S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/18/2016 - 07:08

లండన్/వాషింగ్టన్, ఏప్రిల్ 17: విజయ్ మాల్యా అమెరికాలోని తన బ్రూవరీ సంస్థ ఎంబిసి నుంచి గత సంవత్సరం రూ. 1.71 కోట్లకుపైగా వేతనాన్ని పొందారు. అయితే ఆ సంస్థ నిధుల కొరతను ఎదుర్కొంటూ రుణదాతల నుంచి డిఫాల్ట్ నోటీసులను అందుకోవడం విశేషం. 2015లో మాల్యా పొందిన మొత్తం వేతనంలో సగానికిపైగా వేతనాన్ని కాలిఫోర్నియాలోని మెండోసినో బ్రూవింగ్ కంపెనీ (ఎంబిసి)యే చెల్లించింది.

04/18/2016 - 07:06

ముత్తుకూరు, ఏప్రిల్ 17: కృష్ణపట్నం ఓడరేవు నుంచి మొదటిసారిగా ఒమన్ దేశంలోని ఫలాల ఓడరేవుకు ఆదివారం మేయరస్ బెంటోన్ విల్లా అనే విదేశీ నౌక కంటైనర్లతో బయలుదేరింది. ఈ కంటైనర్ నౌకను తొమ్మిదవ బెర్తువద్ద పోర్టు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితేంద్ర ప్రారంభించారు. నౌక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పోర్టు అధికారులు ఘనంగా జరిపారు.

04/18/2016 - 07:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల మధ్య కూడా దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడు లు పోటెత్తుతున్నాయ. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నా రు. గత నెల మార్చిలో షేర్ల కొనుగోళ్లకు విశేషంగా ఆసక్తి కనబరిచిన మదుపరులు..

04/18/2016 - 07:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గత ఏడాది 37 శాతం పెరిగి 39.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 28.78 బిలియన్ డాలర్లకే ఎఫ్‌డిఐ పరిమితమైనట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) తెలియజేసింది. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగంలోకి అత్యధికంగా ఎఫ్‌డిఐ వచ్చింది.

04/17/2016 - 05:43

వాషింగ్టన్, ఏప్రిల్ 16: భారత ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), దాని అమెరికా విభాగమైన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌పై అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది.

04/17/2016 - 05:42

వాషింగ్టన్, ఏప్రిల్ 16: ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తరచూ భారత్‌ను ఓ వెలుగు రేఖగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాలను ‘గుడ్డివాళ్ల రాజ్యానికి ఒంటి కన్ను రాజు’ చందంగా పేర్కొన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్. ఏదీ దొరకని చోట దొరికినదే మహా ప్రసాదం అన్న ధోరణిలో స్పందించారు రాజన్.

04/17/2016 - 05:40

వాషింగ్టన్, ఏప్రిల్ 16: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్ మాల్యా కష్టాలకు ఆయన వ్యాపార విధానాలే కారణమన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నడిపిన తీరును ప్రశ్నిస్తూ భారత విమానయాన రంగం బాగానే ఉందని, చాలా సంస్థలు లాభాలను అందుకుంటున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకర్లకు 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసిన మాల్యా..

04/17/2016 - 05:39

ముంబయి, ఏప్రిల్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ జరిగింది మూడు రోజులే అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 952.91 పాయింట్లు పుంజుకుంది. ఫలితంగా తిరిగి 25 వేల స్థాయికి చేరుకున్న సూచీ.. 25,626.75 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 295.25 పాయింట్లు ఎగిసింది. 7,800 మార్కును అధిగమించి 7,850.45 వద్ద నిలిచింది.

04/17/2016 - 05:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: రైలు ప్రయాణీకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరిస్తూ.. గూగుల్ ఆదివారం భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలను ప్రారంభిస్తోంది. ఉచిత వైఫై ప్రాజెక్టులో భాగంగా దేశంలో గూగుల్ ప్రస్తుతం ముంబయి సెంట్రల్‌లో మాత్రమే ఈ సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్న రెండో రైల్వే స్టేషన్‌గా భువనేశ్వర్ అవతరించనుంది.

04/17/2016 - 05:38

నెల్లూరు, ఏప్రిల్ 16: దేశంలో నిరుద్యోగ నిర్మూలన రూపుమాపాలంటే గ్రామ, పట్టణాల్లో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం నెల్లూరులోని విపిఆర్ కన్వన్షన్ హాల్‌లో స్వర్ణ్భారత్ ట్రస్ట్ సౌజన్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది.

Pages