S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/02/2016 - 01:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాయితీపై ఇచ్చే వంటగ్యాస్ సిలిండర్ ధరను గురువారం దాదాపు 2 రూపాయలు పెంచిన ప్రభుత్వం, విమాన ఇంధన ధరను మాత్రం 3.8 శాతం తగ్గించింది. జూలై నుంచి సబ్సిడీ వంటగ్యాస్ ధర పెరగడం ఇది మూడోసారి. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకూ రూ.423.09గా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ఇకమీదట 425.06 రూపాయలకు లభ్యమవుతుందని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పేర్కొన్నాయి.

09/02/2016 - 01:05

ముంబయి, సెప్టెంబర్ 1: టెలికామ్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి ముందే పెను సంచలనాలను సృష్టిస్తూ దేశ వ్యాప్తంగా నాలుగో తరం (4జి) మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వడివడిగా ముందుకు సాగుతున్న రిలయన్స్ జియో సాధ్యమైనంత త్వరలో 10 కోట్ల మంది ఖాతాదారులకు చేరువకావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.

09/02/2016 - 01:01

ముంబయిలో గురువారం జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవీ..
* ఇప్పటివరకూ ‘గాంధీగిరి’ని అభినందించిన భారతీయులు ఇకమీదట ‘డేటా-గిరి’ని అభినందిస్తారు.
* డిజిటల్ జీవనానికి డేటాయే ప్రాణాధారం. కనుక డేటా ధరలు వ్యయభరితంగా ఉండకూడదు.

09/02/2016 - 01:00

ముంబయి, సెప్టెంబర్ 1: కొత్తగా టెలికాం సేవల రంగంలోకి అడగుపెట్టిన రిలయన్స్ సంస్థ తన చౌక ధరల జియో టారిఫ్‌లను ప్రకటించిన నేపథ్యంలో గత మూడు రోజులుగా లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

09/02/2016 - 00:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రిలయన్స్ జియో దెబ్బకు గురువారం ప్రధాన టెలికాం సంస్థల షేర్లు కుదేలయ్యాయి. జియో వినియోగదారులకు జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్, 50 రూపాయలకే 1జిబి డేటా లాంటి ఆఫర్లను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడం టెలికాం కంపెనీలపై ప్రభావం చూపించింది. దీంతో ఆ సంస్థల షేర్లు భారీగా పతనమైనాయి. గురువారం బిఎస్‌ఇలో ఐడియా సెల్యులార్ షేరు ధర 10.48 శాతం పడిపోయింది.

09/02/2016 - 00:58

ముంబయి, సెప్టెంబర్ 1: ఆర్థికాభివృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ప్రాధాన్యమమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇందుకోసం నియంత్రణ, చట్టాల్లో మార్పులులాంటి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

09/02/2016 - 00:57

కొత్తగూడెం, సెప్టెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ తడబడుతోంది. వేసవికాలంలో ఎండలు, ప్రస్తుత కాలంలో వర్షాలు ఉత్పత్తికి ఆటంకంగా మారాయి. ఆగస్టు మాసం పూర్తయ్యేసరికి గడచిన ఐదు మాసాల్లో 2 కోట్ల 47 లక్షల 79 వేల 600 టన్నులు సాధించాల్సి ఉండగా 2 కోట్ల 21లక్షల 57 వేల 930 టన్నులు మాత్రమే సాధించి 89 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది.

09/02/2016 - 00:55

హైదరాబాద్, సెప్టెంబర్ 1:తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వ సహకారం బాగుందని జాన్సన్ అండ్ జాన్సన్ గ్రూప్ అభినందించింది. జాన్సన్ అండ్ జాన్సన్ సీనియర్ ఉపాధ్యక్షురాలు క్యాతీ వెంగల్‌త కెటిఆర్ గురువారం సమావేశం అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రాంగణంలో మంత్రి, క్యాతీ వెంగల్ మొక్కలు నాటారు. జాన్సన్ అండ్ జాన్స్‌ను ప్రాంగణాన్ని సందర్శించారు.

09/01/2016 - 17:32

ముంబై : రిలయన్స్ జియో డేటా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలు బెంబెలెత్తిపోతున్నాయి. ఎయిర్‌ టెల్‌, ఐడియా రూ. 12 వేల కోట్లకు పైగా మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయాయి. రిలయన్స్ దెబ్బకు టెలీకాం కంపెనీలు దాదాపు రూ. 14 వందల కోట్లు నష్టపోయాయి. ఐడియా షేరు 10.49 శాతం, ఎయిర్‌ టెల్‌ 6.27 శాతం కోల్పోయాయి.

09/01/2016 - 07:56

విజయవాడ, ఆగస్టు 31: ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూరిజం పాలసీ విజయవంతమైంది. ప్రభుత్వ అంచనాలకు మించి ఆదరణ లభిస్తోంది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వరదలా తన్నుకొస్తున్నాయి. పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించాలని భావించిన చంద్రబాబు సర్కారు.. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన ప్రాజెక్టులతో కలిపి ఓ ప్రణాళిక రూపొందించింది.

Pages