S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/17/2017 - 01:58

న్యూఢిల్లీ, జనవరి 16: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)లో ఒక్కో షేర్ ధరను 805-806 రూపాయలుగా నిర్ణయించారు. 1,243 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకు బిఎస్‌ఇ దిగుతోంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఐపిఒ.. ఈ నెల 23న ప్రారంభమై, 25న ముగుస్తుంది. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూల్లో బిఎస్‌ఇదే మొదటిది. 15.43 మిలియన్ షేర్లను బిఎస్‌ఇ ఈ సందర్భంగా విక్రయించనుంది.

01/17/2017 - 01:53

న్యూఢిల్లీ, జనవరి 16: టాటా గ్రూప్ సంస్థ టైటాన్ కంపెనీ.. తమ ఆభరణాల బ్రాండ్ ‘గోల్డ్ ప్లస్’ను తనిష్క్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకుంది. 2005 నుంచి దక్షిణ భారత మార్కెట్‌లో ‘గోల్డ్ ప్లస్’ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు గోల్డ్ ప్లస్‌ను తనిష్క్‌ను ఒక్కటి చేయాలనుకుంటున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టైటాన్ తెలిపింది.

01/17/2017 - 01:53

న్యూఢిల్లీ, జనవరి 16: పత్రికా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కున్న పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం 26 శాతం ఎఫ్‌డిఐకి అనుమతి ఉండగా, దీన్ని 49 శాతానికి తీసుకెళ్ళాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి కసరత్తును కూడా ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిరుడు చాలా రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను కేంద్రం సడలించినది తెలిసిందే.

01/17/2017 - 01:52

హైదరాబాద్, జనవరి 16: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్.. సోమవారం నగదు రహిత లావాదేవీల కోసం ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే ఈ లావాదేవీలకు ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ‘డిజిటలైజేషన్‌లో భాగంగా మేము బ్యాంక్ ఖాతాదారులకు మరో సౌకర్యాన్ని అందిస్తున్నాం. సోమవారం నుంచే ఈ సదుపాయం అమల్లోకి వస్తుంది.

01/17/2017 - 01:49

వాషింగ్టన్, జనవరి 16: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్).. సోమవారం భారత జిడిపి వృద్ధిరేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 6.6 శాతంగానే నమోదు కావచ్చని అంచనా వేసింది. అంతకుముందు 7.6 శాతంగా ఉండొచ్చని పేర్కొనగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వృద్ధిరేటు పడిపోవచ్చని అభిప్రాయపడింది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ సైతం దేశ జిడిపి వృద్ధిరేటును తగ్గించినది తెలిసిందే.

01/17/2017 - 01:49

ముంబయి, జనవరి 16: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7,506 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 3.6 శాతం అధికం. నాడు 7,245 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్‌ఐఎల్ అందుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో సోమవారం సంస్థ తెలిపింది.

01/17/2017 - 01:47

ముంబయి, జనవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 50.11 పాయింట్లు పెరిగి 27,288.17 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.45 పాయింట్లు అందిపుచ్చుకుని 8,412.80 వద్ద నిలిచింది.

01/17/2017 - 01:47

హైదరాబాద్, జనవరి 16: ఏ ప్రభుత్వరంగ సంస్థ విజయమైనా అందులో పనిచేసే ఉద్యోగుల పనితీరు, సమర్థతపై ఆధారపడి ఉంటుందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ కె అగ్రవాల్ సోమవారం అన్నారు.

01/17/2017 - 01:46

న్యూఢిల్లీ, జనవరి 16: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల డిసెంబర్ టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) గణాంకాలను పెంచాయి. 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్‌లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 3.39 శాతానికి ఎగబాకింది. నాడు మైనస్ 1.06 శాతంగా ఉండగా, నిరుడు నవంబర్‌లో 3.15 శాతంగా ఉంది. ఈ మేరకు సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

01/17/2017 - 01:46

విజయవాడ, జనవరి 16: వివిధ దేశాల్లో బహుళ విద్యుత్ ఉత్పాదన రంగంలో దిగ్గజమైన స్విట్జర్లాండ్‌కు చెందిన ‘బికెడబ్ల్యు ఎనర్జీ ఎజి’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో జలవిద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ముందుకొచ్చింది. అణు విద్యుత్ నుంచి పునరుత్పాదక విద్యుదుత్పత్తి దాకా అనేక రంగాల్లో ఈ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటిగా పేరుపొందింది.

Pages