S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/21/2016 - 00:44

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: భారత్‌లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన జునైద్ అహ్మద్ నియమితులయ్యారు. మన దేశంలో గత నాలుగేళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేసిన ఒన్నో రల్ స్థానంలో జునైద్ అహ్మద్‌ను నియమించారు. బంగ్లాదేశ్‌కు చెందిన జునైద్ అహ్మద్ ప్రస్తుత పదోన్నతి పొందడానికి ముందు జిమ్ యంగ్ కిమ్ సారథ్యంలోని ప్రపంచ బ్యాంకు గ్రూపునకు చీఫ్ ఆఫ్ స్ట్ఫాగా సేవలు అందించారు.

09/21/2016 - 00:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ది సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వి పద్మనాభం అన్నారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2010 నాటికి భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రూ.10వేల కోట్లు ఉంటే, 2014-15 నాటికి రూ.3,500 కోట్లకు పెరిగాయని అన్నారు.

09/21/2016 - 00:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో సంస్కరణల ప్రక్రియ మందకొడిగా సాగుతోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్జన్సీ మూడీస్ అంటూ, సంస్కరణలు గనుక పరిగణించే విధంగా ఉన్నట్లయితే ఒకటి రెండేళ్లలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపింది.

09/21/2016 - 00:41

ముంబయి, సెప్టెంబర్ 20: ప్రపంచంలో 21 దేశాలకు పండ్లను ఎగుమతి చేస్తున్న ప్రముఖ హార్టీకల్చర్ సంస్థ ఐఎన్‌ఐ ఫార్మ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 10 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

09/21/2016 - 00:40

భువనేశ్వర్, సెప్టెంబర్ 20: నిర్మాణ రంగ కార్మికులకు ఇసిఐఎస్, ఇపిఎఫ్ పథకాల ప్రయోజనాలు వర్తింపజేయాలని, అలాగే ఇసిఐఎస్ కింద సైకిల్-రిక్షా డ్రైవర్లతో పాటు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు దశల వారీగా లబ్ధి చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మంగళవారం ప్రారంభమైన జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ విషయాన్ని వెల్లడించారు.

09/20/2016 - 17:39

ముంబయి: వరుసగా నాలుగు రోజులు లాభాల్లో కొనసాగిన సూచీలు మంగళవారం నష్టాల బాటపట్టాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 111 పాయింట్లు నష్టపోయి 28523 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 32.50 పాయింట్లు నష్టపోయి 8776 పాయింట్లవద్ద ముగిసింది.

09/20/2016 - 08:32

ముంబయి, సెప్టెంబర్ 19: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై బాంబే హైకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన సంస్థకు ఎంతో తగ్గట్టుగా ‘కింగ్‌ఫిషర్’ అనే పక్షి పేరు పెట్టుకున్న విజయ్ మాల్యా సరిహద్దులను ఏమాత్రం ఖాతరు చేయకుండా అచ్చం ఆ పక్షి మాదిరిగానే దేశం నుంచి ఎగిరిపోయాడని న్యాయస్థానం పేర్కొంది.

09/20/2016 - 08:29

ముంబయి, సెప్టెంబర్ 19: గత వారం వరసగా మూడు రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా అదే ధోరణిని కొనసాగించాయి. భారీ లాభాలు లేకపోయినప్పటికీ ప్రధాన సూచీలైన సెనె్సక్స్, నిఫ్టీలు రెండూ కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ద్రవ్య విదానాలపై ప్రధాన బ్యాంకులైన అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకులు ఈ వారంలో సమావేశం కానున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా లాభాలబాటలో సాగాయి.

09/20/2016 - 08:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు ఏర్పడడం తగ్గుముఖం పడుతుందని, ఫలితంగా రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలంలో బ్యాంకింగ్ రంగం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇనె్వస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది.

09/20/2016 - 08:28

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రమంగా రికవరీ వైపు మారుతున్నందున ఈ ఏడాది ఉన్న 4 శాతంగా ఉన్న వర్థమాన దేశాల మార్కెట్ వృద్ధి 2017లో 4.7 శాతానికి మెరుగుపడుతుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది.

Pages