S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/05/2017 - 07:46

హైదరాబాద్, జనవరి 4: నిజామాబాద్ జిల్లా పడిగల్‌లో ఏర్పాటు చేస్తున్న టర్మరిక్ స్పైస్ పార్క్‌కు వచ్చే బడ్జెట్‌లో 15 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు.

01/05/2017 - 07:45

విజయవాడ, జనవరి 4: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగంపై స్పష్టంగా కనబడుతోంది. ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు మందకొడిగా జరుగుతుండటంతో లక్ష్యాల సాధనలో ఆ శాఖ వెనుకబడింది. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిరుడు నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మొదటి నెల రోజుల్లోనే దాదాపు 8,00 కోట్ల రూపాయల మేరకు ఖజానాకు గండి పడింది.

01/05/2017 - 07:44

ముంబయి, జనవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్పంగా నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో నెలకొన్న మందగమనం మధ్య విదేశీ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆరంభంలో భారతీయ సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ, మార్కెట్ ముగిసే సమయం దగ్గరపడుతున్నకొద్దీ నష్టాలు తప్పలేదు.

01/05/2017 - 07:43

న్యూఢిల్లీ, జనవరి 4: భారతీయ సూక్ష్మ, మధ్యతరహా సంస్థ (ఎస్‌ఎమ్‌ఇ)ల డిజిటలైజేషన్‌కు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. గూగుల్ ఆవిష్కరణలతో దేశంలోని 51 మిలియన్ల ఎస్‌ఎమ్‌ఇలకు డిజిటల్ సహకరం అందనుంది. గూగుల్ సిఇఒ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్.. ఎస్‌ఎమ్‌ఇలు డిజిటల్ విధానంలోకి వెళ్లేందుకు కావాల్సిన అనేక నిర్ణయాలను బుధవారం ఇక్కడ ప్రకటించారు.

01/04/2017 - 00:51

న్యూఢిల్లీ, జనవరి 3: ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు గృహ, కార్పొరేట్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో మంగళవారం దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ప్రభుత్వరంగ బ్యాంకులైన కార్పొరేషన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను దించాయ.

01/04/2017 - 00:50

న్యూఢిల్లీ, జనవరి 3: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి ఎగుమతుల రంగానికి మినహాయింపు ఇవ్వాలని జిఎస్‌టి మండలిని కోరింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అలాగే తోలు, సిమెంట్, ప్లాంటేషన్ వంటి కార్మిక ఆధారిత రంగాలపై పన్నును తక్కువగా విధించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం జిఎస్‌టి కౌన్సిల్‌తో ఇక్కడ జరిగిన సమావేశం అనంతరం ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేఖరులతో మాట్లాడారు.

01/04/2017 - 00:49

న్యూఢిల్లీ, జనవరి 3: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతినిచ్చింది. ఆసియా ఖండంలోనే అంత్యంత ప్రాచీన ఎక్స్‌చేంజ్ అయిన బిఎస్‌ఇ.. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా 1,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించవచ్చని అంచనా. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా బిఎస్‌ఇలోని ప్రస్తుత భాగస్వాములు ఈ ఐపిఒలో 2,99,55,434 షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు.

01/04/2017 - 00:47

దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం సరికొత్త పిక్-అప్ వెహికిల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘జీనన్ యోధ’ పేరుతో వచ్చిన ఈ వాణిజ్య వాహనం
ప్రారంభ ధర 6.05 లక్షల రూపాయలు. టాటా మోటార్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలీవుడ్ యాక్షన్ స్టార్

01/04/2017 - 00:52

న్యూఢిల్లీ, జనవరి 3: పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును అందుకున్నట్లు పేటిఎమ్ మంగళవారం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంజూరు చేసినట్లు చెప్పింది. వచ్చే నెల నుంచి పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు మొదలు కావచ్చని వివరించింది. వ్యక్తిగతంగా, చిన్నతరహా వ్యాపారుల నుంచి ఒక్కో ఖాతాకు లక్ష రూపాయల వరకు పేమెంట్స్ బ్యాంకులు డిపాజిట్లు సేకరించవచ్చు.

01/04/2017 - 00:44

ముంబయి, జనవరి 3: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కరెన్సీలో కనీసం 40 శాతం గ్రామీణ ప్రాంతాలకు పంపాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కోరింది. పేద, సన్నకారు రైతులకు నగదు కొరత సమస్య రాకుండా చూడాలని సూచించింది.

Pages