S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/29/2016 - 08:21

హైదరాబాద్, సెప్టెంబర్ 28: బయోటెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాచరణ రూపొందించారు. వచ్చే ఐదేళ్లలో కనీసం ఆరు వేల కోట్ల రూపాయిల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఐదు వేల మంది నిపుణులకు ఉద్యోగావశాకాలు కల్పించనున్నారు. బయోటెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు బాతుగా మార్చుకోవాలని చూస్తోంది.

09/29/2016 - 08:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన సెల్యులార్ సంస్థ రిలయన్స్ జియో వాణిజ్య పరమైన సేవలను ప్రారంభించడానికి ముందే పెను సంచలనాలను సృష్టిస్తుండటంతో దేశీయ టెలికామ్ మార్కెట్లో ధరల యుద్ధానికి తెర లేచింది.

09/29/2016 - 08:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పెరుగుతున్న వ్యాపార విలువలు, మార్కెట్ సామర్థ్యం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో పోటీ తత్వం శరవేగంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచ పోటీతత్వ దేశాల సూచీ (గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్)లో 16 పాయింట్లు ఎగబాకి 39వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) రూపొందించిన జాబితాలో ఈ విషయం వెల్లడయింది.

09/29/2016 - 08:18

ముంబయి, సెప్టెంబర్ 28: వరసగా మూడు రోజులు నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు బుధవారం ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో సానుకూల సంకేతాల కారణంగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు రాణించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 69 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ సైతం దాదాపు 39 పాయింట్లు లాభపడింది.

09/28/2016 - 04:34

ముంబయి, సెప్టెంబర్ 27: తనయుడు అన్‌మోల్ రాకతో రిలయన్స్ క్యాపిటల్ కంపెనీకి అదృష్టం వరించిందని సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ షేర్ ధరలు 40 శాతం పెరిగాయని, ఇదంతా అన్‌మోల్ వల్లనే సాధ్యమయిందని అనిల్ అంబానీ పుత్రోత్సాహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు అన్‌మోల్ ప్రభావం ఇకపై కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

09/28/2016 - 04:32

ముంబయి, సెప్టెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా మూడో సెషన్‌లో కూడా నష్టాలతో ముగిశాయి. ప్రధాన సూచీలు ప్రారంభంలో లాభాలల్లో సాగినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి.

09/28/2016 - 04:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) రూపొందించిన 138, 182వ ఒడంబడికలను ఆమోదించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.

09/28/2016 - 04:30

జెనీవా, సెప్టెంబర్ 27: ప్రపంచ దేశాల్లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోందని, ప్రతి పదిమందిలో తొమ్మిది మంది చెడు గాలినే పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది.

09/28/2016 - 04:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశంలో అతిపెద్ద సెల్యులార్ ఆపరేటర్‌గా కొనసాగుతున్న ఎయిర్‌టెల్ టెలికామ్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న రిలయన్స్ జియోపై మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

09/28/2016 - 04:28

విశాఖపట్నం, సెప్టెంబర్ 27: విద్యుత్ సబ్‌స్టేషన్లలో పింగాణి, ఇన్సులేటర్లపై పేరుకుపోయే దుమ్ము, ధూళి వంటి కాలుష్యాన్ని తొలగించి విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు, సాంకేతికపరమైన సమస్యలు అధిగమించేందుకు వీలుగా ఎపి ట్రాన్స్‌కో హాట్‌లైన్ వాషింగ్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలో ఒక్క ముంబయిలోనే తయారయ్యే ఈ యంత్రాన్ని రూ.45 లక్షలు వెచ్చించి ఎపి ట్రాన్స్‌కో కొనుగోలు చేయడానికి టెండర్లు ఖరారయ్యాయి.

Pages