S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/30/2016 - 02:12

ముంబయి, అక్టోబర్ 29: టాటా సన్స్‌లోని ముగ్గురు ఉన్నతోద్యోగులు రాజీనామా చేశారు. టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి ఉద్వాసనకు గురైన కొద్దిరోజుల వ్యవధిలోనే మిస్ర్తి ఏర్పాటుచేసిన గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (జిఇసి) సభ్యుల్లో ముగ్గురు వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టాటా సన్స్ చైర్మన్‌గా 2012లో మిస్ర్తి బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల్లోనే జిఇసిని ఏర్పాటుచేశారు.

10/30/2016 - 02:08

గుంటూరు, అక్టోబర్ 29: రాష్ట్రంలో ఇకపై ఏడాదికి ఒకసారి కోల్డ్ స్టోరేజీల అనుమతులను రెన్యూవల్ చేయనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోల్డ్ స్టోరేజీలలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు.

10/30/2016 - 02:07

విజయవాడ, అక్టోబర్ 29: ఇంట్లోంచి వీధిలోకి అడుగుపెడితే తోపుడు బళ్ల మీదనో, ఫుట్‌పాత్‌పైనో, బుట్టలు నెత్తిన పెట్టుకునో చాలామంది వ్యాపారులు కనిపిస్తుంటారు. వాళ్లు అమ్మినదాన్ని బట్టి ఆ రోజుకు వాళ్ల కడుపు నిండటమో లేక పస్తులుండటమో జరుగుతుంటుంది. ఇలా రోజూ కాకపోయినా ఎక్కువ రోజులు కడుపు నిండా తినే విషయంలో లాటరీ కొడుతూనే ఉంటారు.

10/30/2016 - 02:05

హైదరాబాద్, అక్టోబర్ 29: ఎల్‌ఇడి బల్బుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ఈ బల్బుల వల్ల విద్యుత్ ఆదా 50 శాతం వరకు ఉందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ తెలిపారు.

10/30/2016 - 02:03

విజయవాడ, అక్టోబర్ 29: మహిళాభ్యున్నతికి వివిధ చర్యలు తీసుకుంటున్న ఎపి ప్రభుత్వం, ఐటి రంగంలో పెద్ద ఎత్తున మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. వివిధ రాయితీలు, చట్టాల నుంచి మినహాయింపుల ద్వారా మహిళలను ఐటి రంగం వైపు ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వివిధ రకాల రాయితీల ద్వారా వారికి ఐటి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐటి పార్క్‌ల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రొత్సహిస్తోంది.

10/30/2016 - 02:00

దుబాయ్, అక్టోబర్ 29: భారత్‌లో మొబైల్ వినియోగదారులు 100 కోట్లకు చేరనున్నారు. 2020 నాటికి ఇది ఖాయమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. ‘ది మొబైల్ ఎకానమీ: ఇండియా 2016’ పేరిట జిఎస్‌ఎమ్‌ఎ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఆ అధ్యయనంలో ఈ ఏడాది జూన్ ఆఖరుకల్లా దేశంలో మొబైల్ వినియోగదారులు 61.6 లక్షలుగా ఉన్నారని తేలింది.

10/29/2016 - 04:56

ముంబయి/న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ‘సంవత్ 2072’ సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. నిరుడు దీపావళి నుంచి మొదలైన ఏడాది కాలంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2,198.25 పాయింట్లు ఎగిసింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 854.65 పాయింట్లు ఎగబాకింది.

10/29/2016 - 04:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సమృద్ధిగా కురిసిన వర్షాలు, చౌక ధరల నేపథ్యంలో ఈసారి ‘్ధనత్రయోదశి’ అమ్మకాలు పెరిగాయి. నిజానికి గడచిన ఆరు నెలలుగా బంగారం, వెండి అమ్మకాలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. అయితే సెంటిమెంట్‌కుతోడు పరిస్థితులూ అనుకూలించడంతో ఈసారి ‘్ధనత్రయోదశి’ విక్రయాలు నిరుడుతో పోల్చితే 30 శాతం వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

10/29/2016 - 04:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: మారుతి సుజుకి, హ్యుందాయ్.. ‘్ధనత్రయోదశి’ సందర్భంగా శుక్రవారం 45 వేలకుపైగా కార్లను విక్రయించాయి. సుమారు 30,000 వాహనాలను అమ్మినట్లు మారుతి సుజుకి పేర్కొనగా, నిరుడుతో పోల్చితే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం. ఇక 15,153 వాహనాలను విక్రయించామని హ్యుందాయ్ స్పష్టం చేసింది. గత సంవత్సరంతో పోల్చితే ఇది 26 శాతం ఎక్కువని తెలిపింది.

10/29/2016 - 04:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 17.87 శాతం క్షీణించి 2,495.97 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 3,039.23 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages