S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/20/2016 - 08:28

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: అనేక రకాల సాంకేతిక సమస్యలతో నిలిచిపోయే విద్యుత్ సరఫరాను క్షణాల్లో మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆన్‌లైన్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల విద్యుత్ అంతరాయం విషయం క్షేత్రస్థాయి అధికారులకు క్షణాల్లో తెలిసిపోతుంది. దీనిపై అందిన ఫిర్యాదుల పట్ల కేవలం 30 నిమిషాల్లో స్పందించకపోతే ఆ పైస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తుంది.

09/20/2016 - 08:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపునకు వాటాను అమ్మేందుకు గల అవకాశాలపై ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సోమవారం వెల్లడించింది.

09/20/2016 - 08:26

నల్లగొండ, సెప్టెంబర్ 19: తెలంగాణ వెలుగుదివ్వెగా ప్రచారం పొందిన నల్లగొండ జిల్లా పరిధిలోని దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం మరోసారి సందిగ్ధంలో పడింది. తెలంగాణలోని భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌కు ఎట్టకేలకు అనుమతినిచ్చిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసి) మరోసారి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు మాత్రం మొండిచేయి చూపింది.

09/19/2016 - 07:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చే వారం మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపించనున్న ఈ వారం జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన సమీక్ష సమావేశం ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ వారం స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ అంతర్జాతీయ కేంద్ర బ్యాంకుల సమావేశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అందరి దృష్టీ ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానకర్తలపైనే ఉంటుంది.

09/19/2016 - 07:06

ముంబయి, సెప్టెంబర్ 18: ఆగస్టు నెలలో భారతీయ సంస్థల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 84 శాతం తగ్గి 399.06 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో భారతీయ కంపెనీలు విదేశీ మార్కెట్లలో 24.7 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ ఏడాది జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో ప్రత్యక్ష పెట్టుబడులు 82.6 శాతం తగ్గాయి.

09/19/2016 - 07:06

ముంబయి, సెప్టెంబర్ 18: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి తమకు రావలసిన బకాయిలను వసూలు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం గోవాలో ఆయనకు చెందిన ప్రధాన స్థిరాస్తి ‘కింగ్‌ఫిషర్ విల్లా’ను అమ్మకానికి పెట్టింది.

09/19/2016 - 06:59

భీమవరం, సెప్టెంబర్ 18: ఆక్వా రంగం అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ఎగుమతుల పెంపుపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్థానికంగా చేపల వినియోగం పెంచడంపై కూడా దృష్టిసారించింది. చేపలు ఆరోగ్యపరంగా ఎంతో విలువైన, బలవర్థకమైన మాంసాహారంగా వైద్యులు సైతం సూచించే సంగతి అందరికీ తెలిసిందే.

09/19/2016 - 06:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ కరెంట్ ఖాతా మిగులులో ఉండవచ్చని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ సిటీ గ్రూపు అభిప్రాయ పడింది. వాణిజ్య లోటు దిగువ స్థాయిలో స్థిరపడుతోందని, ఆగస్టు నెల వాణిజ్య లోటును కూడా కలిపి చూసినట్లయితే కరెంట్ ఖాతా విషయంలో స్థూలంగా సమతుల్యతతో ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయ పడింది.

09/19/2016 - 06:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దాదాపు రూ.6,057 కోట్ల విలువైన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) సోమవారం మార్కెట్లలోకి ప్రవేశించనుంది. దాదాపు ఆరేళ్ల కాలంలో భారతరుూ మార్కెట్లలోకి వస్తున్న అతి పెద్ద ఐపిఓ ఇదే కావడం గమనార్హం. భారతీయ మార్కెట్లలో తొలి బీమా పబ్లిక్ ఆఫర్ అయిన ఈ ఐపిఓ సోమవారం (19న) బిడ్డింగ్‌కు ప్రారంభమై 21న ముగుస్తుంది.

09/19/2016 - 06:56

కాకినాడ, సెప్టెంబర్ 18: విపక్షాలు చేపడుతున్న ఆందోళనలను ఎంతమాత్రం ఖాతరు చేయకుండా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలను స్వాగతించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా చేసిన ప్రకటనతో ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి రెడ్ కార్పెట్ పరచినట్టు స్పష్టమవుతోంది.

Pages