S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/07/2017 - 00:05

విజయవాడ, జనవరి 6: జీవితబీమా ద్వారా గడచిన 60 ఏళ్లుగా సాలీనా కేంద్ర ప్రభుత్వానికి 10 శాతం చొప్పున దాదాపు 2 వేల కోట్ల రూపాయలు పైగా రాబడి సంపాదించి పెడుతున్న ఎల్‌ఐసిలోకి విదేశీ పెట్టుబడులను తీసుకురావడంపై ఏజెంట్లు మండిపడుతున్నారు.

01/07/2017 - 00:03

అమరావతి, జనవరి 6: ఆంధ్ర రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు అధికంగా జరిగేలా ప్రభుత్వం పలు మార్గాల్లో చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం ద్వారా ప్రస్తుతం దేశంలో నెలకొన్న నోట్ల కొరతతోపాటు చిల్లర సమస్యను సులభంగా అధిగమించ వచ్చునని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నగదు రహిత లావాదేవీలు వంద శాతం మేర జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

01/07/2017 - 00:03

హైదరాబాద్, జనవరి 6: విద్యుత్ వినియోగదారులను వారి హక్కులపై చైతన్యపరిచేందుకు గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు లీగల్ సర్వీసెస్ అథారిటీతో కలిసి విద్యుత్ శాఖ పనిచేస్తుందని ఏపిఇఆర్‌సి ప్రకటించింది. వినియోగదారులు విద్యు త్ నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంది.

01/07/2017 - 00:02

తడ, జనవరి 6: శ్రీసిటీలో చైనాకు చెందిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పరిశ్రమ.. ప్లాంట్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ జరిపింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ రాష్ట్రానికే తలమానిక మన్నారు. దేశంలోనే శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు.

01/07/2017 - 00:01

హైదరాబాద్, జనవరి 6: పియర్‌సన్ అకాడమి ఇండియా.. మై ఛాయిస్ మై ఫ్యూచర్ పేరిట భారతీయులకు ఉద్యోగ మార్గదర్శనం అందించే ఆన్‌లైన్ వ్యక్తిత్వ వౌల్యమాపన పరిష్కరణలను ఆరు భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చింది. పాఠశాల, కాలేజీల విద్యార్థులకు మరింత చేరువ య్యేలా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఎంసిఎంఎఫ్ సహకారాన్ని అందిస్తోంది.

01/07/2017 - 00:01

హైదరాబాద్, జనవరి 6: గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (అంతర్జాతీయ భారతీయ వైద్యులు) సదస్సు హైదరాబాద్‌లో 7,8 తేదీల్లో జరుగుతుందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో డయాబెటికల్ ది జెయింట్ కిల్లర్, ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసిన్స్‌పై చర్చిస్తారు. వివిధ దేశాల నుంచి 500 మంది భారత సంతతి వైద్య నిపుణులు రానున్నట్లు ఆయన చెప్పారు.

01/07/2017 - 00:00

హైదరాబాద్, జనవరి 6: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్ బస్.. ఇప్పుడు ఒక కొత్త సర్వీసు బస్ హైర్‌ను ఆవిష్కరించింది. బస్సులు, మినీ బస్సులు, టెంపో ట్రావెలర్స్ కిరాయికి కావాలంటే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని రెడ్‌బస్ సిఇఒ ప్రకాశ్ సంగమ్ తెలిపారు. బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు.

01/06/2017 - 23:58

న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పలు ప్రాజెక్టులను మంజూరు చేసినందుకు ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ యల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌తో ప్రసాద్ భేటి అయ్యారు.

01/06/2017 - 00:36

ముంబయి, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో కళకళలాడాయి. అమెరికా వడ్డీ రేట్ల పెంపు వేగం అనుకున్నంత వేగంగా ఉండకపోవచ్చన్న డిసెంబర్ నెల ఫెడరల్ రిజర్వ్ సమావేశం సంకేతాలతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం, అదే బాటలో ఐరోపా మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి కనిపించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 245 పాయింట్లకు పైగా లాభపడి రెండు నెలల గరిష్ఠ స్థాయి అయిన 26,878 పాయింట్లకు చేరువయింది.

01/06/2017 - 00:35

ఖరగ్‌పూర్, జనవరి 5: భారత్‌లో ప్రజలు విరివిగా ఇంటర్నెట్, డిజిటల్ సేవలకు అనుసంధానం కావాలంటే దేశంలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల ధరలను మరింత తగ్గించి కనీసం 30 డాలర్లకు చేర్చాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థ గూగుల్‌కు అధినేతగా వ్యవహరిస్తున్న ప్రవాస భారతీయుడు సుందర్ పిచాయ్ ఉద్ఘాటించారు.

Pages