S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/24/2016 - 06:23

హైదరాబాద్, అక్టోబర్ 23: ఈ ఆర్థిక సంవత్సరాని (2016-17)కి దేశ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతంగా నమోదు కాగలదని కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సు-2016కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేఘ్వాల్ ప్రసంగిస్తూ వ్యవసాయ రంగంలో 4 శాతానికిపైగా వృద్ధిరేటును అంచనా వేశారు.

10/24/2016 - 06:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఎల్‌పిజి (వంటగ్యాస్) రిటైల్ రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి వ్యవస్థను కలిగి ఉన్న ఆర్‌ఐఎల్.. 4 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత 4 జిల్లాల్లోనే ఈ 4 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల సరఫరాను ప్రారంభించింది.

10/24/2016 - 06:22

విజయవాడ, అక్టోబర్ 23: ఇంటర్నెట్ యాప్‌లు, కంప్యూటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగినప్పటికీ మార్కెట్‌లో తెల్లకాగితం ధర సామాన్య, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా పోతున్నది. అయినప్పటికీ ఆరుగాలం శ్రమిస్తున్న సుబాబుల్ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. కాగితం తయారీకి వినియోగించే సుబాబుల్ రైతులు నష్టాల నావను ఈదుతున్నారు.

10/24/2016 - 06:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్‌లోని 17 సంస్థల్లో తమ పెట్టుబడులను పెంచుకున్నారు. ఈ మూడు నెలల్లో ఆ 17 సంస్థలకు చెందిన 33,900 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మరో 12 సంస్థల నుంచి తమ పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు.

10/23/2016 - 02:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బయోకాన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా.. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడి తరఫున ఫ్రెంచ్ అంబాసిడర్ అలెగ్జాండ్రె జిగ్లర్ ప్రదానం చేశారు. బయోసైనె్సస్, నూతన పరిశోధనల రంగంలో షా చేసిన కృషికిగాను ‘నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అవార్డును అందించారు.

10/23/2016 - 02:45

వాషింగ్టన్, అక్టోబర్ 22: ప్రపంచ కార్పొరేట్ రంగంలో మరో భారీ కొనుగోలుకు తెర లేస్తోంది. అమెరికాకు చెందిన రెండు బహుళజాతి కమ్యూనికేషన్స్ సంస్థలు ఏకమైపోతున్నాయి మరి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం టైమ్ వార్నర్‌ను టెలికామ్ దిగ్గజం ఎటిఅండ్ టి హస్తగతం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన చర్చలు కీలక దశలో ఉండగా, ఏ క్షణమైనా డీల్ కుదరవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతోంది.

10/23/2016 - 02:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: చైనా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు పలకబోతోంది. ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న భారత్‌లో చైనా సంస్థలు మొబైల్ తయారీ కేంద్రాలను నెలకొల్పాలనుకుంటున్నాయి. దేశీయ మార్కెట్‌లో చైనా మొబైల్ సంస్థలు ఇప్పటికే అమ్మకాలపరంగా దూకుడును ప్రదర్శిస్తున్నది తెలిసిందే.

10/23/2016 - 02:40

ముంబయి, అక్టోబర్ 22: ఎస్సార్ గ్రూప్ ఆస్తులకు సంబంధించి 12.9 బిలియన్ డాలర్ల మెగా సేల్ ఒప్పందం కుదిరిన కొద్దిరోజుల వ్యవధిలోనే బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఆ గ్రూప్ చెల్లించింది. ఐసిఐసిఐ, యాక్సిస్, స్టాండర్డ్‌చార్టర్డ్ బ్యాంకులకు సుమారు 2.5 బిలియన్ డాలర్లను ముట్టజెప్పింది. ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్‌లకు 1.5 బిలియన్ డాలర్లు అందగా, స్టాండర్డ్‌చార్టర్డ్‌కు దాదాపు 770 మిలియన్ డాలర్లను ఇచ్చింది.

10/23/2016 - 02:38

విశాఖపట్నం, అక్టోబర్ 22: హిందుస్థాన్ షిప్‌యార్డును భారత నౌకాదళం విలీనం చేసుకున్న తరువాత షిప్‌యార్డు కార్యకలాపాలు పెరిగాయి. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్‌లో ఇప్పటివరకూ భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలను నిర్మించారు. నాడు తూర్పు నౌకాదళానికి అత్యంత చేరువలో ఉన్న హిందుస్థాన్ షిప్‌యార్డు నష్టాల ఊబిలో కూరుకుపోయింది.

,
10/23/2016 - 02:35

ఇండోర్, అక్టోబర్ 22: ‘మధ్యప్రదేశ్ అంతర్జాతీయ మదుపరుల సదస్సు’లో ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలు భారీగా పెట్టుబడులను ప్రకటించారు. శనివారం ఇక్కడ మొదలైన రెండు రోజుల సదస్సులో దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ సంస్థలు ముందుకొచ్చాయి.

Pages