S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/08/2017 - 08:38

హైదరాబాద్, జనవరి 7: వడ్డీరేట్లను తగ్గించిన నాటి నుంచి గృహ రుణాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నవారు మూడింతలు పెరిగారని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఆదివారం గృహ, కార్పొరేట్ రుణాల వడ్డీరేట్లను ఎస్‌బిఐ తగ్గించినది తెలిసిందే.

01/08/2017 - 08:37

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్‌బర్డ్.. దేశీయ మార్కెట్‌లోకి 35 సరికొత్త హెల్మెట్లను తీసుకురానుంది. భారతీయ మార్కెట్‌లో మరింత పట్టు సాధించే దిశగా వెళ్తున్న స్టీల్‌బర్డ్.. గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లోనూ విస్తరించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే నూతన ఉత్పత్తులపై స్టీల్‌బర్డ్ దృష్టి పెట్టింది.

01/08/2017 - 08:36

బెంగళూరు, జనవరి 7: ప్రపంచంలో అధికార సమత్యులతను సాధించడానికి భారత్ పటిష్ఠమైన దేశంగా, మరింత ప్రభావశీలమైన దేశంగా ఎదగవలసిన అవసరం ఉందని దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మిఖాయెల్ అశ్విన్ అధిన్ అన్నారు.

01/08/2017 - 08:35

ముంబయ, జనవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరానికి నష్టాలతో స్వాగతం పలికాయి. పడుతూ.. లేస్తూ సాగిన ఈ ఏడాది తొలి వారంలో సూచీలు లాభాలను అందుకున్నప్పటికీ, విదేశీ మదుపరులు మాత్రం పెట్టు బడులకు దూరంగా ఉండటం మార్కెట్ వర్గాలకు కొంత నిరాశ కలిగించింది.

01/07/2017 - 00:12

ముంబయి/న్యూఢిల్లీ, జనవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లకు హెచ్-1బి వీసాల ఆందోళన పట్టుకుంది. ఐటి రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో శుక్రవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. హెచ్-1బి వీసాల జారీకి సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదిస్తున్న బిల్లు అమెరికా కాంగ్రెస్‌లోకి మళ్లీ రావడం.. భారతీయ మార్కెట్లను కుదిపేసింది. భారత ఐటి రంగ సంస్థల ఆదాయంలో అగ్ర భాగం విదేశాల నుంచే వస్తుంది.

01/07/2017 - 00:10

న్యూఢిల్లీ, జనవరి 6: రుణాలపై వడ్డీరేట్లను మరో మూడు బ్యాంకులు తగ్గించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌తోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకైన సిటి బ్యాంక్ 1 శాతం వరకు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. సిండికేట్ బ్యాంక్, సిటి బ్యాంకులు 0.7 శాతం వరకు తగ్గిస్తే, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 8.65 శాతం వరకు దించింది.

01/07/2017 - 00:10

న్యూఢిల్లీ, జనవరి 6: ప్రముఖ టెలికామ్ సంస్థ వొడాఫోన్.. సరికొత్త ఆఫర్లను శుక్రవారం పరిచయం చేసింది. సూపర్ అవర్ పథకం క్రింద అపరిమితంగా 3జి, 4జి డేటాను ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం ఆఫర్ చేసింది. ఇందుకు 16 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సొంత నెట్‌వర్క్ పరిధిలో గంటపాటు అపరిమిత లోకల్ వాయిస్ కాల్స్‌ను కూడా తెచ్చింది. ఇందుకు 7 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

01/07/2017 - 00:13

న్యూఢిల్లీ, జనవరి 6: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండవచ్చని కేంద్రం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. తయారీ, గనులు, నిర్మాణ రంగాల్లో నెలకొన్న మందగమనమే జిడిపి వృద్ధిరేటు తగ్గుదలకు కారణమని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాత్రం కాదంది.

01/07/2017 - 00:08

ముత్తుకూరు, జనవరి 6: కృష్ణపట్నం పోర్టు ద్వారా ఈ సంవత్సరం 2 లక్షల 30 వేల కంటైనర్లను దిగుమతులు, ఎగుమతులు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఓడరేవు సిఇఒ అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రం కాండ్ల పోర్టు నుండి కాందీడాక్-1 అనే నౌక కృష్ణపట్నం ఓడరేవులోని సౌత్‌బెర్తు వద్ద లంగరు వేసుకుంది. మల్టీమోడల్ మూవెంట్ ఆఫ్ విండీమిల్ టవర్స్ ఈ నౌక ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు చేరుకున్నాయి.

01/07/2017 - 00:06

న్యూఢిల్లీ, జనవరి 6: వాట్సాప్.. ఈ పేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. దైనందిన జీవితంలో ప్రతీ ఒక్కరితో అంతగా మమేకమైందీ సోషల్ సర్వీస్ యాప్. టెక్స్ట్, వాయిస్, ఫోటో, గ్రాఫిక్స్ మెసేజ్‌లతోపాటు వీడియో కాలింగ్ సౌకర్యం కలిగిన ఈ వాట్సాప్ పలకరింతలతోనే చాలామంది తమ రోజువారి కార్యకలాపాలను ఇప్పుడు ప్రారంభిస్తున్నారు మరి. పండగలు, ప్రత్యేక రోజుల్లోనైతే వాట్సాప్ చాటింగ్‌లకు విరామమే ఉండదు.

Pages