S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/24/2016 - 08:48

ముంబయి, నవంబర్ 23: టిసిఎస్‌ను రతన్ టాటా అమ్మేద్దామనుకున్నారంటూ సైరస్ మిస్ర్తి చేసిన వ్యాఖ్యలను టిసిఎస్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్‌సి కోహ్లీ ఖండించారు. గతంలో ఐబిఎమ్‌కు టిసిఎస్‌ను అమ్మేయాలని రతన్ టాటా ప్రతిపాదించినట్లు టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్ర్తి మంగళవారం ఆరోపించినది తెలిసిందే.

11/24/2016 - 08:47

ముంబయి, నవంబర్ 23: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనమవుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు నష్టపోతూ 9 నెలల కనిష్టాన్ని తాకింది. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 31 పైసలు క్షీణించి 68.56 రూపాయల వద్ద నిలిచింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విదేశీ మదుపరులు భారత్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్..

11/24/2016 - 08:47

విజయవాడ, నవంబర్ 23: విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేద, బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం అధునాతన సదుపాయాలతో టౌన్‌షిప్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

11/24/2016 - 08:46

విజయవాడ, నవంబర్ 23: విదేశీ పర్యాటకులకు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యాటక సంస్థను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సీఎంఓలో పర్యాటక శాఖాధికారులు భేటి అయినప్పుడు ఆయనపై విధంగా సూచించారు.

11/24/2016 - 08:46

గుంటూరు, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఇందులో 2017, 18, 19 సంవత్సరాలలో వౌలిక సదుపాయాల కల్పనకే 32 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సీఆర్డీయే అంచనాలు రూపొందించింది.

11/23/2016 - 01:06

ముంబయి, నవంబర్ 22: టాటా-మిస్ర్తిల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా రతన్ టాటాపై సైరస్ మిస్ర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టాటా గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ టిసిఎస్‌ను ఐబిఎమ్‌కు అమ్మేయాలని చూసినట్లు ఆరోపించారు. దేశీయ ఐటి రంగ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. 100కుపైగా సంస్థలున్న 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌లో అతిపెద్ద సంస్థ అన్నది తెలిసిందే.

11/23/2016 - 01:05

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇక బిగ్‌బజార్ స్టోర్లలోనూ నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఈ నెల 24 (గురువారం) నుంచి దేశవ్యాప్తంగా 115 నగరాలు, పట్టణాల్లో ఉన్న 258 బిగ్‌బజార్, ఎఫ్‌బిబి స్టోర్లలో డెబిట్, ఎటిఎమ్ కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాదారులు నగదును ఉపసంహరించుకునే అవకాశం లభిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతో ఈ మేరకు బిగ్‌బజార్ టైఅప్ అయ్యింది.

11/23/2016 - 01:01

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 84 శాతం ఎగిసింది. 1,434.63 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 778.37 కోట్ల రూపాయలుగా ఉంది.

11/23/2016 - 01:00

న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రభుత్వరంగ జల విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌హెచ్‌పిసి స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 27.8 శాతం పెరిగింది. 1,554.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 1,215.6 కోట్ల రూపాయలుగా ఉంది.

11/23/2016 - 00:58

భీమవరం, నవంబర్ 22: త్వరలో తపాలా కార్యాలయాలు పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా మారనున్నాయని తపాలా శాఖ డైరక్టర్ ఇవిరావు (ఆంధ్రప్రదేశ్ సర్కిల్) చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని కడప జిల్లాను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశామన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఈ పథకంపై కృషి చేస్తున్నాయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

Pages