S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/24/2016 - 01:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయ. తల్లి చనిపోవడంతో మానవతా కారణాలపై ఇటీవల సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరికి ఇటీవల మంజూరు చేసిన బెయిల్‌తో పాటు అన్ని రకాల తాత్కాలిక ఊరటలను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది.

09/24/2016 - 00:54

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీలో అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకు ఏపి ట్రాన్స్‌కో సేవలను జాతీయ స్ధాయిలో వినియోగించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ వివరాలను ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి తెలిపారు. జాతీయ స్ధాయిలో విద్యుత్ పంపిణీని పటిష్టం చేయడానికి ఏపి ట్రాన్స్‌కోను సలహాదారుగా కేంద్రం నియమించిందని ఆయన చెప్పారు.

09/24/2016 - 01:29

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన స్కెవాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్ధ జాతీయ స్ధాయిలో ఐదు సంస్ధలను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వికాస్ షా ఆఫ్ వాటర్ హెల్త్ ఇండియా సంస్ధను ఎంపిక చేశారు.

09/24/2016 - 00:52

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్ధ రిలయన్స్ జియో ఇన్ఫ్‌కామ్ సంస్ధ ఈ నెల 25వ తేదీన టెడెక్స్ హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ ప్రకటించింది. టెడెక్స్ హైదరాబాద్ డిజిటల్ కనెక్టివిటీ పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తారు. గచ్చిబౌలి లోని సంధ్య కనె్వన్షన్ సెంటర్‌లో ఈ సదస్సును ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు ప్రారంభిస్తారు.

09/24/2016 - 00:51

ముంబయి, సెప్టెంబర్ 23: సుమారు రూ.6 వేల కోట్ల కార్పస్ నిధితో ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్‌తో ఏర్పాటు చేయబోయే రెండవ సిపిఎస్‌ఇ ఎక్స్‌చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను నిర్వహించడానికి ప్రభుత్వం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను మేనేజర్‌గా నియమించింది.

09/24/2016 - 00:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రూ.4615 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇనె్వస్టర్లకు పెట్టుబడి పరిమితులను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి బిఎస్‌ఇ సోమవారం వేలం వేయనుంది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 3.30- 5.30 గంటల మధ్య బిఎస్‌ఇకి చెందిన ‘ఇబిడ్‌ఎక్స్‌చేంజి’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వేలం నిర్వహిస్తారు.

09/24/2016 - 00:50

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రా బ్యాంకు తమ ఖాతాదారులకు ఆరోగ్య, సాధారణ బీమా వసతి కల్పించేందుకు సిగ్నా టిటికె కంపెనీ లిమిటెడ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కార్పొరేట్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

09/24/2016 - 00:50

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఢిల్లీ నుంచి విశాఖకు మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు విశాఖ నుంచి విమానాల రాకపోకలకు అవరోధంగా నిలిచాయి. అయితే విశాఖ విమాన ప్రయాణికుల విజ్ఞప్తికి స్పందించిన పౌర విమానయాన శాఖా మంత్రి పి అశోక్ గజపతిరాజు ఢిల్లీ నుంచి మరో సర్వీసును విశాఖకు నడిపేందుకు అంగీకరించారు.

09/23/2016 - 00:18

ముంబయి, సెప్టెంబర్ 22: వడ్డీ రేట్లను కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 266 పాయింట్లు లాభపడి రెండు వారాల గరిష్ఠ స్థాయి అయిన 28,773.13 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎఖ్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 90.30 పాయింట్లు లాభపడి మళ్లీ 8,800 పాయింట్ల ఎగువన ముగిసింది.

09/23/2016 - 00:16

హైదరాబాద్, సెప్టెంబర్ 22: స్మార్ట్ సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్న విశాఖపట్టణానికి సరికొత్త దశ పట్టనుంది. ఇక మీదట వైజాగ్ ప్రముఖ ఐటి హబ్‌గా సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చెందనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. దీనికి ఐటి వర్గాల నుండి కూడా సానుకూల స్పందన వస్తోంది. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటి టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది.

Pages