S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/13/2016 - 00:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెల జనవరి నుంచి వాహన ధరలు 25,000 రూపాయల వరకు పెరుగుతాయని సోమవారం సంస్థ తెలిపింది. ఉత్పాదక వ్యయం పెరిగిన నేపథ్యంలో వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 5,000 రూపాయలు, గరిష్ఠంగా 25,000 రూపాయల చొప్పున ధరలు పెరుగుతాయని, జనవరి 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని టాటా మోటార్స్ తెలిపింది.

12/13/2016 - 00:43

ముంబయి/న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన పలు శాఖల్లో చోటుచేసుకున్న అక్రమాలకుగాను బ్యాంక్ లైసెన్సు రద్దు చేస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి నిర్ణయాలు, చర్యలు తాము చేపట్టలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం స్పష్టం చేసింది. యాక్సిస్ బ్యాంక్ శాఖల్లో పెద్ద ఎత్తున రద్దయిన నోట్ల మార్పిడి జరగడం తెలిసిందే.

12/13/2016 - 00:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సామాజిక భద్రత పథకాల వర్తింపునకున్న వేతన సీలింగ్ పరిమితిని ప్రస్తుత 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచే యోచనలో ఉద్యోగ భవిష్యనిధి (ఇపిఎఫ్‌ఒ) ఉంది. ఈ నెల 19న కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో ఇపిఎఫ్‌ఒ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం అమలైతే మరో 50 లక్షల మంది వేతన జీవులకు ప్రయోజనం కలగనుంది.

12/13/2016 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న నగదు కొరత దృష్ట్యా దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్‌వేస్ ఓ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. తమ విమాన ప్రయాణీకులకు టిక్కెట్ కొనుగోళ్లపై ఇఎమ్‌ఐ సదుపాయాన్ని కల్పించింది. ముంబయి ఆధారిత విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్..

12/13/2016 - 00:38

విజయవాడ, డిసెంబర్ 12: డంపింగ్ యార్డుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త, ఘన వ్యర్థాలకు బయో మైనింగ్‌తో చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. డంపింగ్ యార్డులకు ఎక్కువ స్థలాలను కేటాయించడం సమస్యగా మారుతున్న తరుణంలో ఉన్న స్థలాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ప్రాసెస్ చేసిన చెత్తను మట్టిలో కలిసిపోయేలా చేసే అవకాశం ఈ విధానంలో ఉంది.

12/13/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణ భారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో ముగిసిన ఏడాదిలో 1,021 కోట్ల రూపాయలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్ నాటికి 22,120 కోట్ల రూపాయలుగా ఉన్న డిఎల్‌ఎఫ్ రుణాలు.. ఈ జూలై-సెప్టెంబర్ ముగిసే నాటికి 23,141 కోట్ల రూపాయలకు చేరాయి.

12/13/2016 - 00:29

ముంబయి, డిసెంబర్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. పేలవమైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అధిక చమురు ధరలు, వీసాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో నష్టాలకు లోనయ్యాయి. ముఖ్యంగా ఐటి, చమురు, గ్యాస్ రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

12/13/2016 - 00:30

సింగపూర్, డిసెంబర్ 12: వేతన జీవులకు శుభవార్త. ఆసియా-పసిఫిక్ దేశాల్లో వచ్చే ఏడాది అత్యధికంగా వేతనాలు పెరిగేది భారత్‌లోనేనని ఓ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక చెబుతోంది. భారత్‌లో 10.8 శాతం వేతనాల పెంపు ఉంటుందని మెర్సర్ సంస్థ అంచనా వేసింది.

12/12/2016 - 01:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికా రిజర్వ్ బ్యాంక్ అయన ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల ద్రవ్యసమీక్షను ఈ నెల 13న ఫెడ్ రిజర్వ్ ప్రారంభిస్తుంది. దీంతో వడ్డీరేట్ల విషయంలో ఫెడ్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది.

12/12/2016 - 01:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఫ్రాన్స్‌కు చెందిన ఆటోరంగ దిగ్గజం రెనాల్ట్.. భారతీయ మార్కెట్‌లో తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వచ్చే నెల జనవరి నుంచి 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది.

Pages