S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/12/2016 - 00:57

ముంబయి, ఆగస్టు 11: ఓ వైపు అమ్మకాలు, మరో వైపు కొనుగోళ్ల మధ్య గురువారం రోజంతా ఆటుపోట్ల మధ్య సాగిన దేశీయ మార్కెట్లు చివరి అరగంటలో ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సెనె్సక్స్ దాదాపు 85 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 17 పాయింట్లు లాభపడింది.

08/12/2016 - 00:56

న్యూయార్క్, ఆగస్టు 11: ప్రపంచంలో అత్యంత సంపన్నులైన 100 మంది సాంకేతిక రంగ ప్రముఖులతో ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన తాజా జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన తొలి 20 మందిలో విప్రో సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సిఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్‌లకు మాత్రమే భారత్ నుంచి చోటు లభించింది. గూగుల్ సంస్థ అధినేత ఎరిక్ ష్మిడ్, ఉబర్ సంస్థ సిఇఓ ట్రవిస్ కాలనిక్ కంటే వీరు ముందున్నారు.

08/12/2016 - 00:54

లండన్, ఆగస్టు 11: ప్రధాని నరేంద్ర మోదీపై తాను ఏం చెప్పినా అది సమస్యాత్మకం అవుతుందని త్వరలో ఆర్‌బిఐ గవర్నర్ పదవినుంచి తప్పుకొంటున్న రఘురామ్ రాజన్ అన్నారు. ఇటీవలి కాలంలో రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కొందరయితే అవి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేసినవేనంటూ ప్రచారం చేయడం తెలిసిందే.

08/12/2016 - 00:53

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శ్యాంసంగ్ గురువారం తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ఫోన్ ‘గెలాక్సీ నోట్-7’ను భారత్‌లో ఆవిష్కరించింది. దీని ధరను 59,900 రూపాయలుగా నిర్ణయించింది. అంతేకాకుండా తమ ఖాతాదారులకు మూడు నెలల పాటు ఉచితంగా వాయిస్, డేటా సర్వీసులను అందించేందుకు రిలయన్స్ జియోతో శ్యాంసంగ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

,
08/12/2016 - 00:52

ఆకివీడు, ఆగస్టు 11: డాలర్లు పండించే రొయ్యలు రైతుల్ని డీలాపడేలా చేశాయి. అంతుచిక్కని వైరస్ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఆక్వా రైతులను కుదేలుచేస్తోంది. రెడ్ డిసీజ్‌గా పిలుస్తున్న ఈ వ్యాధి గంటల వ్యవధిలోనే చెరువులోని రొయ్యలన్నిటికీ సోకి, మృత్యువాతపడుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే రెండు జిల్లాల్లో సగానికి పైగా రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. సాగుచేస్తున్న రైతులు కోట్లలో నష్టపోయారు.

08/12/2016 - 00:47

హైదరాబాద్, ఆగస్టు 11: శ్రీలంక తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి గల అవకాశాలపై ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు శ్రీలంకలోని భారత హై కమీషనర్ వైకె సిన్హాతో చర్చించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న కెటిఆర్ వైకె సిన్హాతో గురువారం సమావేశం అయ్యారు. కొలంబో, హైదరాబాద్ ల మధ్య నేరుగా విమన సౌకర్యంపై చర్చించారు.

08/12/2016 - 00:47

బెంజిసర్కిల్, ఆగస్టు 11: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు తన వంతుగా చేయూతను అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ కానె్సప్ట్ నోట్‌కు ప్రపంచ బ్యాంకు అమోద ముద్రను వేసింది. అమరావతిలో గత నాలుగు రోజులుగా పర్యటించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటన విజయవంతం అయ్యింది.

08/12/2016 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 11: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) లెక్కలు వసూళ్ల నిర్వహణకోసం యుపిఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సంస్థలో ప్రైవేటు సంస్థలకు మెజారిటీ వాటా ఉండడం పట్ల బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ స్థానంలో పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

08/12/2016 - 00:46

ఒంగోలు,ఆగస్టు 11: ఒంగోలు డెయిరీ పాల విక్రయాల ప్రారంభం విజయవాడలోని వి కన్వన్షన్‌హాలులో గురువారం ప్రారంభం అయ్యాయి. విజయవాడతోపాటు గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లోనూ ఒంగోలు డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయాలను డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు.

08/12/2016 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చేవారం రూ 15,000 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ఇష్యూను తెరవనుంది. ఒక్కోటి రూ 10 లక్షల ముఖ విలువ కలిగిన మొత్తం 15,000 సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (మొత్తం రూ.

Pages