S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/10/2016 - 08:12

ముంబయి, సెప్టెంబర్ 9: గత కొద్ది రోజులుగా కొనుగోళ్ల మద్దతుతో రికార్డు స్థాయికి చేరుకున్న దేశీయ మార్కెట్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సైతం మార్కెట్ల పతనానికి కారణమైనాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 248 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపుగా 86 పాయింట్లు నష్టపోయింది.

09/10/2016 - 08:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రభుత్వ కొనుగోళ్ల కోసం జరిపే బిడ్డింగ్ ప్రక్రియలో కాంపిటేషన్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) చైర్మన్ డికె సిక్రీ శుక్రవారం గట్టిగా కోరుతూ, అలా చేసినట్లయితే ఈ దేశ ద్రవ్య లోటు అంతా తుడిచిపెట్టుకు పోయేలా చేయవచ్చని అభిప్రాయ పడ్డారు.‘ ప్రభుత్వ ఏజన్సీలు గనుక ఇప్పటిలాగా అప్రమత్తమై బిడ్డింగ్ ప్రక్రియలో కాంపిటేషన్‌ను కచ్చితంగా అమలుచేసినట్ల

09/10/2016 - 08:11

ముంబయి, సెప్టెంబర్ 9: దేశంలో విదేశీ కరెన్సీ నిల్వలు సెప్టెంబర్ 2తో ముగిసిన వారానికి 367.76 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన విదేశీ కరెన్సీల రాకడ గణనీయంగా పెరగడంతో అంతకు ముందు వారంకన్నా 98.95 కోట్ల డాలర్ల మేరకు విదేశీ ద్రవ్య నిల్వలు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.

09/10/2016 - 08:10

బీజింగ్, సెప్టెంబర్ 9: ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతున్న చైనాను కష్టాలు వెంటాడుతున్నాయి. విదేశీ మార్కెట్లలో డిమాండ్ సరిగా లేకపోవడంతో గత నెలలో చైనా ఎగుమతులు క్షీణించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. అమెరికా డాలర్ల పరంగా ఏడాది క్రితం ఇదే కాలంలో చైనా నుంచి జరిగిన ఎగుమతులతో పోలిస్తే ఆగస్టులో ఎగుమతులు 2.8 శాతం మేరకు క్షీణించాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విభాగం పేర్కొంది.

09/10/2016 - 08:10

చెన్నై, సెప్టెంబర్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) హౌసింగ్ ఫైనాన్స్ విభాగం తమ ఖాతాదారులకు 40 వేల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

09/09/2016 - 11:48

ముంబయి: శుక్రవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.55 పైసలు వద్ద కొనసాగుతోంది. 110 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 40 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

09/09/2016 - 00:33

లగ్జరీ కార్ల తయారీలో పేరెన్నికగన్న జర్మనీ సంస్థ ఆడీ ప్రస్తుత పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఏ-4 సెడాన్ కారును గురువారం భారత్‌లో ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో ఇది రూ.38.1 లక్షల నుంచి రూ.41.2 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభ్యమవుతుంది.

09/09/2016 - 00:23

ముంబయి, సెప్టెంబర్ 8: ఆటో, రియల్టీ రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ఆరంభంనుంచి కూడా లాభాల బాటలోనే సాగడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 119 పాయింట్లు లాభపడి 29 వేల పాయింట్లను దాటి 17 నెలల గరిష్ఠస్థాయికి చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 34.55 పాయింట్లు లాభపడి 8,952.50 పాయింట్ల వద్ద ముగిసింది.

09/09/2016 - 00:22

సత్యవేడు, సెప్టెంబర్ 8: యుకె దేశానికి చెందిన పవర్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ నూతన ఉత్పత్తి కేంద్రం గురువారం ఉదయం నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్రారంభమైంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి యూనిట్‌గా పవర్ గ్యాస్ గ్రూప్ చైర్మన్ దీపక్ కిల్‌నాని లాంఛనంగా ప్రారంభించారు.

09/09/2016 - 00:21

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జీఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గురువారం ఆమోదించింది. అంతకుముందు మండలి చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాన రాజకీయ పక్షాలు కోరాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అలక్ష్య వైఖరిని ప్రదర్శించిందని అధికార పక్షం మినహా మిగతా విపక్షాలన్నీ ఆరోపించాయి.

Pages