S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/26/2016 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 25: భారతీయ వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన పలువురు పారిశ్రామికవేత్తలను సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో గౌరవించింది. వీరిలో రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక అధినేత, ధీరుభాయ్ అంబానీకి మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ దక్కింది. గుజరాత్‌లోని ఓ కుగ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడిగా జన్మించిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ..

01/26/2016 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 25: విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులంటేనే పరుగందు కుంటున్నారు. తమ పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లు పదిలమని భావిస్తున్నారు. అవును మరి. ఈ నెల (1-22)లో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 2,353 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు..

01/26/2016 - 02:06

ముంబయి, జనవరి 25: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 20.1 శాతం పెరిగింది. 3,358.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో 2,794.51 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 18,283.31 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 14,930 కోట్ల రూపాయలుగా ఉంది.

01/26/2016 - 02:05

న్యూఢిల్లీ, జనవరి 25: రాబోయే ఐదేళ్లలో భారత్‌లోకి ఫ్రాన్స్ సంస్థలు సుమారు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడుల (10 బిలియన్ డాలర్లు)ను తీసుకురానున్నాయని ఆ దేశ ఆర్థిక, ప్రజా పద్దుల శాఖ మంత్రి మిచెల్ శాపిన్ తెలిపారు. సోమవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సెషన్‌లో ఆయన మాట్లాడారు.

01/26/2016 - 02:05

ముంబయి, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉద్దీపనలపై విశ్వాసంతో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 50.29 పాయింట్లు లాభపడి 24,485.95 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.70 పాయింట్లు కోలుకుని 7,436.15 వద్ద నిలిచింది.

01/26/2016 - 02:04

హైదరాబాద్, జనవరి 25: భారతీయ ప్రీమియర్ బిజినెస్ స్కూల్‌గా ఘనత సాధించిన ఘజియాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) 535 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్ కల్పించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించింది.

01/26/2016 - 02:03

హైదరాబాద్, జనవరి 25: ఆదిలాబాద్ పట్టణంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ముందడుగు సాధించాయి. చర్చలు ఫలిస్తే త్వరలోనే సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది.

01/25/2016 - 02:57

చండీగఢ్, జనవరి 24: భారత్-ఫ్రాన్స్‌లు వ్యాపార, వాణిజ్య రంగాల్లో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ పర్యటన తొలిరోజైన ఆదివారం జరిగిన వ్యాపార శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాలు పదహారు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

01/25/2016 - 02:56

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను వెల్లడయ్యే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/25/2016 - 02:55

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజి) బేసిన్‌లోగల ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతిని అందుకుంది. 53,000 కోట్ల రూపాయలకుపైగా నిధులతో 45 చమురు బావుల అభివృద్ధి, వాటికి సంబంధించిన ఇతర వౌలిక సదుపాయాలను ఒఎన్‌జిసి ఇక్కడ కల్పిస్తోంది.

Pages