్తి రాష్ట్ర విద్యుత్ శాఖకు ఉందని, విద్యుత్ కోతలకు తావులేకుండా పటిష్టమైన ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. రాష్ట్రం ఏర్పడి 26 నెలలు గడచినా, విద్యుత్ కోతలు లేకుండా రెప్పపాటు కరెంటు పోకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకున్నారన్నారు.

01/27/2017 - 00:53

విజయవాడ (క్రైం), జనవరి 26: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్ధిక సంవత్సరం కస్టమ్స్ పన్ను వసూళ్ళ ద్వారా రూ.3332 కోట్ల రెవిన్యూ లక్ష్యాలను సాధించాలని ఏపి కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ పిలుపునిచ్చారు. లక్ష్యాలను అధిగమించడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. విజయవాడలోని ఏపి కస్టమ్స్ కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

01/27/2017 - 00:53

న్యూఢిల్లీ, జనవరి 26: ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బిఐ తన లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోగలదని, ఎందుకంటే 2017 తొలి అర్ధ్భాగంలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సిపిఐ) 5 శాతంకన్నా తక్కువలోనే ఉండే అవకాశముందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి ఒక నివేదికలో అభిప్రాయ పడింది.

01/26/2017 - 09:00

బెంగళూరు, జనవరి 25: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 5.8 శాతం క్షీణించింది. 2,114.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,246 కోట్ల రూపాయలుగా ఉంది. అయినప్పటికీ ఆదాయంలో వృద్ధి కనిపించింది.

01/26/2017 - 08:57

ముంబయి, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. దీంతో పాత పెద్ద నోట్ల రద్దుకు ముందునాటి స్థాయిని అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 3 నెలల గరిష్ఠాన్ని తాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,600 స్థాయి ఎగువకు చేరింది.

01/26/2017 - 08:57

న్యూఢిల్లీ, జనవరి 25: విజయ్ మాల్యాపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం కొరడా ఝుళిపించింది. సెక్యురిటీస్ మార్కెట్ల నుంచి నిషేధించింది. మరో ఆరుగురిపైనా వేటు వేసింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసుతో సెబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

01/26/2017 - 08:56

భీమవరం, జనవరి 25: ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఆక్వా ఉత్పత్తులను పెంచాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అంతర్జాతీయ ఆక్వా సదస్సు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.

01/26/2017 - 08:56

కాకినాడ, జనవరి 25: ముడి చమురు ఉత్పత్తిలో భారతదేశం పూర్తిగా వెనుకబడి ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్, ఆ సంస్థ చైర్మన్ సీనియర్ అడ్వయిజర్ అతుల్ చంద్ర అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగిన చమురును ఉత్పత్తి చేయలేని స్థితిలో ఉన్న మన దేశం.. ఇతర దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, ఈ కారణంగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు.

Pages