S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/04/2016 - 01:02

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలకు భారీగా రాయితీలు ప్రకటించడంతో ప్రముఖ దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఈ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల విషయంలో ఎపి ముందున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఐటి పరిశ్రమకి కావలసిన మానవ వనరుల (ఐటి నిపుణులు)కు ఇక్కడ కొదవ లేదు.

09/04/2016 - 01:00

హైదరాబాద్, సెప్టెంబర్ 3: సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు 6.20 కోట్ల రూపాయల సొమ్మును చెల్లించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ను నాంపల్లి పదవ అదనపు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శనివారం ఆదేశించారు. ఈ మేరకు మూడు డిక్రీలను కోర్టు జారీ చేసింది. ఫిన్సిటీ ఇనె్వస్ట్‌మెంట్స్, హైగ్రేస్ ఇనె్వస్ట్‌మెంట్స్, ఏలెమ్ ఇన్విస్టిమెంట్స్ సంస్థలు కోర్టులో మూడు దావాలను దాఖలు చేశాయి.

09/04/2016 - 00:59

హైదరాబాద్, సెప్టెంబర్ 3: పరిశోధనలను ప్రోత్సహించే విధంగా రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్‌ఐసిహెచ్)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు తెలం గాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తెలంగాణను దూ సుకెళ్తున్న రాష్ట్రంగా అభివర్ణిం చిన ఆయన శనివారం ఇక్కడ స్టార్టప్ కాన్ఫరెన్స్ ఆగస్ట్ ఫెస్ట్‌ను ప్రారంభించారు.

09/03/2016 - 16:07

దిల్లీ: వెండి ధర ఒక్కరోజే రూ. 800 పెరగడంతో 45 వేల మార్కును దాటింది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర శనివారం రూ. 45,900గా ఉంది. బంగారం కూడా 31వేల మార్కును చేరింది. బులియన్‌ మార్కెట్లో రూ. 30 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31వేలకు చేరింది.

09/03/2016 - 07:44

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రిటైల్ విక్రయ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఇకపై ఏటా కొత్తగా 10 నుంచి 15 స్టోర్లను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. శనివారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 6 మెగా ఎలక్ట్రానిక్ షోరూమ్‌లను తెరుస్తామని ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పాయ్ తెలిపారు.

09/03/2016 - 07:41

విజయవాడ, సెప్టెంబర్ 2: వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అగ్రగామి కావాలనుకుంటోంది.

09/03/2016 - 07:40

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఏపి జెన్కోలో దశలవారీగా ఈ-ఆఫీసు కార్యకలాపాలను ప్రవేశపెడుతున్నామని, దేశం మొత్తం మీద ఈ టెక్నాలజీని అమలు చేసిన తొలి విద్యుత్ సంస్థ ఏపి జెన్కోనే అని ఆ సంస్థ సిఎండి కె విజయానంద్ అన్నారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ సహకారంతో ఏపి ట్రాన్స్‌కోలో ఏర్పాటు చేసిన ఈ-ఆఫీసు కార్యకలాపాలను శుక్రవారం ఇక్కడ విద్యుత్ సౌధ సమావేశ మందిరంలో ఆయన ప్రారంభించారు.

09/03/2016 - 07:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా శుక్రవారం కార్మిక లోకం పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె ప్రభావం ఆటోరంగ సంస్థల్లో పాక్షికంగానే కనిపించింది. మారుతి సుజుకితోపాటు టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా ప్లాంట్లలో కార్మికుల హాజరు 80 శాతం వరకు ఉన్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.

09/03/2016 - 07:38

ముంబయి, సెప్టెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 16 నెలల గరిష్ఠాన్ని తాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ 8,800 మార్కును అధిగమించింది. ఆగస్టు నెలలో ఆటో రంగ అమ్మకాలు బాగుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడటం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే గురువారం నష్టాల్లో ముగిసిన సూచీలు తిరిగి లాభాలను అందుకోగలిగాయి.

09/02/2016 - 16:08

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. నిన్నటి రిలయన్స్‌ జియో దెబ్బకు కుదేలైన టెలికాం షేర్లు.. ఈ రోజు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాల బాటలో నడిచాయి. అయితే మధ్యాహ్నం సమయానికి కోలుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.84 వద్ద ట్రేడ్‌ అయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 108.63 పాయింట్లు లాభపడి 28,531.11 వద్ద ముగిసింది.

Pages