S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/10/2017 - 01:04

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రపంచంలోనే పరుగులు పెడుతున్న జిడిపి భారత్ సొంతం. వృద్ధిరేటులో భారత్‌కు సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. నిన్నమొన్నటిదాకా దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత్ జిడిపి తగ్గుముఖం పడుతోంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఇప్పుడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు.

01/09/2017 - 00:19

న్యూఢిల్లీ, జనవరి 8: సైరస్ మిస్ర్తి, నస్లీ వాడియాలను డైరెక్టర్లుగా తొలగించడంలో టాటా సన్స్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు, కార్పొరేట్ గవర్నెన్స్ నియమాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. కొన్ని టాటా గ్రూప్ సంస్థల నుంచి వివరణ కోరింది. మిస్ర్తి, వాడియా నుంచి లేఖలు అందిన నేపథ్యంలో సెబీ పైవిధంగా స్పందించింది. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్..

01/09/2017 - 00:19

న్యూఢిల్లీ, జనవరి 8: త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఐటిరంగ సంస్థలైన టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయ. దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయ.

01/09/2017 - 00:17

బెంగళూరు, జనవరి 8: పోర్చుగల్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ భారత్‌ను ఆ దేశ ప్రధాన మంత్రి ఆంటోనియా కోస్టా ఆహ్వానించారు. ఆదివారం ఇక్కడ జరిగిన 14వ ప్రవాసి భారతీయ దివస్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పోర్చుగల్ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ‘అమెరికా, కెనడాలతో మా దేశానికి మంచి సంబంధాలున్నాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతోనూ సత్సంబంధాలున్నాయి.

01/09/2017 - 00:15

భీమవరం, జనవరి 8: వ్యవసాయ ఉత్పత్తుల్లో గాని.. చేప, రొయ్య ఎగుమతుల్లోగాని ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాతి స్థానంలో ఆంధ్రా ఉందన్న ఆయన పౌల్ట్రీలో ప్రథమ స్థానం, ఉద్యానవనంతో పాటు చేప, రొయ్యల ఎగుమతుల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామన్నారు.

01/09/2017 - 00:13

న్యూఢిల్లీ, జనవరి 8: పాత పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలుగులోకి వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ ‘ఇన్నాళ్లూ అవినీతిపరులు, అక్రమార్కుల నీడలో దాగున్న సంపద నోట్ల రద్దుతో బయటపడుతున్నది చూస్తూనే ఉన్నాం కదా..’ అని అన్నారు. నల్లధనాన్ని దాచలేకపోతున్నారని, నల్లధన కుబేరులూ దొరికిపోతున్నారని గుర్తుచేశారు.

01/09/2017 - 00:11

న్యూఢిల్లీ, జనవరి 8: దేశీయ మార్కెట్ల నుంచి నిరుడు విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచిన విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. రుణ మార్కెట్లకు మాత్రం దూరంగా ఉండిపోయారు.

01/08/2017 - 08:42

హైదరాబాద్, జనవరి 7: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) నుంచి రుణాల మంజూరు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో మందగించింది. ఈ మేరకు ముద్ర సిఇఒ జిజి మమ్మెన్ శనివారం ఇక్కడ తెలిపారు. నిరుడు ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 80,000 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చామని చెప్పారు.

01/08/2017 - 08:40

విజయవాడ, జనవరి 7: చంద్రన్న దళితబాట, చంద్రన్న తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుకలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. రాయితీపై పశుగ్రాసాన్ని అందిస్తోందిప్పుడు. జన్మభూమి-మాఊరులో ‘ఇంటింటా పశుసంపద’ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ఆదరణ లభిస్తోంది. కుటుంబ వికాసమే-సమాజ వికాసం, సమగ్ర రాష్ట్ర వికాసమే-సంపూర్ణ దేశ వికాసం..

01/08/2017 - 08:41

న్యూఢిల్లీ, జనవరి 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించి నియమ, నిబంధనలు ఖరారైన తర్వాత కూడా దాని అమలుకు పారిశ్రామిక రంగానికి కనీసం మూడు నెలల సమయమైనా పడుతుందని పారిశ్రామిక సంఘం ఫిక్కీ అభిప్రాయపడింది. చారిత్రాత్మక జిఎస్‌టి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది తెలిసిందే. 5, 12, 18, 28 శాతం పన్నులతో రూపుదిద్దుకున్న జిఎస్‌టికి..

Pages