S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/22/2016 - 06:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో 32 లక్షలకుపైగా కార్డు వినియోగదారుల భద్రతను సందిగ్ధంలోకి నెడుతూ వెలుగుచూసిన డెబిట్ కార్డు డేటా చౌర్యం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను సేకరిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)తోపాటు బ్యాంకులను ఈ అంశానికి సంబంధించిన వివరాలను అందించాలని ప్రభుత్వం కోరినట్లు చెప్పారు.

10/22/2016 - 06:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. ప్రపంచంలోని అత్యంత సంపన్నవంతమైన 15 నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో బ్రిటన్ రాజధాని లండన్ 2.7 ట్రిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 2.6 ట్రిలియన్ డాలర్ల సంపదతో న్యూయార్క్, 2.2 ట్రిలియన్ డాలర్లతో జపాన్ రాజధాని టోక్యో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని ‘న్యూ వరల్డ్ వెల్త్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

10/22/2016 - 06:44

బెంగళూరు/న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో నిరుడుతో పోల్చితే 7.6 శాతం పడిపోయి 2,070.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు శుక్రవారం సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జతిన్ దలాల్ ఓ ప్రకటనలో చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో సంస్థ లాభం 2,241 కోట్ల రూపాయలుగా ఉంది.

10/22/2016 - 06:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 16.7 శాతం పెరిగి 2,014 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 1,726 కోట్ల రూపాయలుగా ఉంది.

10/22/2016 - 06:43

ముంబయి, అక్టోబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.66 పాయింట్లు పడిపోయి 28,077.18 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.35 పాయింట్లు దిగజారి 8,693.05 వద్ద నిలిచింది.

10/21/2016 - 02:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: నికర సంపద 22.7 బిలియన్ డాలర్లకు పెరగడంతో వరుసగా తొమ్మిదో ఏడాది మన దేశంలో అత్యంత సపన్నుడిగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేష్ అంబానీ ఆస్తి ఎస్తోనియా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)తో సమానంగా ఉందని ‘్ఫర్బ్స్ ఇండియా’ పత్రిక వెల్లడించింది.

10/21/2016 - 02:49

ముంబయి, అక్టోబర్ 20: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 32 లక్షల డెబిట్ కార్డులకు సంబంధించిన ఆర్థిక సమాచారం చోరీ అయినట్లు గుర్తించడంతో సంబంధిత బ్యాంకులు 32 లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేయడమో, లేక వాపసు తీసుకోవడమో చేశాయి. ఒక ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఎటిఎం సర్వీసులను నిర్వహించే ఒక పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద ఈ సమాచారం లీకయినట్లు తెలుస్తోంది.

10/21/2016 - 02:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రాంతీయ స్థాయిలో విమానయానానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ పథకం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ పథకానికి నిధులు సమకూర్చేందుకు షెడ్యూల్డు మార్గాల్లో ప్రయాణాలపై సుంకాన్ని విధించడాన్ని ప్రభుత్వం సమర్ధించుకుంది.

10/21/2016 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 20: ఐటి ఉపకరణాల తయారీలో మేటి సంస్థ జెబ్రానిక్స్ మరో సరికొత్త గాడ్జెట్‌తో మార్కెట్లోకి వచ్చింది. యువతరాన్ని ఆకట్టుకునేందుకు కొత్తరకం సౌండ్‌బార్‌ను తీసుకువచ్చింది. వండర్‌బార్‌గా వ్యవహరిస్తున్న దీనిలో జెబ్రానిక్స్ రెండు స్పీకర్ డ్రైవ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కోక్కటీ 5.08 సెంటీమీటర్ల సైజుతో 10 వాట్ల అవుట్‌పుట్‌ని ఇస్తాయి.

10/21/2016 - 02:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారినుంచి ఆ సొమ్ము వసూలు చేయడానికి బ్యాంకు అధికారులు వారి ఇళ్ల ముందు ప్రదర్శనలు జరపడం లేదా టముకు (తప్పెట) వేయడం లాంటి చర్యలకు పాల్పడ్డం గతంలో మనం చూశాం.

Pages