S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/14/2016 - 00:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆటోరంగ సంస్థలు వాహన ధరలను పెంచుతున్నాయి. జనవరి 1 నుంచి కార్ల ధరలు రెక్కలు తొడగనున్నాయి. ఉత్పాదక వ్యయం పెరిగిందని, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గిందని ఇప్పటికే టొయోటా, టాటా మోటార్స్, రెనాల్ట్ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచాయి. వచ్చే నెల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.

12/14/2016 - 00:20

ముంబయి, డిసెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. వడ్డీరేట్లను పెంచే వీలుందన్న సంకేతాలున్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు.

12/14/2016 - 00:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 600 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే ఇది 77 శాతం తక్కువ. నిరుడు 2,654 కోట్ల రూపాయల లాభాన్ని కోల్ ఇండియా అందుకోవడం గమనార్హం.

12/14/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఏడాది అత్యంత సంచలనాత్మక మొబైల్ వీడియో గేమ్ అయిన ‘పోకేమాన్ గో’.. ఎట్టకేలకు బుధవారం భారతీయ మార్కెట్‌లోకి అడుగిడుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భాగస్వామ్యంతో భారత్‌కు ఈ సుపరిచిత గేమ్ పరిచయమవుతోంది. బుధవారం నుంచి దేశంలో ఈ గేమ్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

12/14/2016 - 00:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను దేశ జిడిపి వృద్ధిరేటును ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) కూడా తగ్గించింది. ఇంతకుముందు 7.6 శాతంగా నమోదు కాగలదన్న ఆర్‌బిఐ.. ఇప్పుడు 7.1 శాతానికే పరిమితమవగా, గతంలో 7.8 శాతంగా ఉండొచ్చన్న ఎడిబి.. ప్రస్తుతం 7 శాతంగానే ఉంటుందని అంచనా వేసింది.

12/14/2016 - 00:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఢిల్లీ విమానాశ్రయంలో ఈ-షాపింగ్ సేవ ఏర్పాటు చేసినట్టు జిఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ఇక నుంచి దేశీయ ప్రయాణికులు తమకు కావాల్సిన వస్తువులను ముందుగానే అన్‌లైన్‌లో అర్డర్ చేసుకొనే అవకాశం దీనిద్వారా కల్పిస్తున్నట్టు జిఎంఆర్ గ్రూప్ తెలిపింది.

12/14/2016 - 00:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: టాబ్లెట్లు, మొబైల్ ఫోన్ల కోసం నోకియాతో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్‌ఎమ్‌డి గ్లోబల్.. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో భారతీయ మార్కెట్‌లోకి రెండు సరికొత్త ఫీచర్ ఫోన్లను తీసుకురానుంది. ఈ నోకియా 150, నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫోన్ల ధర 2,000 రూపాయల దిగువనే ఉంటుందని హెచ్‌ఎమ్‌డి సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.

12/14/2016 - 00:12

కాకినాడ, డిసెంబర్ 13: ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ సహా కోరంగి అభయారణ్యం (మడ అడవులు), కాకినాడ సాగర జలాల్లో విహరించాలనుకునే వారి కల త్వరలోనే సాకారం కానుంది. ఈ మూడు ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధిచేసి, బోటు షికారు సౌకర్యం కల్పించనున్నారు.

12/14/2016 - 00:09

విశాఖపట్నం, డిసెంబర్ 13: చల్లదనాన్ని, ప్రత్యేక అనుభూతిని కలిగించే జిసిసి శీతల పానీయం మార్కెట్‌లోకి రాబోతోంది. వచ్చే వేసవిలో దీన్ని పరిచయం చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. నన్నారి, బిల్వతో తయారు చేసిన ఈ శీతల పానీయాన్ని టెట్రా ప్యాక్ తరహాలో అందుబాటులోకి తీసుకురానుంది. సామాన్య వినియోగదారులు లక్ష్యంగా తక్కువ ధరతో దీన్ని విడుదల చేస్తున్నారు.

12/13/2016 - 00:46

ముంబయి, డిసెంబర్ 12: టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా సైరస్ మిస్ర్తిని సోమవారం తొలగించారు. ఇక్కడ జరిగిన సంస్థ అసాధారణ వార్షిక సమావేశం (ఇజిఎమ్)లో భాగస్వాములు మిస్ర్తికి వ్యతిరేకంగా ఓటేశారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా మిస్ర్తికి అక్టోబర్‌లో టాటా సన్స్ ఉద్వాసన పలికినది తెలిసిందే. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లో ఒక్కో సంస్థ నుంచి మిస్ర్తిని బయటకు పంపుతోంది టాటా సన్స్.

Pages