-
ముంబయి, ఫిబ్రవరి 15: ముంబయికి చెందిన రియాలిటీ సంస్థ ‘లోథా డెవలపర్స్’ లండన్‌లో
-
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ వ్యాప్తంగా గత మూడేళ్లలో వేలం వేసిన 55 గనులకు చెం
-
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలను ఎదుర్కొన్నప్
-
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
లండన్, ఏప్రిల్ 29: నిరుడు బ్రిటన్‌లోకి భారతీయ పెట్టుబడులు దాదాపు 65 శాతం పెరిగాయి. దీంతో బ్రిటన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) అమెరికా, ఫ్రాన్స్ తర్వాత మూడో స్థానంలో భారత్ నిలిచింది. మరోవైపు బ్రిటన్‌లో భారతీయ సంస్థల సంఖ్య కూడా 36 నుంచి 62కు పెరిగింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి).. శుక్రవారం 13,030 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్దదైన యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డిఐ విలువే 12,900 కోట్ల రూపాయలు.
లండన్, ఏప్రిల్ 29: రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బిఎస్) నికర నష్టాలు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే రెట్టింపయ్యాయి. నిరుడు 459 మిలియన్ పౌండ్లుగా ఉంటే, ఈసారి 968 మిలియన్ పౌండ్లు (1.4 బిలియన్ డాలర్లు లేదా 1.2 బిలియన్ యూరోలు)గా నమోదయ్యాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆర్బిఎస్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల నేపథ్యంలో బ్యాంక్ నష్టాలు రెట్టింపయ్యాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాను భారత్‌కు తిప్పి పంపాలని కేంద్ర ప్రభుత్వం గురువారం లాంఛనంగా బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ధరలతో పాటు ఉత్పత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే విధంగా రైతులకు చేయూతనిచ్చేందుకు తేయాకు, కాఫీ, రబ్బరు తదితర ఉద్యాన పంటలకు మార్కెట్ ఆధారిత బీమా పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ముంబయి, ఏప్రిల్ 28: గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో బిఎస్ఇ సెనె్సక్స్ 461 పాయింట్లకు పైగా నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. గత మూడు వారాల్లో సెనె్సక్స్‌ఒక్క రోజులో ఇంత నారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని, 2017-18లో అది మరింత వేగవంతమై 7.8 శాతానికి చేరుకోవచ్చని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది.
నిజామాబాద్, ఏప్రిల్ 28: ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ బీడీ కార్ఖానాలు శుక్రవారం నుండి మళ్లీ తెరుచుకోనున్నాయి. బీడీ కంపెనీల యాజమాన్య సంఘంతో కార్మిక శాఖ అధికారుల సమక్షంలో బీడీ కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది బీడీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలోకి చౌకగా వచ్చిపడుతున్న ఉక్కు దిగుమతులను నియంత్రించేందుకు వీలుగా మరిన్ని చర్యలు చేపట్టేందుకు తమ శాఖ సుముఖంగా లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్కుపై తాము కనీస దిగుమతి ధర (ఎంఐపి)ను విధించామని, ఈ దిగుమతులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే విషయం గురించి తాను ఆలోచించడం లేదని ఆమె విలేఖర్లకు తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఆర్ధిక కార్యకలాపాలు అందించేందుకు ఏర్పాటైన సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. గురువారం నాడిక్కడ ఒక హాటల్లో సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జయేష్ రంజన్ హాజరయ్యారు.