S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/23/2016 - 00:58

న్యూఢిల్లీ, నవంబర్ 22: మొబైల్ షార్ట్ కోడ్ మెసేజ్‌లను డిసెంబర్ 31 వరకు ఉచితంగా అందించేందుకు టెలికామ్ ఆపరేటర్లు అంగీకరించారు. పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మెసేజ్‌లు ప్రధానంగా బ్యాంకింగ్ సేవలకు వినియోగిస్తారు. నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు ఇతరత్రా సమాచారాన్ని బ్యాంకులు ఈ మెసేజ్‌ల ద్వారానే ఖాతాదారులకు అందిస్తాయి.

11/23/2016 - 00:57

న్యూఢిల్లీ, నవంబర్ 22: అనిల్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్.. మంగళవారం ఓ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 149 రూపాయలకే ఏ నెట్‌వర్క్‌కైనా ఎన్నిసార్లయినా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఫీచర్ ఫోన్ లేదా స్మార్ట్ఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చంటూ ఎస్‌టిడి కాల్స్‌కు కూడా కొత్త ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

11/23/2016 - 00:57

ముంబయి, నవంబర్ 22: వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 195.64 పాయింట్లు పుంజుకుని 25,960.78 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 73.20 పాయింట్లు అందుకుని 8,002.30 వద్ద నిలిచింది. అంతకుముందు ఆరు రోజులు సూచీలు నష్టాల్లోనే కదలాడినది తెలిసిందే.

11/23/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 22: టెలికామ్ సంస్థ ఎయిర్ సెల్.. సరికొత్త డేటా, వాయిస్ కాంబో ప్యాక్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరించింది. ఆ సంస్థ సర్కిల్ ఆపరేషన్ హెడ్ వెంకటేశన్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్‌సి 497, ఆర్‌సి 555, ఆర్‌సి 599, ఆర్‌సి 799 రూపాయల ప్యాక్‌లను ప్రవేశపెట్టామన్నారు. ఎయిర్ సెల్ ఇప్పుడు 3జి డేటాను పూర్తి ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్నట్లు వెంకటేశన్ చెప్పారు.

11/23/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 22: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటెల్ మొబైల్ తమ బ్రాండ్ల విక్రయాలను ప్రారంభించింది. రెండో దశలో భాగంగా ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించగా, సంస్థ సిఇఒ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో తమ అమ్మకాలు చాలా బాగా జరుగుతున్నట్లు చెప్పారు.

11/22/2016 - 00:32

ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఆరో రోజు సూచీలు నష్టాలకే పరిమితమవగా, ఆరు నెలల కనిష్టానికి పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 385.10 పాయింట్లు కోల్పోయి 25,765.14 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 145 పాయింట్లు దిగజారి 8వేల స్థాయికి దిగువన 7,929.10 వద్ద స్థిరపడింది.

11/22/2016 - 00:30

న్యూఢిల్లీ, నవంబర్ 21: జైడస్ క్యాడిలా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పటేల్.. వచ్చే ఏడాదికిగాను పారిశ్రామిక సంఘం ఫిక్కీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే నెలతో ఫిక్కీ అధ్యక్షుడిగా అంబుజా నియోటియా గ్రూప్ చైర్మన్ హర్షవర్ధన్ నియోటియా పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పటేల్ ఫిక్కీ సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.

11/22/2016 - 00:29

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసితోపాటు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటిష్ పెట్రోలియం.. చిన్న చమురు క్షేత్రాల వేలానికి దూరంగా ఉన్నాయి. సోమవారం ఇక్కడ జరిగిన ఆన్‌లైన్ వేలంలో 46 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో 34 క్షేత్రాలకే బిడ్లు దాఖలయ్యాయి. ఈ 34 క్షేత్రాల్లోనూ 14 క్షేత్రాలకు కేవలం ఒక్కొక్క బిడ్ మాత్రమే వచ్చింది.

11/22/2016 - 00:28

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఎగుమతిదారులకు నగదు ఉపసంహరణ పరిమితి పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని అడుగుతానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ ఎగుమతి ప్రోత్సాహ మండళ్లతో గంటపాటు జరిపిన సమావేశం అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఎగుమతిదారులకు తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

11/22/2016 - 00:27

విశాఖపట్నం, నవంబర్ 21: పరిశ్రమల్లో ఉత్పత్తికి ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడిసిఎల్) ప్రత్యేక కార్యాచరణను తయారు చేస్తోంది. రానున్న వేసవి సీజన్‌తోపాటు ఏ ఒక్కరోజూ విద్యుత్ కోతలు, అంతరాయాలు, సరఫరాలో లోపాలు లేకుండా నిరంతర విద్యుత్ ద్వారా పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం కలుగకుండా చేయాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది.

Pages