S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/22/2016 - 00:25

ఆదిలాబాద్, నవంబర్ 21: ఈ ఖరీఫ్‌లో పత్తికి మద్దతు ధర ఉండదని.. ప్రత్యామ్నాయ పప్పు దినుసు పంటలే వేసుకోవాలని వ్యవసాయ క్షేత్ర అధికారి నుండి ముఖ్యమంత్రి వరకు సాగించిన విస్తృత ప్రచారం రైతులకు తీరని వ్యదను మిగిల్చింది. సర్కారు మాటలను నమ్మి పత్తిపంట సాగు విస్తీర్ణం అమాంతం తగ్గించి సోయాబీన్, పప్పు దినుసు పంటలు వేసిన రైతులు మార్కెట్‌లో మద్దతు ధరలేక, ఆశించిన దిగుబడులు రాక లబోదిబోమంటున్నారు.

11/22/2016 - 00:23

హైదరాబాద్, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దుకు రెండు రోజుల ముందే హడావుడిగా తమ షేర్లను అమ్మేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం లేదని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అధ్యక్షుడు ఎం సాంబశివ రావు ఖండించారు. రెండు రోజుల ముందు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను విక్రయించలేదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

11/22/2016 - 00:23

హైదరాబాద్, నవంబర్ 21: జపాన్‌లోని అంతర్జాతీయ సంస్థ ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్‌లో భారత్ నుండి జాతీయ నిపుణుడిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)కి చెందిన ప్రొఫెసర్ వేదుల్ల వెంకట రమణ నియమితులయ్యారు.

11/22/2016 - 00:22

గుంటూరు, నవంబర్ 21: ప్రజల ఆరోగ్యానికి నష్టం జరిగేలా వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీచేసి విక్రయిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. సోమవారం గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో శీతల గిడ్డంగుల నిర్వాహకులు, కారం మిల్లుల యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

11/22/2016 - 00:21

విజయవాడ, నవంబర్ 21: నవ్యాంధ్రలో ఒక ఉద్యమంలా పరిశ్రమల స్థాపనకు భారీ పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తున్నాయి. అన్నిరకాల పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

11/21/2016 - 00:18

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముగుస్తున్న డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలు మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయ.

11/21/2016 - 00:14

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ యాప్ ఓలా.. ఓ సరికొత్త ప్రచారానికి తెరతీస్తోంది. అదే ‘క్యాష్‌లెస్ రైడ్స్’. అవును.. 500, 1,000 రూపాయల నోట్ల రద్దు క్రమంలో తలెత్తిన చిల్లర సమస్య దృష్ట్యా ప్రయాణికులు నగదురహిత చెల్లింపు అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తోంది.

11/21/2016 - 00:14

హైదరాబాద్/నాగర్‌కర్నూల్, నవంబర్ 20: నిర్మాణ రంగం కుదేలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తం గా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయంది. అవును.. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలకుతోడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ లావాదేవీలను దెబ్బతీసింద.

11/21/2016 - 00:12

న్యూఢిల్లీ, నవంబర్ 20: మరొకరి ఖాతాలో తమ అక్రమ సొమ్మును డిపాజిట్ చేస్తే ఏడేళ్లు జైలుశిక్ష తప్పదని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. కొత్తగా తెచ్చిన బినామీ లావాదేవీల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఐటి శాఖ స్పష్టం చేసింది. ఇతరుల ఖాతాల్లో జమచేసి నల్లధనాన్ని సక్రమంగా మార్చుకోవాలనుకుంటే జరిమానాలు, విచారణలు, కారాగారం ఎదుర్కోవాల్సిందేనంది.

11/21/2016 - 00:11

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఎగుమతిదారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమావేశమవుతున్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతోపాటు ఎగుమతి రంగానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే.

Pages