S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/12/2017 - 08:29

న్యూఢిల్లీ, జనవరి 11: త్రివర్ణ పతాకాన్ని అవమానించే రీతిలో ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్నందుకు అంతర్జాతీయ ఆన్‌లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌పై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.

01/12/2017 - 08:28

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు లబ్ది చేకూర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తూ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్ వెంకటరాంరెడ్డి నేతృత్వంలో వివిధ సంస్థలు, స్టేక్‌హోల్డర్లతో కూడిన రాష్టస్థ్రాయి సంప్రదింపుల సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది.

01/11/2017 - 07:40

రాజమహేంద్రవరం, జనవరి 10: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల హోల్‌సేల్ వర్తకానికి కేంద్రమైన రాజమహేంద్రవరంలోని అపరాల మార్కెట్ కుదేలైంది. కొనుగోలు చేసే నాథుడు లేక, గిట్టుబాటు ధర రాక, రైతులు నష్టపోతే, చిల్లర నోట్లు లేక, చిల్లర అమ్మకాలవ్వక, పెట్టుబడులు సమకూర్చుకోలేక వ్యాపారులు చతికిలపడ్డారు. పండుగ సమయంలోనైనా జోరుగా సాగుతాయనుకున్న వ్యాపారం మందగించడంతో వ్యాపారులు బిత్తరపోతున్నారు.

01/11/2017 - 07:37

గాంధీనగర్, జనవరి 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంస్కరణలను, విధానాలను దేశ, విదేశీ పారిశ్రామిక రంగం కొనియాడింది. ముఖ్యంగా పలువురు విదేశీ సంస్థల సిఇఒలు మోదీ నిర్ణయాలను ప్రశంసించారు. మంగళవారం ఇక్కడ జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

01/11/2017 - 07:37

హైదరాబాద్, జనవరి 10: దేశ ఐటి రంగానికి ఆయువుపట్టులా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి పట్టణాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. మంగళవారం చెన్నైలో ఇండియాటుడే గ్రూపు నిర్వహించిన ది సౌత్ ఇండియా కంక్లేవ్‌లో కెటిఆర్ పాల్గొన్నారు.

01/11/2017 - 07:36

హైదరాబాద్, జనవరి 10: కోళ్ల పరిశ్రమకు బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చేయూతనివ్వాలని సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (సిపిడిఒ) కోరింది. మంగళవారం ఇక్కడ ఎస్‌బిఐ గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కోళ్ల పరిశ్రమ-ఇబ్బందులు-సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును ఎస్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ అశ్విన్ మెహతా ప్రారంభించారు.

01/11/2017 - 07:35

ముంబయి, జనవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 173.01 పాయింట్లు పుంజుకుని 26,899.56 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 52.55 పాయింట్లు అందుకుని 8,288.60 వద్ద నిలిచింది. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లతోపాటు మెటల్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.

01/11/2017 - 07:35

హైదరాబాద్, జనవరి 10: హైదరాబాద్ సిగలో ఔషధ నగరి చేరబోతోంది. వచ్చే 15 రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాత ఔషధ నగరి (్ఫర్మాసిటీ) కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. కొత్తగా వచ్చే ఔషధ నగరిలో నెలకొల్పనున్న వౌలిక సదుపాయాల వివరాలతో ఈ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు.

01/11/2017 - 07:34

న్యూఢిల్లీ, జనవరి 10: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశీయ నిర్మాణ రంగంపై చూపింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినది తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.

01/10/2017 - 01:15

గాంధీనగర్, జనవరి 9: దేశంలోనే తొలి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఐఎన్‌ఎక్స్)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ (గిఫ్ట్) సిటీలోగల ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సి) వద్ద మోదీ చేతులమీదుగా ఐఎన్‌ఎక్స్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) అనుబంధ సంస్థే ఈ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజ్ (ఐఎన్‌ఎక్స్).

Pages