S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/04/2016 - 00:45

విజయవాడ, నవంబర్ 3: పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో రిటైల్ రంగం కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఈ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. ప్రధాన ఆర్థిక వృద్ధి కారకాల్లో ఇది కూడా ఒకటని ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎపి రిటైల్ పాలసీ 2015-20ని రూపొందించింది. దేశంలో ఇలాంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం ఎపి.

11/04/2016 - 00:44

న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంకు గురువారం తన గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించింది. తాజాగా ప్రధాన ప్రత్యర్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గృహ రుణాల వడ్డీ రేట్లను 0.15 శాతం తగ్గించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ సైతం అదే దారిలో నడిచింది. రూ. 75 లక్షల దాకా గృహ రుణాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

11/03/2016 - 04:30

ముంబయి, నవంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు మూడు వారాల్లో ఎన్నడూలేనంతగా సూచీలు క్షీణించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుండటం అంతర్జాతీయ మార్కెట్లను ఒడిదుడుకులకు గురిచేసింది. ఈ క్రమంలోనే భారతీయ మార్కెట్లూ పడిపోయాయి.

11/03/2016 - 04:29

న్యూఢిల్లీ, నవంబర్ 2: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలనాత్మక టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 4జి సేవల విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 45,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హాతో రిలయన్స్ జియో నిర్వహించిన సమావేశంలో తమ నెట్‌వర్క్ తదుపరి బలోపేతానికి 45,000 టవర్లను ఏర్పాటు చేస్తామని జియో తెలిపింది.

11/03/2016 - 04:28

బొబ్బిలి, నవంబర్ 2: విశాఖ రీజియన్ పరిధిలో ఉన్న అయిదు జిల్లాల్లో 59 సిండికేట్ బ్యాంక్ బ్రాంచీల ద్వారా 3,350 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఎ సాంబిరెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకుకు రీజియన్‌లో 59 శాఖలు ఉన్నాయని, అదనంగా మరో 8 బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు.

11/03/2016 - 04:28

50 లక్షలు-కోటి రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారిలో 54,921 మంది ఉద్యోగులే. వేతనం ద్వారా యేటా కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని పొందుతున్నవారూ 24,942 మంది ఉన్నారు.

11/03/2016 - 04:26

హైదరాబాద్, నవంబర్ 2: దేశంలో వ్యాపార నిర్వహణకు అత్యంత అనువైన రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం లభించడంపట్ల పారిశ్రామిక సంఘం ఫిక్కీ తెలంగాణ అధ్యక్షుడు దేవేంద్ర సురానా హర్షం వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి అత్యంత అనువైన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన 2,550 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు.

11/02/2016 - 07:51

హైదరాబాద్, నవంబర్ 1: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను వాణిజ్య పన్నుల ఆదాయం ఆదుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో గడచిన ఏడు నెలల్లో దాదాపు 8,283.94 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. వాణిజ్యపరమైన అన్ని అంశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు వ్యవహారాలు ఆన్‌లైన్‌లో చేపట్టడం వల్ల లోపాలను ప్రభుత్వం పూరించగలిగింది.

11/02/2016 - 07:50

న్యూఢిల్లీ, నవంబర్ 1: టాటా గ్రూప్ సీనియర్ ఉద్యోగి ఎస్ రామదొరై.. ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థలైన ఎన్‌ఎస్‌డిఎ, ఎన్‌ఎస్‌డిసిల చైర్మన్‌గా తప్పుకున్నారు. టాటా సన్స్ సంక్షోభం నేపథ్యంలో రామదొరై రాజీనామా కొత్త ఊహాగానాలకు తెరలేపుతుండగా, మిస్ర్తి స్థానంలో ఆయన టాటా గ్రూప్‌నకు సారథిగా వ్యవహరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

11/02/2016 - 07:53

విజయవాడ, నవంబర్ 1: పౌల్ట్రీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. గుడ్ల ఉత్పత్తిలో పౌల్ట్రీ పరిశ్రమలు అద్భుతమైన గణాంకాలు నమోదు చేస్తున్నాయి. గిట్టుబాటు ధర విషయంలో అప్పుడప్పుడూ హెచ్చు తగ్గులున్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా గుడ్ల ఉత్పత్తిలో మనవాళ్లు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటున్నారు.

Pages