S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/30/2016 - 04:23

బెంగళూరు, ఆగస్టు 29: ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌డాట్‌ఇన్.. తెలుగు పుస్తకాల కోసం ఓ ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌ను ప్రారంభించింది. ఇందులో 10వేలకుపైగా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు లభిస్తాయని సోమవారం తెలిపింది. క్లాసిక్స్, లిటరేచర్, ఫిక్షన్, బయోగ్రఫీస్, బిజినెస్, ఫైనాన్స్, సెల్ఫ్-హెల్ప్, వంటల పుస్తకాలు తమ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని వివరించింది.

,
08/30/2016 - 04:21

సంగారెడ్డి, ఆగస్టు 29: మెట్ట పంటల సాగుకు పెట్టింది పేరైన తెలంగాణ భూముల్లో మేలైన ఆధునిక వంగడాలను పండించడానికి అవకాశం కల్పిస్తూ కొత్త పరిశోధనల కోసం నెలకొల్పిన ఇక్రిశాట్ సేవలు అన్నదాతలకు అంతంత మాత్రంగానే అందుతున్నాయ. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సందర్భాల్లో వ్యవసాయ పంటల సాగును ప్రస్తావిస్తూ ఇక్రిశాట్‌ను గుర్తు చేసుకున్నారు.

08/30/2016 - 04:17

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే భారీగా పెరిగింది. ఈసారి 8,268.98 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 6,590.83 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో నిరుడుతో సరిచూస్తే ఈసారి 25 శాతం లాభాలు పెరిగినట్లైంది.

08/29/2016 - 16:33

ముంబయి: సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.16 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 120 పాయింట్ల లాభంతో 27,902 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 8,607 వద్ద ముగిసింది.

08/29/2016 - 04:16

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మీ మూసివేతపై స్పందించాలని బిజెపి ఎంపి సుబ్రమణ్యం స్వామి.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ (ఎమ్‌సిఎ)శాఖను కోరారు. దీనివల్ల 4,000 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని అందుకే జోక్యం చేసుకోవాలంటూ ఎమ్‌సిఎ కార్యదర్శి తపన్ రాయ్‌కి స్వామి ఓ లేఖ రాశారు.

,
08/29/2016 - 04:16

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాలం మారుతున్నకొద్దీ మనుషుల అవసరాలూ పెరుగుతున్నాయి. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో సమయమన్నది ఎంతో విలువైనదిమరి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తవ్వాలని ఇప్పుడు చాలామంది కోరుకుంటున్నారు. దీంతో తమ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగానే వివిధ పరిశ్రమలూ ముందుకెళ్తున్నాయి. టెక్నాలజీ సాయంతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి.

08/29/2016 - 04:13

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం యెల్లెన్ ద్రవ్యసమీక్ష సందర్భంగా మాట్లాడగా, అప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీంతో సోమవారం దీనిపై సూచీలు స్పందించే వీలుందని పేర్కొంటున్నారు.

08/29/2016 - 22:21

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 28: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల సమీపంలోని కెసిపి సిమెంట్స్ కర్మాగారంలో రెండో ప్లాంట్ నిర్మాణానికి ఆ సంస్థ జెఎండి వెలగపూడి ఇందిరాదత్తు ఆదివారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 1.86 మిలియన్ టన్నులని, దాన్ని రూ. 400 కోట్ల వ్యయంతో రెట్టింపు చేస్తున్నామన్నారు. 2017 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్‌ను పూర్తిచేస్తామని, మరో రూ.

08/29/2016 - 04:09

హైదరాబాద్, ఆగస్టు 28: ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఎనలిటిక్స్, నెట్‌వర్క్స్‌లో సైయెంట్ సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ వ్యవస్ధాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991లో సైయెంట్ ప్రారంభమైందన్నారు. 3 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెప్పారు.

08/29/2016 - 04:07

న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ మదుపరులు ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 8,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు.

Pages